22-01-2023 ఆదివారం రెండవ ఆరాధన – నీలో ఉన్నవాడు
మనము అడిగినది నెరవేర్చడానికి ఆయన తలుపు తడుతున్నాడు. నీవు ఊహించనిది అయినప్పటికీ ఆయన సిద్ధపరచినది జరిగించడానికి ఆయన తలుపు తడుతున్నాడు.
ఈరోజు నీవు పరీక్ష చేసుకో ఎక్కడ నీ తలుపులు మూసావు? నీ జ్ఞానమును బట్టి నీవు మూసేసావేమో, నీకు తెలిసిన బోధను బట్టి నీవు మూసేసావేమో. ఈరోజైనా ఈ మాటలు విన్న నీవు ఈరోజు నీ తలుపులు తీస్తావా? దేవుని తో చెప్తావా? అయ్యా నీ మాట ప్రకారము నా జీవితములో జరుగును గాక అని చెప్తావా?