ఆత్మీయ సందేశములు

ఆత్మీయ సందేశములు

12-03-2023 ఆదివారం మొదటి ఆరాధన

“నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు” అనగా ఏమిటి? కేవలము పొందుకోవడము మాత్రమే కాదు కానీ, దినదినమూ ఆ జీవములో నిలిచి కొనసాగునట్లు అని అర్థము. పాపము అనుమతిస్తే, జీవము పోగొట్టుకుంటాము. అయితే ఆ జీవములో నిలిచి ఉన్నప్పుడు ఆ జీవములోనూ వృద్ధి కలుగుతుంది. ఉదాహరణకు చిన్నపిల్లవాడిని చూస్తే, మొదట వాడు బలహీనముగా ఉంటాడు, ఆధారపడి ఉంటాడు అయితే ఎదిగే కొద్దీ, వాడిలో మార్పు వస్తుంది. అలాగే మనము కూడా, ఆ జీవములో నిలిచి ఉంటే, మన క్రియలలో మార్పు కనబడుతుంది.

05-03-2023 ఆదివారం రెండవ ఆరాధన – కృప విస్తరించును 

ఈ లోకములో అనేకమైన మర్యాదలు, వ్యవహారములు ఉన్నాయి. అయితే వాటి ప్రకారము కాకుండా, దేవుని చిత్తప్రకారము ఏది మచిది? ఏది ఉత్తమమైనది అని తెలుసుకుని ఆ ప్రకారము చెయ్యాలి! మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. బలిగా అర్పించుట అనేదానిని గమనించినపుడు, ఒకసారి అర్పించినతరువాత దానిలో ఇక ఏ మాత్రము జీవము ఉండదు. అలాగే మనము సజీవ యాగముగా మనము అర్పించినప్పుడు, మన జీవితములో ఇంతకు ముందు ఉన్న లోకానుసారమైన సంగతులు ఇక జీవించకూడదు.

05-03-2023 ఆదివారం మొదటి ఆరాధన – ఆయనయందు నిలచి యుండుడి

ఈరోజు నేర్చుకున్న నాలుగు విషయాలు.
1. దేవుని ప్రేమను కలిగి ఉండాలి.
2. దేవుని మాటలు లోబడి ఆజ్ఞలు పాటించాలి.
3. ఆయన నామమును ఒప్పుకోవాలి.
4. ఆయన శరీరము, రక్తములో పాలు కలిగి ఉండాలి.

26-02-2023 ఆదివారం రెండవ ఆరాధన – మీరు దేవుని వారసులై ఉన్నారు

క్రీస్తు ఆత్మ యొక్క లక్షణములు
1. తండ్రి చిత్తమే నెరవేర్చుట.
2. పరిశుద్ధత కలిగి జీవించుట.
3. దేవుని మాటకు విధేయత చూపుట.

26-02-2023 ఆదివారం మొదటి ఆరాధన – దేవుని ఏర్పాటు ఎందుకో తెలుసా?

మనము గమనించవలసిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు
1. కృప చేత రక్షించబడ్డాము కనుక ఆయన కృపకు మహిమకరముగా జీవించాలి
2. యేసు క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా ఉండుట
3. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి.

19-02-2023 ఆదివారం రెండవ ఆరాధన – ఆయనే మన నిరీక్షణ

యేసయ్య మాట్లాడిన ప్రతీ మాటలో ఒక అర్థము ఉంటుంది. పేతురుకు రాత్రి అంతా కష్టపడినా ఏమి దొరకని సందర్భములో, ఇంకా లోతుగా వెళ్ళి వలవెయ్యమని చెప్పారు. అలాగే, నీ ఆత్మీయమైన జీవితములో లోతుగా వెళ్ళినప్పుడే విస్తారమైనవి పొందుకోగలుగుతావు. కేవలము యేసయ్యను స్వంతరక్షకుడిగా అంగీకరించాను అనే పునాదిలోనే ఉండిపోకూడదు. నీ జీవితములోని ప్రతీ సందర్భములో, ఆయన నిన్ను నాశనమునుండి రక్షించి తప్పిచుటకు పంపబడ్డాడు అనే సత్యము ఎరిగి, ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి.

19-02-2023 ఆదివారం మొదటి ఆరాధన – నీ విశ్వాసమును బట్టి

చాలా సందర్భాలలో మన జీవితాలలో మనకు వ్యతిరేకమైనవి మనముందు చాల కనబడుతుంటాయి. అట్టి సందర్భాలలో చాలా అందోళనకరంగా గలిబిలితోను ఉంటాము. అయితే మన దేవుడు మంచిదేవుడు. కొంతమంది జీవితాలు సాఫీగా ఉంటాయి, కొంతమంది జీవితాలు కష్టాలతో నిండి ఉంటుంది. అయితే వీరిరువురికీ కూడా ఆయనే దేవుడు. దేవునిని అర్థము చేసుకున్నట్టయితే ఆయన మంచితనాన్ని అర్థము చేసుకోగలుగుతాము. అందుకే మన జీవితాలలో దేవుని గూర్చిన నెగటివ్ ఆలోచనలు అస్సలు రానివ్వకూడదు. “నాకే ఎందుకే ఇలా” అనే ఆలోచన వచ్చినప్పుడల్లా నీవు జ్ఞాపకము చేసుకోవలసినది, “దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు” అనే సత్యము జ్ఞాపకము చేసుకో!

12-02-2023 ఆదివారం మొదటి ఆరాధన

ఈ లోకములో అనేకమైన మర్యాదలు, వ్యవహారములు ఉన్నాయి. అయితే వాటి ప్రకారము కాకుండా, దేవుని చిత్తప్రకారము ఏది మచిది? ఏది ఉత్తమమైనది అని తెలుసుకుని ఆ ప్రకారము చెయ్యాలి! మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. బలిగా అర్పించుట అనేదానిని గమనించినపుడు, ఒకసారి అర్పించినతరువాత దానిలో ఇక ఏ మాత్రము జీవము ఉండదు. అలాగే మనము సజీవ యాగముగా మనము అర్పించినప్పుడు, మన జీవితములో ఇంతకు ముందు ఉన్న లోకానుసారమైన సంగతులు ఇక జీవించకూడదు.

05-02-2023 ఆదివారం రెండవ ఆరాధన – సమయము అయిపోయిందా

ఎవరైతే యేసయ్యను అంగీకరించినవారికి మాత్రమే ఈ అవకాశము. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఆహ్వానము ఇవ్వబడుతుంది. దేవుడు సిద్ధపరచబడినది నీ వద్దకే వస్తుంది. యేసయ్యను అంగీకరించిన నీ ధన్యత ఇదే. నీ ఆశీర్వాదము నీదే. అది ఎలా సిద్ధపరచబడుతుందో నీకు అనవసరము. ఆయన ఏది సిద్ధపరచేనో అది కంటికి కనపడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరముకాదు.

05-02-2023 ఆదివారం మొదటి ఆరాధన – ప్రార్థించు

1. తండ్రికి నీ ప్రార్థన సంబోధించాలి
2. దేవుని మహిమ ప్రకటించాలి
3. నీ అవసరము గూర్చి అడగాలి
4. నీవు అడిగినది దయచేయు సమర్థుడవు అని ఒప్పుకోవాలి
5. యేసు నామములో సమర్పించాలి