03-07-2026 – సూపర్ నేచురల్ సర్వీస్
వాక్య భాగము దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. మనము పాడిన “నన్ను చూచువాడా, నిత్యము కాచువాడా” అనే పాటలోని సత్యాన్ని గ్రహించినప్పుడు, దేవుడు మనలను చూచుచున్నాడనీ, మన స్థితిగతులను ఎరిగియున్నాడనీ, మనలను ఆవరించి నడిపించుచున్నాడనీ విశ్వాసంతో సంతోషించగలము. నిన్ను పరిశోధించి తెలిసికొనిన దేవుడు కీర్తనలు 139:1-5 — 1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు …
