నీ రాజు స్తుతింపబడునుగాక
నీ రాజు స్తుతింపబడును గాక. ఎప్పుడు ఆయన స్తుతింపబడతాడు అనేది వాక్యముద్వారా నేర్చుకుందాము. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. యోహాను 12:12-13 ఇక్కడ “ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక” అనేమాట మనము గమనించాలి. అంతకుముందు యెరుషలేములో జరిగిన సంగతులు గనుక గమనిస్తే, “ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత …