12-03-2023 ఆదివారం రెండవ ఆరాధన – దేవుడు మనకు తోడై ఉన్నాడు
మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడూ అని చూస్తే, ఇశ్రాయేలీయులను కానానుకు తీసుకువెళ్ళాలి. అది దేవుని చిత్తము అందుకే తోడై ఉన్నాడు. అలాగే మిగల్చబడిన వాగ్దానపు నెరవేర్పు కొరకు యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. అలాగే యేసు క్రీస్తును చూస్తే, “తన ప్రజలను తానే రక్షించునట్లు” దేవుని చిత్తము నెరవేర్చడానికి తోడై ఉన్నాడు. దేవుని చిత్తము నీపై ఉంటే, నీకు వ్యతిరేకముగా కలిగే దురాలోచన నిలువదు. అపాయము ఉన్ననూ ఉపాయము లేని వారము కాదు అని పౌలు ఎందుకు చెప్పగలుగుతున్నాడు? దేవుని చిత్తము ప్రకారము పిలువబడ్డాడు. దేవుని చిత్తములో ఉన్న నీవు అసాధారణమైనవాడవు, అసాధారణమైన దానివి. అందుకే నీ ఎదుటకు మరణము వచ్చినా సరే వెనుకకు వెళ్ళవలసినదే.
