రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా
కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో
విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో
త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము