నీ చిత్తమునే చేసెద – నీ మార్గములోనే నడిచెద

నీ చిత్తమునే చేసెద – నీ మార్గములోనే నడిచెద
నీ సన్నిధిలోనే నిలచెద – నిను వెంబడించెద
ఆరాధన యేసునీకే – ఆరాధన యేసునీకే

నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్
చూచుచు నే నడచెద – అన్ని వేళలా

గాలి నీరు అగ్నియు – నీ అద్భుత మాటకు
లోబడుచు ఉన్నవి – అన్నివేళలా