ఇమ్మానుయేలు దేవా
ఇహపరములకు రాజా
సన్నుతించి కిర్తించేదము
సతతము నీ నామము
హల్లెలూయ ఆరాధ్యుడా
హల్లెలూయ స్తుతి పాత్రుడా
హల్లెలూయ అభిషక్తుడా
హల్లెలూయ అభి వందనం
ఆదియందు వాక్యమై యున్నావు
ఆ వాక్యము నేనే అని చెప్పావు
మా వెలుగు మార్గం నీవే దేవా
నిత్య జీవము నీవేనయ్యా
రాజులకు రారాజు నీవేనయ్యా
జనులందరి జీవాధిపతి నీవే
మా యోగ క్షేమము నీవేనయ్యా
మా స్తుతి గానము నీకేనయ్యా