కుతూహలమార్భాటమే

కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో

పాపమంత పొయెను – రోగమంత తొలగెను యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృపద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో

దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు – గుర్తించె నన్ను అద్భుతమద్భుతమే

శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును
ఏకముగా కూడి – హోసన్న పాడి ఊరంతా చాటెదము

బూరధ్వనితో – పరిశుద్ధులతో యేసు రానై యు౦డే…
ఒక్క క్షణములోనే – రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం