కనుమరుగు చేయుదుననె వారెదుట
ఎనలేని వృద్ధిచేయు దేవా
నిన్ను కనుమరుగు చేయుదుననె వారెదుట
ఎనలేని వృద్ధిచేయు దేవా
సరిచేయ జాలని నీ బ్రతుకు
సరిపరచ తానే వచ్చుచున్నాడు
ఓ.. ఓ.. సరిచేయును – స్థిర పరచును –
బలపరచి – పూర్ణుని చేయున్
నిన్ను సరిచేయును – స్థిర పరచును
బలపరచి – పూర్ణుని చేయున్
నిన్ను బలపరచి పూర్ణుని చేయున్
అల్ప కాలం పాటు పొందిన శ్రమలన్ని
మంచు వలె నీ యెదుట కరిగిపోవున్
నీ కష్టము నష్టము అన్నియును తీరున్
క్షేమములే నీ దరి చేరున్
ఖ్యాతిని అణచివేయు కూటములు
అన్నియును యేసు నీ తోడని తలలు వంచున్
విరోధులు చేసిన గాయములు మానున్
నీ ఖ్యాతి నీ దరి చేరున్