ఎంత మంచి దేవుడవేసయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా
ఘోర పాపినై నేనూ – నీకు దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నన్ను క్షమియించీ – నను హత్తుకున్నావయ్యా
నాకున్న వారందరూ – నను విడచి పోయిననూ
నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ – నను నీవు విడువలేదయ్యా
నువ్వు లేకుండా నేను – ఈ లోకంలో బ్రతకలేనయ్యా
నీతో కూడా ఈ లోకం నుండి – పరలోకం చేరెదనేసయ్యా