విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ
మరువనిది నను మార్చినదీ యేసు నీ ప్రేమ (2)
మార్పులేని ప్రేమా- మరచిపోలేని ప్రేమ (2)
ప్రేమ యేసు ప్రేమా- ప్రేమ ఇంత ప్రేమా? (2)
అగ్ని గుండములోనా నన్ను
విడువని ప్రేమ
సింహపు బోనులోనా నన్ను
మరువని ప్రేమ (2)
నన్ను విడువని ప్రేమా నన్ను
మరువని ప్రేమా (2)
దిక్కులేక పడియున్న – నన్ను
విడువని ప్రేమ
బంధకములో నేనున్నా – నన్ను
మరువని ప్రేమ(2)
నా తలను పైకెత్తే ప్రేమ –
నన్నాదరించెను ప్రేమా (2)
ఎవరు నన్ను విడచినా – నన్ను
విడువని ప్రేమ
అందరు నన్ను మరచినా – నన్ను
మరువని ప్రేమ (2)
స్థితిగతులు మాచ్చెను ప్రేమ
కృప ఐశ్వర్యమిచ్చెను ప్రేమ (2)