తండ్రీ నీ సన్నిధిలో నే ఉన్నాను

తండ్రీ నీ సన్నిధిలో నే ఉన్నాను
నిన్ను నమ్ముకుని నే వచ్చాను
నీ మాటకై నే వేచి ఉన్నా
నీ కార్యముకై నే ఆశతో ఉన్నా

యెహోవా ఎలోహిం - నా సృష్టికర్త
యెహోవా ఈరే - నాకు దయచేయువాడా
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - ఆమేన్

తీర్చలేని కష్టాలలో ఉన్నాను
భరించలేని అవమానం భరియిస్తున్నాను
నా కష్టమును తీర్చుటకు ఆధారము నీవే
అవమానము తొలగించుటకు సహాయము నీవే

యెహోవా ఎలోహిం - నా సృష్టికర్త
యెహోవా ఈరే - నాకు దయచేయువాడా
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - ఆమేన్