ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా

నను ప్రేమించీ భువికొచ్చినదీ నీ ప్రేమా
సిలువలో మరణించీ బలియైన ఆ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు

కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమా
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు