నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో

నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో
అన్నివేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను
నీతో నడవాలి కీర్తిని చాటాలి
నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య

ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా
మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !
ఒకటే మాటగా – ఒకటే బాటగా
నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా

శాంతినిచ్చు దేవా – ముక్తినొసగే తండ్రి
వ్యాధులైన బాధలైన రూపుమాపే నాథుడా
కన్నతండ్రిగా – ప్రేమ మూర్తిగా
చివరి శ్వాసవరకు కాచే దేవుడవు యేసయ్యా