నీకసాధ్యమైనది లేనేలేదు – నీకసాధ్యమైనది లేనేలేదు
సమస్తము సాధ్యము – హల్లెలూయ సమస్తము సాధ్యము
స్తోత్రం స్తుతి స్తోత్రం – స్తుతి పాత్రుడా నీకే సోత్రం
గాలితుఫాను సముద్రము నణచిన దేవా గొప్ప దేవా
గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా
తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం
మారా జలమును మధురము చేసిన దేవా గొప్ప దేవా
మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్ప దేవా
తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం
ఎర్రసముద్రము పాయలు చేసినదేవా (గొప్ప దేవా)
ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా (గొప్ప దేవా)
తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం