నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే
నేనేమీ లేనయ్యా
యేసయ్యా....
నను పిలచినదేవా
నను నడిపిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయా
నేను జీవించునది నీ కృప
ఎదిగించునది నీ కృప
హెచ్చించునది నీ కృప
నేనని చెప్పుటకు
నాకేమి లేదు
సామర్థ్యం అనుటకు
నాకని ఏమి లేదు
అర్హతే లేని
హెచ్చించినది నీ కృప
నీ కృప లేకుంటేనే
నేను లేను