నేను నమ్ముకున్న నమ్మదగిన నా దేవుడు

నేను నమ్ముకున్న నమ్మదగిన నా దేవుడు
నా చేయి యెన్నడు విడువడు
నేను నీ మాట చేత పట్టుకుని
బలమైన విశ్వాసముతో సాగెదా
నా ధైర్యము నీవే ఆధారము నీవే నా విజయము నీవే
నా హృదయములోని అన్నిటిని యెరిగి నా ప్రతి ఆశను తృప్తిపరచేవాడా

లేమి స్థితిలో నీ మాట విన్న విధవరాలిని విస్తారమైన దీవెనతో దీవించావే
ఆశ్చర్యకరుడు నా దేవుడు నా ప్రతి అవసరమును తీర్చేవాడు
నా ధైర్యము నీవే ఆధారము నీవే నా విజయము నీవే
నా హృదయములోని అన్నిటిని యెరిగి నా ప్రతి ఆశను తృప్తిపరచేవాడా

బాధలు నిందలలో నేనుండగా నీ ప్రేమతో నన్ను దృష్టించావే
శ్రమలలో వాగ్దానము చేసినవాడు మరువక వాటిని నెరవేర్చినవాడు
నా ధైర్యము నీవే ఆధారము నీవే నా విజయము నీవే
నా హృదయములోని అన్నిటిని యెరిగి నా ప్రతి ఆశను తృప్తిపరచేవాడా

అన్యాయముగా యేసేపును అమ్మివేసినా ఐగుప్తునకు రాజుగా ప్రతిష్ట చేసావే
అన్యాయస్తుడు కాదు నా దేవుడు న్యాయము తీర్చువాడు నా దేవుడు