నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నాప్రార్థన విజ్ఞాపనా నిత్యమహిమలో నిలవాలని
అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
ఆశలవాకిలి తెరచినావు అనురాగవర్షం కురిపించినావు
నాహృదయంలో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా నాహృదయ విద్వాంసుడా
యదార్థవంతులయెడల నీవు యెడబాయక కృపచూపి
గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు
నన్నునీవువిడిపించినావు ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన సజీవుడవు నీవేనయ్యా
నాహృదయంలో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా నాహృదయ విద్వాంసుడా
నాలో ఉన్నది విశ్వాసవరము తోడైయున్నది వాగ్దానబలము
ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా
ఆర్పజాలని నీప్రేమతో ఆత్మదీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
నాహృదయంలో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా నాహృదయ విద్వాంసుడా
స్వచ్ఛమైనది నీవాక్యం వన్నెతరగని ఉపదేశం
మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట
సిగ్గుపరచదు నన్నెన్నడూ నీలోనాకున్న నిరీక్షణ
వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
నాహృదయంలో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా నాహృదయ విద్వాంసుడా