ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా

ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి

ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా

గొర్రెల కాపరి అయిన దావీదున్ – నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు – నీ బలమునే ఇచ్చినావైయ్యా
ప్రతి బలహీన – సమయములో – నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద

ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా

ఘోరపాపి అయిన రాహాబున్ – నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను – వారసత్వమునిచ్చినావుగా
నా పాపమై – నా శాపమై – మరణించిన నా యేసయ్య
నా నీతియై – నిత్య శాంతియై – నా తోడుండు నా దైవమా

ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా