ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో

తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు
నీటిపై ఠీవిగా నడచినవాడతడు

మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు

en English te Telugu