నా గొప్ప రక్షకుడా
నా మంచి నావికుడా
నువ్వుంటే చాలు యేసయ్యా
నాకేది కొదవలేదయ్యా
కరువు కాలాలు కష్ట సమయాలు
నన్ను భయపెట్టిన బాధింప చూచినా
వ్యాధులతో బందీనైనా
శ్రులలో నేను సోలిపోయిన
నువ్వుంటే చాలు యేసయ్యా
నన్నేది తాకలేదయ్యా
ముళ్ళబాటైన గాఢాంధకారమైన
ఎత్తయిన కొండలైన లోతైన లోయలైనా
నీ కృప నన్ను వీడలేదయ్యా
నీ దండం నన్ను ఆదరించినయ్య
నువ్వుంటే చాలు యేసయ్యా
నన్నేది తాకలేదయ్యా