learn

నేర్చుకో

ఆత్మీయమైన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. చాలా సార్లు మనము ప్రాధాన్యత ఇవ్వవలసినవాటికి మనము ఇవ్వము.


తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.౹ -2 పేతురు 1:2.


ఖచ్చితముగా నీవు నేర్చుకోవలసినది ఉంది. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి గాని, ఏమి నేర్చుకున్నాము? యేసును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిఉంటున్నామా? అనేక సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తూ ఉండిఉంటావు, అయితే ఎంతగా నీవు నీ దేవుని గూర్చి నేర్చుకుంటున్నావు? నీవున్నచోట ఉన్న దేవుని సన్నిధి నీవు అనుభవించాలి అంటే, యదార్థమైన హృదయము నీవు కలిగిఉండాలి.


ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.౹ -రోమా 1:20.


దేవుడు కంటికి కనపడకపోయినా ఆయన అదృశ్యలక్షణములు అనగా ఆయన నిత్య శక్తిని అనుభవించగలుగుతాము. ఆయన సన్నిధి అనుభవించాలి అనే ఆసక్తి మనము కలిగిఉంటే, ఖచ్చితముగా మనము ఆ ప్రభావమును అనుభవిస్తాము. అనుభవజ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి, మన భౌతిక జీవితములో, ఆత్మీయ జీవితములో కావలసిన ప్రతీదీ మనకు దయచేసేదిగా ఉంది. అందుకే దేవునికి సంబంధించిన ప్రతీదానిలో మనము శ్రద్ధకలిగి నేర్చుకోవాలి. అంతేకాక దేవుడు మరియు యేసును గూర్చిన అనుభవజ్ఞానము మూలముగా “కృప”, “సమాధానము” విస్తరించబడతాయి. అంటే నీకు అనుభవజ్ఞానము లేకపోతే, నీవు ఆయన అనుగ్రహించు కృప, సమాధానము పొందలేనివాడిగా అయిపోతాము. ఎంత లోతుగా దేవుని గూర్చి నేర్చుకుంటావో, అంతలోతైన అనుభవము పొందుకోగలుగుతావు.


పౌలు జీవితములో మనము చూసినప్పుడు, ఆయన జీవితములో ఉన్న ఒక విషయమును గూర్చి ప్రార్థించినప్పుడు,
“నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒకముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.౹ అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.౹ అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.౹ -2 కొరింథీయులకు 12:7-9”.


పౌలు దేవుని గూర్చి అనుభవజ్ఞానముతో నేర్చుకున్నది ఏమిటంటే, “తన ప్రతీ బలహీనతలో ఆయన కృప విడుదల అవుతుంది కనుక, “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను”, అని చెప్పగలుగుతున్నాడు. “క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.౹ -2 కొరింథీయులకు 1:5”.


యోహాను 4వ అధ్యాయములో సందర్భము చూస్తే, సమరయ మార్గములో యేసు వెళ్తున్నప్పుడు, ఒక స్త్రీని దాహమునకు నీళ్ళు అడిగాడు. అక్కడ ఆ సందర్భములో ఒక డిస్కషన్ జరిగింది. అక్కడ మనము లోతుగా గమనిస్తే అక్కడ “సహవాసము” కలిగి ఉన్నారు. అప్పుడు, యేసు తాను ఏమై ఉన్నాడో ఆ విషయము గూర్చి వెల్లడిపరిచాడు. చివరికి ఆమె యేసు ప్రవక్త అని గ్రహించింది. ఆ సహవాసముద్వారా యేసును గూర్చి గ్రహించింది. వ్యభిచారము చేసిన పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ, తాను సంపాదించిన అనుభవ జ్ఞానముబట్టి, ఒకప్పుడు ఊరి బయట నివసించే పరిస్థితినుంచి ఊరిలో కి మార్చబడింది. అనగా అవమానమునుంది బయట పడి సంతోషమైన జీవితము పొందింది.


దేవుని గూర్చి అనుభవ జ్ఞానము సంపాదించాలి అంటే కావలసినవి

  • 1. దేవుని మాట
  • 2. దేవుని సహవాసము

పూర్తి వీడియో యూట్యూబ్ లో చూడండి