దేవుని యెడల ప్రేమించినట్టయితే, ఆ ప్రేమ అన్నిటికి తాళుకొనును. ఆదివారాన దేవుని ఆరాధించుటలో ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుని సన్నిధిలో అన్నిటిని తాళుకుని ఆరాధిస్తాము.
అందుకు అతడు–యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండు కొనుడి, ఉదయమువరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.౹ -నిర్గమకాండము 16:23.
ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. -నిర్గమకాండము 20:11.
ఆదివారము విశ్రాంతిదినము యెహోవాకు పరిశుద్ధమైన దినము. యెహోవాచేత అశీర్వదించబడిన దినము. ఆ దినాన మనలను దేవుడు పరిశుద్ధపరిచేవాడు.నీ జీవితములో అటంకముగా ఉన్న ప్రతీదీ కూడా, నీవు విశ్రాంతిదినాన నీ జీవితాన్ని సిద్ధపరుచుకుని ఆరాధించినట్టయితే, దేవుడు నిన్ను వాక్యముచేత ఉదకస్నానము చెయ్యించి, పరిశుద్ధపరిచి, ఆ ప్రతి ఆటంకమునుండి నిన్ను విడుదల చేసేవాడు.
కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.౹ -నిర్గమకాండము 31:14 ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతిదినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము. -లేవీయకాండము 23:3
నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకునుమధ్యను సూచనగా ఉండును.౹ -యెహెజ్కేలు 20:20 .
విశ్రాంతిదినం గనుక లేకపోతే, నీ దేవుడు ఎంత కృప గలిగినవాడు, ఎంత గొప్పవాడు, ఎంత దయగలిగినవాడు, ఎంత శక్తిగలవాడు అనేది మనము తెలుసుకోలేము. ఆయనను తెలుసుకోలేని కారణాన, మన జీవితములు పరిశుద్ధపరచబడక ఆశీర్వాదములు కోల్పోతాము.
నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. -ద్వితీయోపదేశకాండము 5:15
అపవాది బంధకములలో బానిసలుగా నిలువబడిన మనలను, తన బాహుబలముచేత చాచిన తన చేతి ద్వారా తన ప్రేమను వెల్లడిచేసి అనగా తన కుమారుని పరిశుద్ధ రక్తము చేత మనలను విడిపించి ఆయన సన్నిధిలోనికి రప్పించెను. ఆయన సన్నిధి మనము అశీర్వదించబడి, కొనసాగించబడే స్థితి కలిగిన ప్రదేశము. మనము ఎలా నడవాలో అలా నడిపించబడే ప్రదేశము.
నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచ కుండ దానిని అనుసరించుచు ఏ కీడుచేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. -యెషయా 56:2.
ఎలా అపవిత్రపరుస్తున్నాము? ఈ దినము మన సొంత పనులకొరకైన దినముగా ఎంచి అపవిత్రపరుస్తున్నాము. అయితే ఇది దేవుని దినముగా ఎంచినట్టయితే, గ్రహించినట్టయితే ఆయనకు మహిమ కలిగే విధముగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకొరకు సిద్ధపడతాము.
దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.౹ -ఆమోసు 8:6 .
రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.౹ -ఆమోసు 8:11
మీపితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణస్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.౹ -నెహెమ్యా 13:18
దేవుని మాటకు లోబడకపోవుటచేత మనమీదకి కీడును మనమే రప్పించుకుంటున్నాము. అయితే విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టుటద్వారా మరింత కీడు తెచ్చుకుటున్నాము.
నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. -యెషయా 58:13-14
విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరిస్తే –
- ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కించెదను
- నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను: స్వాస్థ్యము అనగా రోజురోజూ సంపాదించబడి, స్వాస్థ్యముగా స్థిరపరచబడుతుంది. అలా యాకోబు జీవితములో ఎలా దేవుడు స్వాస్థ్యమును స్థిరపరిచాడో. అదేవిధముగా నీ జీవితంలో కూడా ఆ అనుభవించెదవు.
పూర్తి వీడియో యూట్యూబ్ లో చూడండి