ఏ తెగులు మన గుడారము సమీపించదయ్యా

ఏ తెగులు మన గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)
హల్లెలూయ స్తోత్రం
హల్లెలుయ స్తోత్రం
హల్లెలుయ స్తోత్రం స్తోత్రం

ఉన్నతమైన దేవుని మనము
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని మనము
మహిమ పరచెదము (2)
||ఏ తెగులు||

గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిమి
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదము (2)
||ఏ తెగులు||

మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా (2)
||ఏ తెగులు||