31-12-2024 – ప్రవచన పరిచర్య

స్తుతిగీతములు

నీవు చేసిన మేళ్లకు

యేసయ్యా వందనాలయ్యా

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా

బలమైన దేవునికే స్తొత్రములు

 

ఆరాధన వర్తమానము

వాక్యము ఎవరు స్వీకరించగలుగుతారో వారి జీవితములో భౌతికమైన ఆశీర్వాదములు పొందినపుడు సాధారణముగానే ఉంటారు. అదే వారు ఆత్మీయ ఆశీర్వాదములు పొందినపుడు వారి ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది.

దావీదు కుమారుడా కరుణించు నన్ను దాటిపోకు అని గుడ్డివాడు కేకలు వేసాడు. వాడి స్థితి బాగాలేదు గానీ, ఆ స్థితిలో అక్కడకు వచ్చినది యేసయ్య అనే సత్యము ఎంతో బలముగలది గా ఉంది. తన జీవితమ్ను మార్చగలిగింది యేసయ్యే అనే సత్యము అతడు ఎరిగినవాడుగా ఉన్నాడు. చుట్టూ ఉన్నవారు గద్దించినా, వారించినా అతడు మరి ఎక్కువగా కేకలు వేసాడు, అందుకే అతడు ఆశించిన స్వస్థత పొందుకున్నాడు.

మనము కూడా ఎప్పుడైతే సత్యమును మనము విశ్వసిస్తామో, ఆ సత్యమే మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అయితే ఆ గుడ్డివాడు ఎందుకు మరి ఎక్కువగా కేకలు వేసాడు? యేసయ్య తప్ప వేరే అవకాశము, దారి లేదు అనే సత్యము ఎరిగినందువలనే. ఈ దినము 2025 కొరకు తన మాటలు వెల్లడి చేయబోతుండగా, మనము అస్సలు విడిచిపెట్టవద్దు. 2025 లో మనము ఆశీర్వదించబడాలి అంటే, దేవుని మాటలు తప్ప మనకు వేరే ఆధారము లేదు.

యెహోవా నాకు ఆధారము అయి ఉన్నాడు, కుడి ప్రక్కన వేయి మంది, ఎడమపక్క పదివేల మంది కూలినను, నేను కదల్చబడను, నేను పండుకొని, నిద్రపోయి మరలా మేల్కొంటాను. ఆమేన్!

ఒకడి జీవితము కూలిపోతే, కోల్పోతే వాడికి సమాధానము ఉండదు గానీ, దేవుని నమ్ముకొని, ఆయననే, ఆయన వాక్యమునే ఆధారము చేసుకొన్న మనమైతే, హాయిగా పడుకొని, నిద్రపోయి తిరిగి మేల్కుంటాము, సమాధానము కలిగి ఉంటాము.

2024 లో నీకున్న సమస్యను బట్టి నీవు ప్రార్థించుచుండగా, నీకు అనేకమైన అడ్డులు ఆటంకములు కనపరచబడి ఉండవచ్చు. దానిని బట్టి నీవు చేసిన ప్రార్థన ఆగిపోయింది. అయితే ఆ గుడ్డివాడివలే, నీ సమస్యలకంటే నీ ప్రార్థనే బలమైనదిగా ఉంటే ఏ సమస్య నిన్ను అడ్డగించలేదు.

వాక్యము ఎంతో శక్తివంతమైనది. దేవుడు మాట పలకగానే ఆ ప్రకారమే జరిగింది, జరుగుతుంది. గడిచిన సంవత్సరము మనకు వాగ్దానములు పొందుకున్నాము. అయితే కొన్ని పొందుకున్నాము, మరికొన్ని పొందుకొలేకపోయాము. అయితే పంక్తిలో కూర్చున్న ప్రతీ ఒక్కరు పొందుకున్నారు. పంక్తిలో కూర్చొనుట అంటే, విశ్వాసము కలిగి ఉండుటయే!

అయితే ఈ దినము ఈ సంవత్సరమంతా మనలను నడిపించిన, కాపాడిన, సమకూర్చిన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట మీ విషయములో దేవుని చిత్తము. ఎందుకు అని ఆలోచిస్తే, నీ జీవితములో దేవుని చిత్తము జరుగునట్లు, ఇంకా నిన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకే.

ఒక తోట యజమానితో అక్కడ ఉన్న దాసుడు చర్చిస్తున్నాడు. నాటబడిన మొక్క ఫలించనందుకు దానిని తీసివేయమని యజమానుడు చెప్పినపుడు –

మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చి నప్పుడు ఏమియు దొరకలేదు గనుక అతడు–ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను. అయితే వాడు–అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడ ఉండనిమ్ము; అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను. -లూకా 13:6-9

అనేక సందర్భములలో ఎందుకూ పనికిరాని జీవితములవలే మన జీవితములు ఉన్నాయేమో గానీ, దేవుని చిత్తము ఈ వాక్యము ద్వారా మనకు తెలియచేయబడుతుంది. 2024 లో కాపు లేదు, ఆశీర్వాదము లేదు, అయితే ప్రభువు చెప్పుచున్న మాట-

మన జీవితములు కొట్టివేయబడవలసిన జీవితములే. అయితే యేసయ్య ఈ సంవత్సరము కాపు కాసే విధముగా త్రవ్వి, ఎరువు వేసి నీ జీవితమును ఫలింపచేసి, నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు.

గడచిన సంవత్సరము ఫలించకపోవడానికి కారణము ఏమైనా సరే, ఈ సారి ఫలింపచేసే బాధ్యత నేనే తీసుకుంటాను అని యేసయ్య చెప్పుచున్నాడు. నీవు ఖచ్చితముగా ప్రభువుకు సాక్షిగా ఉండటానికి, నీవు ఫలిచడానికి ఇంకా నీవు సజీవుల లెక్కలో ఉన్నావు దానికొరకు నీవు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి

2025 లో మీరు ఫలించునట్లుగా, మరింతగా ఫలించునట్లుగా, బహుగా ఫలించునట్లుగా నీలో పనికిరానివన్నీ తీసివేయబడతాయి. ఆమేన్!

విత్తనము నాటినప్పుడు, ఆ నాటిన యజమానుని ఉద్దేశ్యము ఏమిటి అని ఆలోచిస్తే, ఆ విత్తనము పెరిగి పెద్దదై, మంచి ఫలములు ఫలించాలి అనేదే! ఆ ఫలములు ఫలించడానికి అవసరమైన కార్యములు మాత్రమే అతడు చేస్తాడు. 2025 కూడా యేసయ్య మీరు ఫలించులాగున పని చేస్తాను అని చెప్పుచున్నాడు.

మనము పుట్టక మునుపే మన జీవితమంతా లిఖించబడింది. ఆశీర్వాదకరముగా ఉండాలి అనే చిత్తము, ఉద్దేశ్యముతోనే నిన్ను నన్ను పుట్టించాడు. ఆ చిత్తము నెరవేర్చబడటానికే ఇంకా మనము భూమిపై సజీవులుగా ఉంటున్నాము.

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30

ఈ దినము నీవు పిలువబడిన వాడవు, అనగా నీవు నిర్ణయించబడ్డావు. ఇప్పుడు ఆయనే నిన్ను నీతిమంతునిగా తీర్చి మహిమపరుస్తాడు. అనగా ఆయనకొరకైన సాక్షిగా ఉంచడానికే.

నీవు ఆయనను ఎరగనపుడు, ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన దినమెల్లా చేతులు చాపి వేచి ఉన్నాడు. ఆయనను స్వీకరించిన తరువాత, ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు, నా చిత్తము చేయనపుడు అని అంటున్నాడు. అది ఎలా అర్థము చేసుకోవాలి?

ఆయన ఏమై ఉన్నాడో మనము తెలియనపుడు తన చేతులు చాచి వేచి ఉన్నాడు. ఎప్పుడైతే నీవు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నాక, ఆ తెలిసిన సత్యము ప్రకారము నీవు నడవాలి. ఉదాహరణకు యేసయ్య గొర్రెలకు మంచి కాపరి అనే సత్యము మనకు బోధించాడు. ఈ బోధను అంగీకరించిన తరువాత, గొర్రెల వలే ఆ కాపరిని వెంబడించకుండా ప్రభువా ప్రభువా అంటే ఆ సమృద్ధిని మనము పొందుకోలేము, తృప్తిపరచబడలేము.

అయితే 2025 మాత్రము దేవుని మార్గము ఏదైతే ఉంటుందో అదే మార్గములో మనము నిలిచి ఉందాము. పురాతమైన మార్గములు విచారించి తెలుసుకొందాము. మన ముందు నడచిన వారి జీవితములనుండి మనము నేర్చుకుందాము.

దానియేలు యెహోవాయే నా దేవుడు అని తన ప్రతికూల పరిస్థితిలో చెప్పగలిగాడు. దావీదు యెహోవా నా కాపరి అని ఆయనే నా కోట అని, దుర్గము అని చెప్పగలిగాడు. వారు దేవుని మార్గములో నిలిచినందునే అలా చెప్పగలిగారు, సాక్షులై ఉన్నారు.

నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.౹ -యిర్మీయా 2:17

“నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా” అనే భాగము మీద మనము దృష్టి పెడదాము. నీవు యేసయ్యలో నాటబడ్డావు, నీవు ఆశీర్వదించబడాలి, నీవు ఆయనకు సాక్ష్యముగా ఉండాలి, అనేది ఆయన చిత్తము, ఆశ. గొర్రెలను చూస్తే, అవి కాపరిని వెంబడిస్తాయి గాని, మార్గము వాటికి తెలియదు. అయితే, “నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా”- కాపరి ఎలా తిరిగితే అటు తిరగకుండా గనుక గొర్రెలు గనుక వేరే మార్గములో వెళితే ఏదో ఒక అపాయములో చిక్కుబడతాయి.

దేవుని మార్గములో భక్తి శ్రద్ధలు కలిగి వెంబడించాలి. ఎలీషా యెడల భక్తి శ్రద్ధలు చూపించిన స్త్రీ ఎంతో ఆస్తి కలది గానీ, బిడ్డలు లేని స్థితిలో ఉంటున్నారు. వారికి బిడ్డలు కలగడానికి అవకాశము లేదు. అయితే తాను కనపరచిన భక్తిని బట్టే, ఆమె తన కుటుంబములో ఆశీర్వాదమును పొందుకుంది. “ఇంత భక్తి శ్రద్ధలు కనపరచినందుకు నీకు ఏమి కావాలి” అని ప్రవక్తనోట దేవుడు పలికించాడు. అయితే ఇదంతా కొన్ని దినములు గడిచిపోయిన తరువాత జరిగింది.

2024 గడిచిపోయిన తరువాత, 2024 లో నీవు చూపిన భక్తిని బట్టి నీవు ఆశీర్వాదమును 2025 లో పొందుకుంటావు. భక్తిని కనపరచకుండా నీవు వాగ్దానమును స్వతంత్రించుకోలేవు. యదార్థమైన భక్తి అంటే, కాపరిని వెంబడించుటయే! అనగా యేసయ్య వాక్యమై ఉన్నాడు గనుక, ఆ వాక్యమును వెంబడించుటయే యదార్థమైన భక్తి.

2024 లో వాక్యమును వెంబడించుటలో మనము వెనకబడ్డామేమో, కుంటుపడ్డామేమో, నిర్లక్ష్యముగా ఉన్నామేమో, ఒకసారి పరీక్షించుకుందాము. మన భక్తిని బట్టే మన ఆశీర్వాదము గనుక మన భక్తిని సరిచేసుకుందాము.

మీరు మరి ఎక్కువగా ఫలించాలి అంటే ఖచ్చితముగా పనికి రాని తీగెలు తీసివేయబడాలి.

నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.౹ -యోహాను 15:2

2025 లో మన జీవితములను గొప్పగా చేయటమే ఆయన ఉద్దేశ్యము. గనుక దేవుని వెంబడించుటలో నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే దయచేసి సరిచేసుకుందాము. ఈ దినము మన భక్తిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక మన భక్తిని సరి చేసుకుందాము!

2024 అయిపోయింది, అయితే 2025 మరొక అవకాశము ప్రభువు ఇస్తున్నాడు. 2024 ఎక్కడ మనము తప్పిపోయాము? నిర్లక్ష్యముగా ఉన్నాము? భక్తిని సరిగా చేయలేకపోయాము? పరీక్షించుకుందాము.

ఆరాధన గీతము

ఇదిగో దేవా ఈ హృదయం

చేయి పట్టుకో నా చేయి పట్టుకో

ఈరోజు నీవు ఆయను స్వీకరిస్తే రేపటి నీ భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది.

2024 లో నీ పరాజయపు అనుభవాన్ని 2025 లో విజయానుభవముగా మార్చడానికే నీ మధ్య ఉన్నాడు, స్వీకరించు!

నీవు నూతనముగా కట్టబడటానికి ఇదే సమయము 2024 నుండి 2025 లోనికి నీ చెయ్యి పట్టుకొని నడిపించడానికి నీ ప్రభువు ఇష్టపడుతున్నాడు.

2025 దేవుని రక్షణ కనపరచు మార్గముగా సిద్ధపరచబడుతుంది. 2025 లో నీవు ఖచ్చితముగా సాక్షిగా ఉంటావు.

నీకొరకు దాచిపెట్టబడిన మేలు ప్రత్యక్షపరచబడుతుంది.

ప్రశాంతి: నీతో ప్రభువు చెప్పుచున్న మాటలు సత్యమే!

విజయానికి సంకేతముగా ఉన్న రిలే పరుగు పందెము. ఒకరితరువాత మరొకరు పరిగెట్టి, విజయము అందుకొంటున్నారు. ఈ దర్శనము ప్రభువు చూపిస్తున్నారు

ఒక నిజమైన వెలుగు ఉండెను ఆ వెలుగు ప్రతీ మనుష్యుని వెలిగిస్తుంది. ఆ నిజమైన వెలుగుగా నూతనమైన సంవత్సరము ఉండబోతుంది.

నీవు గొప్ప వెలుగు 2025 లో చూడబోతున్నావు.

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. -కీర్తనలు 50:23

2024 లో నీవు చేసిన స్తుతి ఆరాధన వలన నీవు రక్షణ మార్గమును 2025 లో చూడబోతున్నావు.

కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. -కీర్తనలు 100:4

కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అనగా కీర్తనలు పాడుచు 2025 లో అడుగుపెడదాము. అనగా మనము 2025 లో విజయమును ప్రకటిస్తున్నాము. రిలే పరుగు పందెమో ఒకడు బ్యాటిన్ పట్టుకొని పరుగెట్టి మరొకడికి అందిస్తాడు అలా ఒకరితరువాత మరొకరు పరుగెట్టి విజయము అందుకుంటారు. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు ప్రతీ ఒక్కరిని వెలిగిస్తుంది. 2025 లో మనము వెలిగించబడతాము.

యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతోషించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురు గాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక. -కీర్తనలు 149:1-3

ప్రవచన పరిచర్య

ఈ 2025 దేవుడు సిద్ధపరచిన సంవత్సరము.

ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము -2 కొరింథీయులకు 6:2

2025 మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఎన్నో దినములుగా ఎదురు చూస్తున్న వాటికి ముగింపు సమయము ఈ 2025. ఈ సంవత్సరము నీవు ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి అనుకూలమైన సంవత్సరము.

రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును – యెహోషువ 3:5

ఈ వాక్యము వింటున్న ప్రతీ ఒక్కరు స్వీకరించండి. 2024 చివరి ఆదివారము ప్రభువు చెప్పిన మాట. 2025 అనేది అద్భుతములు చేయబడునట్లుగా అనుకూలమైన సంవత్సరము.

తల్లి అయిన మరియ యేసయ్యతో ద్రాక్షారసము అయిపోయింది అని చెప్పింది. అప్పుడు ప్రభువు నా సమయము ఇంకా రాలేదు అని సమయము గూర్చి మాట్లాడినాడు. 2025 అనేది నిర్ణయించబడి, ప్రకటించబడిన సంవత్సరము.

ప్రభువు నీకు చేయబొయే అద్భుతము గూర్చి మాట్లాడినపుడు ఇంకా సమయము రాలేదు. అయితే 2025 మాత్రము ఆ అద్భుతము జరగడానికి అనుకూలమైన సమయము.

మరియతో నా సమయము ఇంకా రాలేదు అని చెప్పాడు అంటే ఇంకా సమయము ఉంది. నీ జీవితములో నష్టాన్ని పూడ్చే సమయము ఇదే, నీ లోని శూన్యము సమస్తముగా మార్చబడే సమయము ఇదే!

మరియతో నా సమయము ఇంకా రాలేదు అని చెప్పాడు, అయితే పనివారితో ఆ బానలను నీళ్ళతో నింపుడి అని చెప్పారు. అయితే ఆ బానలు దేనికొరకు నింపబడ్డాయి? ఏ నష్టమైతే అక్కడ జరిగిందో, ఏదైతే శూన్యము అయిందో దానిని పూరించడానికే! అయితే దేనిని బట్టి అనుకూల సమయముగా నిర్ణయించబడింది? మొదట నీళ్ళతో నింపమన్నాడు, ఆ తరువాత ఆ నీళ్ళను తీసుకొని పోయండి అని చెప్పాడు. అనగా పోయవలసిన సమయము ఇదే!

ఇది సంపూర్ణముగా నింపబడిన సంవత్సరము, ఆరంభమే అద్భుతముతో ప్రారంభము అవుతుంది. నీ జీవితము నిరాకారముగా ఉండటానికి సృష్టించబడలేదు గానీ, నివాస స్థలముగా ఉండటానికి సృష్టించబడింది. 2024 వరకు నిరాకారముగా ఉన్నా సరే, నివాస యోగ్యముగా మార్చబడే సంవత్సరము 2025. ఇంత గొప్ప సంవత్సరమును ప్రభువు మనకు ఇచ్చాడు.

ఒకవేళ ఇంతవరకు నీ జీవితము లో సంతోషము కనపరచబడకపోతే, ఆ సంతోషము పరిపూర్ణముగా కనపరచబడునట్లు ఈ సంవత్సరము సిద్ధపరచబడింది.

నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.౹ -యోహాను 15:2

కానా వివాహములో యేసయ్య పనివారిని విందులో పోయమని చెప్పాడు. ఇక్కడ నీవు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నీవు నియమించబడ్డావు. నిన్ను వెళ్ళమంటున్నాడు అంటే ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు? 2024 లో ఉన్నారు. ఇప్పుడు 2025 లో నీవు ఫలించునట్లు నీవు 2025 లో అడుగుపెట్ట్. 2025 లో నీవు ఇంక మిస్స్ అయ్యే అవకాశమే లేదు.

గర్భఫలము గూర్చి ఎదురుచూస్తుంటే, నీ జీవితములో కార్యము చేయబోతున్నాడు. (స్వరూప సిస్టర్ ప్రవచనం).

ఖాళీ గా ఉన్నది నింపబడునట్లు ఆయన పలికాడు. నీవు నమ్మితే నీ వద్ద ఖాళీగా ఉన్నవి అది అక్కౌంట్ అయినా మరేదైనా అది నింపబడునట్లు, దేవుని దూతలు పనిచేసేవారిగా ఉంటారు. 2025 ఆర్థికముగా ఆశీర్వదించబడే సంవత్సరము. ఆత్మ మండలములో దేవుడు మాట పలికాడు, దేవదూతలు సూపర్నేచురల్ కార్యములు చేయడానికి పంపబడ్డారు. నీవు నమ్మితే నీ జీవితములో ఈ కార్యము జరగుట నీవు చూస్తావు. బంధించబడిన ప్రతీది విడుదల కావలసినదే! పేతురు అన్యాయముగా బంధించబడ్డాడు, అతడిని విడిపించడానికి దేవుని దూత పంపబడ్డాడు. అలాగే నీవున్న బంధించబడిన స్థితిలోనుండి విడిపించడానికి దేవదూతలు పంపబడతారు.

2025 నీ ఊహకు మించి, నీవు కలయేమో అనుకొనే రీతిలో కార్యములు జరిగే సంవత్సరము. నీ ప్రార్థనకు జవాబు దొరికే సంవత్సరము. దేనినుండి నీవు విడిపించబడాలి అనే ఆశతో ప్రార్థించావో, దానికి జవాబు దొరికే సంవత్సరము.

దేవదూతలు మొదట చేసిన కార్యము నింపుదల, తరువాత చేసిన కార్యము విడుదల.

రేపు ఈ వేళకు ఏలియా ప్రాణము తీయబడునట్లుగా అతనికి వ్యతిరేకముగా ఆహాబు, యెజబెలు సిద్ధపడుతున్నారు. అప్పుడు దేవుని దూత వచ్చి, ఏలియాతో నీ శక్తికి మించిన ప్రయాణము నీకొరకు సిద్ధపరచబడింది, అని చెప్పి ఏలియాని దేవుడు మరణము చూడకుండా తీసుకువెళ్ళిపోయాడు.

2025 లో అపవాది కొన్ని ఉచ్చులు బిగించి నిన్ను నాశనము చేయటానికి ప్రయత్నములు చేస్తుండగా, ఆ ప్రయత్నములు సఫలము కానివ్వడు నీ ప్రభువు, అంతేకాక ఆ నాశనము నిన్ను ముట్టను కూడా ముట్టనివ్వడు.

అపవాది ప్రాణము తీయడానికి ఉచ్చులు బిగిస్తున్నాడు అంటే, ఏ విధముగా ఈ లోకములో ఎలా ప్రాణము పోతుంది అని ఆలోచిస్తే, అది అప్పులబాధ గానీ, అనారోగ్యము గానీ, ఆక్సిడెంట్ గానీ ఇలా ఏదైనా సరే నిన్ను ముట్టడానికి అధికారమే లేదు.

ఏలియాకంటే ముందు హనోకు దేవునితో నడిచి మరణము చూడకుండా దేవునితో వెళ్ళిపోయాడు. మరణము లేకుండా శరీరముతో దేవుని వద్దకు సాధారణముగా వెళ్ళలేము. అయితే హనోకు వెళ్ళాడు మళ్ళా ఏలియా మాత్రమే వేళ్ళాడు. అంటే 2025 కొన్ని అసాధ్యమైన అద్భుతములు మరలా జరిగిస్తున్నాడు.

ఇంతవరకు అసాధ్యముగా ఉన్నది ఏదైనా సరే, 2025 లో సాధ్యమే! 2025 అనే సమయములో అపవాది కీడు తలిస్తే, అదే సమయములో, వాడి ఊహకు అందని రీతిలో దేవుడు మేలు చేసేవాడుగా ఉన్నాడు.

కానా వివాహములో ఆ కుటుంబములో అవమానము జరగకుండా, మేలు జరిగింది. యోబు చుట్టూ కంచెవేసావు అని దేవునితో చెప్పాడు. అంటే అపవాది యోబును ముట్టడానికి ప్రయత్నము చేసాడు అనే కదా? అలాగే నీ చుట్టూ కూడా, దేవుడు కంచె వేసేవాడుగా ఉన్నాడు, అంటే నీవు చేసేదంతా కూడా యోబు వలే సఫలము అవుతుంది.

ఆనంద్: అనారోగ్యము నిన్ను ఏమీ చేయలేదు.

ఒకసారి యోబు కలిగినదానిని చూస్తే, గొర్రెలు పశువులు ఉన్నాయి. దేవుని కంచె చుట్టూ ఉన్న కారణాన, ఆ గొర్రెలు పశువులు విస్తరింపచేయబడ్డాయి. అలాగే నీవు కూడా 2025 విస్తరించబడునట్లు నీవు కలిగిన దానిని, నీ ఉద్యోగము, వ్యాపారము ఆశీర్వదించబడుతుంది, ఎందుకంటే నీ చుట్టూ దేవుడు కంచెవేసాడు. సమయము గడిచే కొద్దీ నీవు ఆశీర్వాదానికి దగ్గరవుతున్నావు అనే ఆలోచన నీవు కలిగి ఉండాలి.

పాతది గతించెను ఇదిగో సమస్తము క్రొత్తవాయెను, క్రీస్తునందున్నవారికి మాత్రమే ఈ ఆశీర్వాదము. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అయి ఉన్నారు. అనగా క్రీస్తులో ఉన్నవారి జీవితము నూతనముగా సృష్టించబడింది అని అర్థము.

ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. -మార్కు 2:22

సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము – హబక్కూకు 3:2

2024 లో దేవుని మాట వచ్చింది, అయితే ఆ మాట నెరవేరలేదు. అయితే 2025 లో మరలా ఆ మాట నెరవేర్పు నూతనముగా ప్రారంభించబడుతుంది. అలాగే నూతనమైన దీవెనలు కూడా వీటితో జతపరచబడతాయి.

అయితే ఏ సమయమునకు ఏ దీవెన అవసరమో ఆ ప్రకారమే, ఆ ప్రణాళిక ప్రకారమే మనకు 2025 లో దీవెన నూతనముగా అందించబడుతుంది. నూతనమైనదే నీ జీవితములో నీవు చూస్తావు.

క్రీస్తునందు ఉన్నవారు దేవుని పిల్లలు. మొదట దేవుని పిల్లలు తృప్తిపరచబడిన తరువాతే మిగతావారు. ఒకవేళ రెండు ఉద్యోగ అవకాశాలే ఉన్నాయి, నీవు దేవుని పిల్లవాడివి గనుక, నీవు తృప్తిపరచబడిన తరువాతే మిగతా వారు.

ఆయన ఆమెను చూచి–పిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. -మార్కు 7:27

నీకొరకు సిద్ధపరచినది నీవే అనుభవిస్తావు ఇదే దేవుని న్యాయము. క్రీస్తునందున్నందుకు ఆయన కలిగినవన్నీ నీవే! పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నాడు కాబట్టి, తండ్రి కలిగినవన్నీ అతనివే అని ఆయన అంటున్నాడు. అంటే తండ్రి ఏమి సిద్ధపరచాడో అదంతా అతనిదే అని అర్థము. అలాగే మన కొరకు తండ్రి సిద్ధపరచిన సమస్తము మనదే, మనమే అనుభవిస్తాము.

దేవుని ప్రేమను బట్టే సమస్తము జరుగుతున్నాయి. గనుక రేపటి గూర్చి చింతించకు అనగ ఇంక 2025 గురించి చింతించవలసిన అవసరము లేదు.

రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును -మత్తయి 6:34

“దాని సంగతులనుగూర్చి” అనగా 2025 లో అద్భితములు జరగాలి అని నిర్ణయించేసాడు. కాబట్టీ ఏ నెల, ఏ దినము ఏమి అద్భుతము జరగాలో అన్నీ ప్రభువే సిద్ధపరచేసారు గనుక ఇంక చింతపడవలసిన అవసరము లేనే లేదు. 2025 సమాధానకరమైన సంవత్సరము.

ఏలియా వెళ్ళిపోయేముందు ఎలీషాను అభిషేకించాడు. ఏలియా అపి ఏ అభిషేకముందో ఎలీషాపై కూడా అదే అభిషేకము దిగి వచ్చింది. ఏలియా “నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో!” అనే మాట అన్నాడు, ఎలీషా కూడా అదే మాట చెప్తూ వచ్చాడు. అయితే ఏలియా ఎన్ని అద్భుతములు చేసాడో, దానికంటే రెట్టింపు అద్భుతములు చేసాడు.

2024 లో కొంత నీవు దీవించబడ్డావు, అయితే 2025 లో నీవు అధికముగా దీవించబడతావు. ఎర్రసముద్రము వద్ద మోషేకు సాగిపో అని దేవుడు చెప్పాడు. యెహోషువతో యోర్దాను దాటి వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు. అయితే ఎలిషా విషయములో దేవుడు చెప్పలేదు కానీ, యోర్దాను రెండు పాయలు గా చీలి అడ్డు తొలగించబడింది. అలాగే 2025 లో నీకు అడ్డుగా నిలబడేది లేదు.

వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడు–వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతట ఆ పట్టణపువారు–ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నదిగాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సా రమై యున్నదని ఎలీషాతో అనగా అతడు–క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, – యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.౹ కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది. -2 రాజులు 2:18-22

ఎలీషా 2025 ను సూచిస్తున్నాడు. 2025 కి రాకమునుపు అంతా బాగానే కనబడుతుంది కానీ ఎదో సమస్య ఉంది. అయితే ఎలీషా వచ్చిన తరువాత, ఎలా అయితే ఆ పట్టణము యొక్క నీళ్ళు బాగు చేయబడ్డాయో, అలాగే 2025 వరకూ నీ మనసులో ఉండి బయటకు కనబడని, బాధలు సమస్యలు 2025 లో తీర్చబడతాయి.

2025 14 అద్భుతములు జరిగే సంవత్సరము. మొదటిగా నీ యెదుట ఉన్న అడ్డు తొలగించబడుతుంది, తరువాత నీ సమస్య తీర్చబడుతుంది, అలాగే నిన్ను ఏడిపించే పరిస్థితులు అన్నింటికీ ముగింపు సంవత్సరము.

– యెహోవా సెలవిచ్చినదేమనగా – ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;౹ యెహోవా సెలవిచ్చునదేమనగా–గాలియేగాని వర్షమేగాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.౹ -2 రాజులు 3:16-17

ఇక్కడ దేవుని గూర్చిని వారు తప్పుగా అర్థము చేసుకున్నారు. శత్రువుల చేతికి దేవుడే అప్పగించాడు అని వారు అనుకున్నారు. అయితే ఎలీషా వద్దకు వారు నడిపించబడిన తరువాత, వారు జీవించబడునట్లుగా, వర్షము వచ్చినా రాకపోయిన, వారు త్రవ్విన గోతులలో నీళ్ళు ఉండేవిధానముగా పరిస్థితులు మార్చబడ్డాయి.

నీకు కూడా దేవుని గూర్చిన వ్యతిరేకమైన ఆలోచన ఏమైనా ఉన్నా సరే నిన్ను నీవు సిద్ధపరచుకో.

ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును.౹ -2 రాజులు 3:18

వాళ్ళు అనుకున్నారు, మోయాబీయుల చేతికి అప్పగించడానికి మమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు అని వాళ్ళు అనుకున్నారు. అయితే వారి చేతికే మోయాబీయులను అప్పగించాడు. అలాగే మీ 2025 లో మీ ప్రశ్నలకు జవాబు దొరికే సమయము.

అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య–నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవాయందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా -2 రాజులు 4:1

ఎలీషా దగ్గరకు అప్పులతో వచ్చారు. అయితే వారు దైవభక్తి కలిగిన వారుగా ఉన్నారు. అప్పుడు అక్కడ అప్పులు తీర్చబడునట్లుగా ఎలీషా ఒక పరిష్కారము ఇచ్చాడు. ఎవరైతే వ్యాపారము చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నవారు ఈ సంవత్సరము నీ అప్పులు తీర్చబడతాయి. నీ గిన్నె నిండి పొర్లిపోయే విధముగా కార్యములు జరుగుతాయి. 2024 లో 12 గంపలు అయితే 2025 నిండి పొర్లిపోయే సంవత్సరము, సరిపోయేంత మాత్రమే కాదు గానీ, నిండి పొర్లే సంవత్సరము. క్రీస్తు యేసునందలి మహిమైశ్వర్యమును బట్టే ఈ గిన్నె నిండే అనుభవము నీవు కలిగి ఉంటావు.