స్తోత్ర గీతములు
ఆరాధన వర్తమానము
గడిచిన కాలమంతా మన జీవితాన్ని ప్రభువే కొనసాగించాడు. యెషయా గ్రంథములో చూస్తే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపచేయువాడను కూడా నేనే అని ప్రభువు చెప్పుచున్నాడు.
ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలోనుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు. -యెషయా 43:12
ఈ దినము కృతజ్ఞతార్పణ అర్పించవలసిన దినము. ఎందుకనగా నేనే నీకు దేవుడనై ఉన్నాను అని ఆయనే ప్రకటించాడు, ఆ సత్యమును గ్రహింపచేసినవాడుగా కూడా ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమ ద్వారా ఆ సత్యమును గ్రహింపచేస్తున్నాడు. దేవుని ప్రేమను గ్రహించకపోతే, ఆయనే దేవుడు అనే సత్యము కూడా మనము తెలుసుకోలేము.
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. -విలాపవాక్యములు 3:22-23
మనము ఇంకా నిర్మూలము కాలేదు, ఇంకా మన జీవితములు ముగించబడలేదు అంటే దానికి కారణము, ఆయన ప్రేమ మన యెడల కురిపించడమే! కడుపునొప్పి వచ్చి చనిపోయినవారు ఎందరో ఉన్నారు, శ్వాస తీసుకున్నప్పుడు కష్టమై చనిపోయినవారు ఉన్నారు. అయితే ఇలాంటివేమైనా సరే మనలను కొనిపోలేదు గానీ, మనము నిలిచే ఉండటానికి ఆ దేవుని ప్రేమ సహాయపడుతూ వచ్చింది. అందుకే మన జీవితాన్ని మనము ఎలా గడుపుతున్నాము, ప్రతీ దినము, ఎలా ముగించగలిగి, మరొక దినములోనికి వెళుతున్నాము అనేది అర్థము చేసుకొంటే, దేవుని ప్రేమ మనకు అర్థము అవుతుంది. మన శక్తిని బట్టి మనము మన రొజులు వెళ్ళబుచ్చట్లేదుగానీ, దేవుడు తన ప్రేమ చేత మనలను కాపాడటమును బట్టే మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. అందుకే మనము ఆయనను ఆరాధించవలసిన సమయము ఇది.
2024 అంతా కూడా దేవుని ప్రేమ మనపై, మనతో నిలిచి ఉన్నది గనుకనే మనము ఈరోజున సజీవులుగా ఆయన సన్నిధిలో ఉన్నాము. ఈ సంవత్సరము దేవునికి దగ్గరగా ఉన్న రోజులున్నాయి, ఆయననుండి దూరముగా వెళ్ళిపోయిన, తప్పిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలా అయితే తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చినపుడు ఎలా అయితే తండ్రి ప్రేమతో కౌగలించుకున్నాడో, పరలోకమందున్న నీ తండ్రి కూడా అదే విధముగా నీపై ప్రేమ చూపిస్తున్నాడు.
దేవునికి దూరముగా ఉన్నంత కాలము మనము క్షేమమును చూడలేము. ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము. వాక్యము వినడము, వెళ్ళిపోవడం వలన ఏమీ ప్రయోజనము ఉండదు. 2024 లో ఎన్ని మాటలు ప్రభువు మాట్లాడాడు? ఎన్ని మనము జ్ఞాపకము పెట్టుకున్నాము? వాక్యము మన పాదములకు దీపమై ఉండాలి, అదే మనకు వెలుగై ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యమును మనము పట్టుకొని నిలబడతామో, అప్పుడు చీకటి మనలో ప్రవేశించడానికి అవకాశమే లేదు.
లాజరు చైనిపోయినపుడు, మార్తను చూసినపుడు బోధించాడు, మరియ వచ్చినపుడు మాత్రము దుఃఖించినాడు. ఎందుకు అంటే, ఇంటిలో ప్రభువు బోధించినపుడు మార్త పనులలో మునిగిపోయింది, అయితే మరియ మాత్రము ప్రభువు పాదాల చెంత కూర్చిని వాక్యమును శ్రద్ధగా విన్నది. మార్త దగ్గరనుండి ప్రభువు ఆశించలేదు గానీ, మరియనుండి మాత్రము సత్యముపై నిలబడాలి అని ఆశించాడు. అయితే మరియ కూడా సాధారణముగానే మాట్లాడే సరికి ప్రభువు దుఃఖపడ్డాడు.
అందుకనే మనము దేవుని వాక్యము విని, దానిని గ్రహించి ఆ ప్రకారము మనము మన నడవడి, ప్రవర్తన, స్పందించే శైలి, చేసే పనులు, మాట్లాడే మాటలు అన్నీ విన్న వాక్యము ప్రకారము ఉండాలి, అలా కాకపోతే దేవుని హృదయమును నొప్పించేవారముగా ఉంటాము.
“క్రీస్తునందున్న వారికి మాత్రమే”, పాతవి గతించిపోయెను, సమస్తము నూతనమాయెను.
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;౹ -2 కొరింథీయులకు 5:17
2024 గతించిపోయి ఒక నూతనమైన 2025 అనే సంవత్సరము నీకొరకు సృష్టించబడి, సిద్ధపరచబడింది. 2024 లో ఇంకా ఏమైతే ఇంకా ముగించబడలేదో, అవి నూతనపరచబడుతున్నాయి. 2024 పన్నెండు గంపలు ఉన్నాయి అయి గడచిన 31 రాత్రి పరిచర్యలో ప్రభువు చెప్పాడు అయితే దానిని మరలా 2025 లో మరొక అవకాశము ప్రభువు ఇచ్చేవాడుగా ఉన్నాడు.
యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయ పడుచున్నాను యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. -హబక్కూకు 3:2
2025 అనేది అడుగుపెట్టి అనుభవించే సంవత్సరము. ఈ సంవత్సరమంతా దేవుని ప్రేమ మనపై ఉన్నది కాబట్టే ఇంకా మనకు మరొక అవకాశము ఇవ్వబడింది. దేవుని ప్రేమ ఎంతో శక్తి కలది, ఆ ప్రేమ మృతమైన లాజరును తిరిగి బతికించింది. ఆ లాజరు జీవితము దేవుని ప్రేమకు సాక్ష్యముగా కనపరచబడింది. అలాగే, నిన్ను ప్రేమించిన దేవుని ప్రేమ నిన్ను కూడా అనేకుల యెదుట సాక్ష్యముగా నిలుపుతుంది.
–నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. -యెషయా 45:2-3
దేవుని ప్రేమ 2025 నీ జీవితములో దేవుని చిత్తము జరుగులాగున ఒక సాక్ష్యము కనపరచబడుతుంది. ఇది ఎందుకు అని ఆలోచిస్తే, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచింది దేవుడే అనే సత్యము నీకు తెలియడము కొరకే!
ఆరాధన గీతము
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే
నిన్ను నేను – ఎన్నడు విడువను (2)
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగ జీవింతున్
నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)
ఏక రక్షకుడు యేసే
లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)
నా సర్వము నీకే అర్పింతును
పూర్ణానందముతో నీకే అర్పింతున్
నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)
మేఘ రథములపై రానైయున్నాడు
యేసు రాజుగ రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి (2)
స్వర్గ రాజ్యములో యేసున్
సత్య దైవం యేసున్
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే
వారము కొరకైన వాక్యము
దేవుడు మనలను తన వాక్కు చేత జీవింపచేసేవాడిగా ఉన్నాడు ఈ సత్యమును గ్రహించిన ప్రతీ వాడు జీవింపచేయబడతాడు. అందువలననే వాక్కును బట్టే మనము జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. 2024 వలే 2025 ఉండదు, అయితే ఒక ప్రత్యేకమైన సంవత్సరముగా ముద్రించబడిన సంవత్సరము. నీవు సిద్ధపడకుండా అద్భుతమును చూడలేవు.
మన దేవుడు కొనసాగించే దేవుడే గానీ మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని కొనసాగించేవాడిగా ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కానాను వెళ్ళడము అనేది దేవుని చిత్తము. కానాను వెళ్ళడము అనేది మోషే కంటే ముందే, అబ్రహాముతో చెప్పబడింది. అనగా అబ్రహాముతో చెప్పబడిన మాట కొనసాగింపుగా మోషేను ఏర్పరచుకొని, కొంత దూరం నడిపించాడు. ఆ తరువాత మోషే చనిపోయిన తరువాత యెహోషువను ఏర్పరచుకొని వారి ప్రయాణము కొనసాగించాడు, చివరికి వారిని కనానులోనికి ప్రవేశపెట్టాడు.
యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నా సేవకుడైన మోషే మృతినొందెను.౹ కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.౹ -యెహోషువ 1:1-2
దేవుని వాగ్దానము నెరవేర్చునట్లుగా మోషే ఏర్పాటుచేయబడ్డాడు. అయితే ఆ వాగ్దానము నెరవేర్చబడలేదు. అంటే దేవుని వాగ్దానము నెరవేర్చడానికి 2024 ను ప్రభువు ఏర్పాటు చేసాడు. అయితే ఆ వాగ్దానము నెరవేరకుండ మిగిలిపోయిన కారణముచేత, 2025ను ప్రభువు ఏర్పాటు చేసాడు.
“నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి” అంటే 2025 లో దేవుడు సిద్ధపరచిన జీవితాన్ని మీరు స్వతంత్రించుకోబోతున్నారు. అయితే దానికొరక్ ఏమి చెయ్యాలి అంటే, “లేచి” వెళ్ళాలి. యెహోషువ సిద్ధపాటు చూస్తే, మోషే వల్లే కాలేదు నావల్ల ఏమవుతుంది? అని అస్సలు అనలేదు గానీ, దేవుడు ఏమైతే చెప్పాడో దాని కొరకు ఖచ్చితముగా నిలబడ్డాడు, లేచి ముందుకు సాగాడు. 2025 వాగ్దాన దేశము స్వతంత్రించుకొనే సంవత్సరమే! పరిచారకుడుగా ఉన్న వ్యక్తి నాయకుడుగా మార్చబడ్డాడు. 2024 వరకు నీవు క్రిందిస్థాయిలో ఉన్నావేమో గానీ, 2025 లో నీవు గొప్పస్థాయిలో ఉండబోతున్నావు.
నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను.౹ -యెహోషువ 1:3
ఈ వాక్యమును బట్టి 2024 లో ఏదైతే వాగ్దానము ఇవ్వబడి, ఇంకా నెరవేరలేదో, నెరవేరని ప్రతి వాగ్దానము 2025 లో ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది.
నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.౹ -యెహోషువ 1:6
నీవు స్వతంత్రించుకొనునట్లుగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటున్నాదు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీ దేవుడు గనుక, నీవు ధైర్యముగా ఉండు అని ప్రభువు చెప్పుచున్నాదు. ఈ దినము ప్రభువు నిన్ను కూడా సిద్ధపరచుచున్నాదు. గనుక ధైర్యము కలిగి నిలబడదాము.