దేవుని కార్యం జరగడానికి

Supernatural Service | దేవుని కార్యం జరగడానికి |15-July-2022 | Rajahmundry

https://www.youtube.com/watch?v=MPKdpXSja8s

Songs

ప్రేమించెదన్ అధికముగా

ప్రేమించెదన్ అధికముగా

ఆరాధింతున్ ఆసక్తితో (2)

నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్

పూర్ణ బలముతో ప్రేమించెదన్

ఆరాధన ఆరాధనా

ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)

ఎల్షడ్డాయ్ దేవా ఎల్షడ్డాయ్ దేవా

సంతోషమును నింపువాడా (2)

సంతోషమును నింపువాడా  || నిన్ను పూర్ణ ||

ఎబినేజరే ఎబినేజరే

ఇంత వరకు ఆదుకొన్నావే (2)

ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||

ఎల్రోహి ఎల్రోహి

నన్ను చూచావే వందనమయ్యా (2)

నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||

యెహోవా రాఫా యెహోవా రాఫా

స్వస్థపరిచావే వందనమయ్యా (2)

స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||

నీలాంటి దేవుడులేడు మాకిలలో

పల్లవి:

ఎల్షడ్డాయ్ ఎల్షడ్డాయ్

ఎల్షడ్డాయ్ ఎల్షడ్డాయ్

నీలాంటి దేవుడులేడు మాకిలలో

నీలాంటి దేవుడులేడు (2)

చరణం:

మృతులను సజీవులుగా

లేనివి ఉన్నట్టుగా (2)

చేసినదేవా స్తోత్రం

ఆశ్చర్యకరుడా స్తోత్రం (2)

నీలాంటి దేవుడులేడు

చరణం:

వేదనలో మాకు శాంతి

కన్నీళ్ళలో సంతోషం (2)

ఇచ్చినదేవా స్తోత్రం

అద్భుతకరుడా స్తోత్రం (2)

నీలాంటి దేవుడులేడు

చరణం:

రోగములో మాకు స్వస్థత

బాధలలో నెమ్మది

ఇచ్చినదేవా నీకు స్తోత్రం

యెహోవా రాఫా స్తోత్రం

నీలాంటి దేవుడులేడు

చరణం:

కుటుంబములను కట్టువాడా

విజయమునిచ్చువాడా

యెహోవా షాలోం స్తోత్రం

యెహోవా నిస్సీ స్తోత్రం

నీలాంటి దేవుడులేడు

Worship Message | ఆరాధన వర్తమానం

నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు -కీర్తనలు 18:50.

మనము రాజులైన యాజక సమూహము. దీనికి బట్టి మనముకూడా స్వీకరించవచ్చు. దేవుడు నియమించిన రాజులమైన మనకు గొప్ప రక్షణ కలుగచేయబడుతుంది. ఎదుకు గొప్ప రక్షణ అవసరమై ఉన్నది? ఏ స్థితిలో ఇది చెప్పబడింది అనేది చూసినప్పుడు, 4,5 వచనములలో, “మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను -కీర్తనలు 18:4-5”. ఒకవేళ ఇటువంటి స్థితిలో ఉన్నట్టయితే నీ జీవితములో దేవుడు గొప్ప రక్షణ కలుగజేయును. అయితే నీ దేవుడు ఏమై ఉన్నాడో నీవు ఎరిగి ఉండాలి. “ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు -ద్వితీయోపదేశకాండము 32:39”. దేవుడు “నేనే మృతినొందించువాడను” అని చెప్తున్నాడు. అంటే ఎవరిని మృతినొందిస్తాడు? “ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు -కీర్తనలు 18:48”. అనగా ఏ పరిస్థితులు నీకు, నాకు వ్యతిరేకముగా లేచుచున్నాయో ఆ పరిస్థితులను మృతినొందిచేవాడు. ఏ బలము లేని స్థితిలో శత్రువు గా ఏ పరిస్థితి అయితే నీ మీద దాడి చేస్తుందో, ఆ పరిస్థితికంటే ఉన్నతముగా నిన్ను బలపరిచేవాడు నీ దేవుడు.

సరైన ఆధారము, సరైన జీవితపు గమనము లేని కారణాన, అనేక పరిస్థితులు, వరదవలే పొర్లి వస్తున్నాయి. అయితే వాటి అన్నిటికంటె నీవు హెచ్చించబడతావు. ఎలా అంటే, “నీకు బలము ధరింపచేసేవాడు”, నిన్ను ఓడిపోనివ్వడు నీ దేవుడు. నీ బలముచేత ప్రయత్నిస్తే నువ్వు ఓడిపోతావు. అందుకే యేసును అంగీకరించిన నీవు ఆయన చేత ఏర్పరచబడినవాడవు, ఏర్పరచబడినదానవు గనుక ఆయన బలము నీకు ధరింపచేయువాడు. “నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. -కీర్తనలు 5:11”. ఉదాహరణకు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీలో ఉన్న బెనెఫిట్స్ అన్నిటికీ నీవు అర్హుడవు. అయితే నీవు వాటిని ఉపయోగించుకోవడానికి చేయవలసినది చేయాలి. అలాగే దేవుని అంగీకరించగానే, దేవుని వలన కలిగే బెనెఫిట్స్ అన్నిటికీ మీరు అర్హులే, అయితే వాటిని పొందటానికి “ఆరాధన” అనేది ఒక మార్గము.  నీవు ఆరాధిస్తుండగానే నీకు బలముకలగడానికి మార్గములు సిద్ధపరచబడతాయి.

Woship Song|ఆరాధన గీతము

ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా

నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2)

నిను విడచి నేనుండలేను

క్షణామైనా నే బ్రతుకలేను (2)   ||ఆశ్రయమా||

చరణం:

కష్ట కాలములు నన్ను కృంగదీసినను

అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2)

నా వెంటే నీవుండినావు

నీ కృపను చూపించావు (2)   ||ఆశ్రయమా||

చరణం:

భక్తిహీనులు నాపై పొర్లిపడినను

శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2)

నా వెంటే నీవుండినావు

కాపాడి రక్షించినావు (2)   ||ఆశ్రయమా||

చరణం:

మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను

బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2)

నా వెంటే నీవుండినావు

దయచూపి దీవించినావు (2)   ||ఆశ్రయమా||

రేమా: నీజీవితము నాశనమువైపు కొట్టుకొనిపోయే పరిస్థితులలో ఉన్నప్పుడు, “నా దేవా నీవే నా ఆశ్రయము” అని నీవు ఆరాధనలో ప్రకటించగానే, నిన్ను కొట్టుకొనిపోనివ్వకుండా, ఆయనే ఆశ్రయముగా ఉంటాడు.
రేమా: బలహీనముగా ఉన్న కాళ్ళను బట్టి, అడుగులు తడబడుతున్నవేళ ఈరోజు, నీ కాళ్ళకు బలము కలుగజేయబడుతుంది. నీకొరకు సూపర్నేచురల్ మార్గములు తెరువబడుతున్నాయి

Main Message | మెయిన్ మెసేజ్

మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. -కీర్తనలు 118:9.

దేవుడు వాక్యమును విత్తనముతో పోల్చాడు. ఒక విత్తనము భూమిలో నాటబడినతరువాత, దాని ఎదుగుదల విషయములో అనేకమైనవి మన కంటికి కనబడకుండానే జరుగుతాయి. అనేకరోజుల తరువాత మొదట ఒక చిన్న మొలక పైకి కనబడుతుంది. నాటిన మరుసటిరోజునే మనకు ఎదుగుదల కనబడదు, కాని ఎదుగుదల అయితే నిర్ణయకాలమున ఖచ్చితముగా కనబడుతుంది. అలాగే నీ జీవితము కొరకై దేవుడు పంపిన వాక్యము నీ జీవితములో విత్తబడినతరువాత వెంటనే దాని ఫలింపు, నెరవేర్పు కనబడకపోవచ్చు కానీ, ఖచ్చితముగా జరుగుతుంది. దానికొరకై, ఆశకలిగి ఆ మాట కొరకు సిద్ధపడాలి.

అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.౹ -హోషేయ 1:7. దేవుని విసర్జించిన పరిస్థితులలో కూడా, తన బిడ్డల యెడల జాలి పడేవాడుగా ఉన్నాడు. దయనీయమైన స్థితిలో ఉన్న పరిస్థితులలో దేవుడు జాలిపడి జ్ఞాపకము చేసుకుంటున్నాడు, మరియు కన్నులారా చూస్తున్నాడు. ప్రతిఫలము ఇచ్చుటకొరకై నరపుత్రుల మార్గమును కన్నులారా చూచుచున్నాడు. “ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియా ఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నర పుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.౹ -యిర్మీయా 32:19”. ఏ దేవుని కార్యము జరిగించబడాలి అని ఆశిస్తున్నావో, దేనికొరకు దేవుని ఆశ్రయిస్తున్నావో, ఆ ప్రతిఫలము దేవుడు దయచేయువాడు. మనము దేవుడు ఆలస్యము చేస్తున్నాడు అని అనుకుంటాము కానీ, ఆయన తన బిడ్డలకు ఎల్లప్పుడూ సమీపముగా ఉండి, తన పిల్లలకొరకు సర్వసమృద్ధి అందుబాటులో ఉంచే దేవుడు. అయితే ఆలస్యము అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. దేవుని వాక్యమును వివేచన కలిగి గ్రహించి స్వీకరించాలి. ఆయన తనను నమ్మిన వారిని ఏమాత్రమూ సిగ్గుపడనివ్వడు. తన బిడ్డలకొరకు శాశనములుకూడా మార్చగల దేవుడు. నీవు దేవుని మాత్రమే నమ్మి , ఆయననే పట్టుకొనిన నీ నమ్మకత్వముకొరకు ప్రభువు గిఫ్ట్ ఇచ్చేవాడుగా ఉన్నాడు.

అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి–జీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను.౹ -దానియేలు 6:20. రాజు దానియేలును చాల ఇష్టపడ్డాడు. అయితే దానియేలును ద్వేషించే కొంతమంది, దానియేలు విషయములో ఏమి తప్పు పట్టుకొనలేక, ఒక కుటిల ప్రయత్నము జరిగించారు. “రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, యీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి నను సరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను -దానియేలు 6:7-9”. అయితే దేవుని నమ్మిన దానియేలు, “ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేముతట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.౹ -దానియేలు 6:10”. ఇప్పుడు దానియేలు శత్రువులకు అవకాశము దొరికింది. వారు వెంటనే వెళ్ళి రాజుతో చెప్తున్నారు, “అందుకు వారు–చెరపట్ట బడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడనిరి.౹ రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని, సూర్యు డస్తమించువరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను.౹ -దానియేలు 6:13-14”. ఇక్కడ అధికారము కలిగిన రాజు దానియేలును తప్పించవలెను అని తీవ్రముగా ప్రయత్నించెను కాని దానియేలు అయితే ఏమి అడగలేదు. అయితే శత్రువులు మాత్రము ఏమాత్రము అవకాశములేకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. “ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి–రాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసి కొనవలెననిరి.౹ -దానియేలు 6:15”. ఇంకా, “వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలునుగూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమో యని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి.౹ -దానియేలు 6:17”. అయితే దానియేలు తనను రక్షించగలిన దేవునినే నమ్ముకున్నాడు, ఆశ్రయించెను గానీ, మనుష్యుడైన రాజును ఆశ్రయించలేదు. దీనిని రాజుకూడా ఒప్పుకున్నాడు. “అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు–నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.౹ -దానియేలు 6:16”. నేను అధికారము కలిగినా కూడా నేను నిన్ను రక్షించలేకపోయాను కానీ నీవు అనుదినమూ సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును, అనీ రాజు ఒప్పుకుంటున్నాడు. అలాగే నీ జీవితములో ఇంతవరకు నీవు ఆశ్రయించిన నీ దేవుడే నిన్ను రక్షించువాడు. శాసనము పుట్టించబడింది అనే విషయము తెలిసినాకూడా దానియేలు ఎందుకు యథాప్రకారము ప్రార్థించాడు?  ఏ పరిస్థితులనోనైనా తనదేవుడే తనను కాపాడేవాడు, తన జీవితాన్ని నడిపించేవాడు అని నమ్మినవాడై తన దేవుడినే ఆశ్రయించాడు. నీ జీవితములో అనేకమైన సింహాలు ఉండవచ్చు. కొన్ని అనారోగ్యమో, కొన్ని ఆర్థిక పరమైనవో, మరికొన్ని తీవ్రమైన కష్ట పరిస్థితులైనా కావచ్చు. నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడే నిన్ను కాపాడువాడు.

“అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.౹ తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను.౹ అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి–జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను.౹ అందుకు దానియేలు–రాజు చిరకాలము జీవించునుగాక.౹ నేను నా దేవునిదృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.౹ -దానియేలు 6:18-22”. దానియేలు యదార్థముగా దేవుని ఆశ్రయించేవాడుగా ఉన్నదానిని బట్టి, ఆ దేవుడే ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతాన్ని జరిగించాడు. తన దూతలను పంపించి సింహాల నోళ్ళను మూయించెను. అంటే ఆ సింహాలు నోరు తెరిచాయి, కానీ దూతలను పంపి ఆ నోళ్ళను మూయించాడు దేవుడు. అలాగే నీ జీవితములో ఎటువంటి సింహమైనా, దూతలను పంపి, అనగా పరలోకపు అధికారము విడుదలచేసి ఆ సింహపు వంటి పరిస్థితులు ముగించబడులాగున తన మార్గాన్ని పంపేవాడు మనదేవుడు.

మన జీవితములో దేవుడు కార్యము జరిగించాలి అంటే, నిత్యము ఆయనను యదార్థముగా సేవించి, ఆశ్రయించువారిగా ఉండాలి. మన దేవుడు ఎట్టి పరిస్థితులలోనూ చెయ్యి విడిచేవాడుకాడు.

రేమా: నీ పరిస్థితి మునిగిపోయేది అయినా కూడా, నీకు చెయ్యి ఇచ్చి లేపేవాడు నీ దేవుడు.
రేమా: నీవు ఆశీర్వదించబడినవాడవు, ఆశీర్వదించబడినదానవు
రేమా: నీవు ఇంతవరకు నమ్ముకుని సేవించిన నీ దేవుడు, నీ మీద ఉన్న బలమైన కాడి విరుగగొట్టుచున్నాడు. బిగించబడిన ఉచ్చు నుండి విడుదల దయచేయుచున్నాడు.
రేమా: నీకిష్టమైనవారు నీ స్థితిమార్చడానికి ఎంతో ప్రయత్నాలు చేసి వుండొచ్చు, అయితే ఆ ప్రయత్నాలు ఫలించని స్థితిలో ఉన్నావేమో, ప్రయత్నాలన్నీ ముగించబడిన ఆ స్థితిలో ప్రభువే నీ జీవితములో కలుగచేసుకుంటున్నాడు. ఒక నూతనమైన ఆరంభము ఇవ్వబోతున్నాడు. ఒక నూతన మార్గము తెరువబోతున్నాడు.
రేమా: బందీగా ఉన్న నీ జీవితాన్ని విడుదల చేస్తున్నాడు నీ దేవుడు.