అన్ని నామములకన్న పై నామము

అన్ని నామములకన్న పై నామము
యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది
క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్

1. పాపముల నుండి విడిపించును
యేసుని నామము
నిత్య నరకాగ్నిలోనుండి రక్షించును
క్రీస్తేసుని నామము

యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్

2. సాతానుపై అధికారమిచ్చును
శక్తి కలిగిన యేసు నామము
శత్రుసమూహముపై జయమిచ్చును
జయశీలుడైన
యేసు నామము

యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్

3. శరీర వ్యాధులన్నీ బాగుచేయును
నజరేయుడైన యేసు నామము
సమస్త బాధలను తొలగించును
అభిషిక్తుడైన యేసు నామము

యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్

4. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము


యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్

en English te Telugu