కృపలను తలంచుచు

కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్

కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం

రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం

సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను – (ఇలలో)

హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే – (ఆమెన్)

en English te Telugu