స్తోత్ర గీతము 1
కృపామయుడా నీలోనా – నివసింప జేసినందునా –
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా – ఇదిగో నా స్తుతుల సింహాసనం – కృపామయుడా
ఏ అపాయము నా గుడారము – సమీపించనియ్యక
నా మార్గములన్నిటిలో – నీవే నా ఆశ్రయమైనందున
చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలచిన తేజోమయా
రాజ వంశములో – యాజకత్వము చేసెదను
నీలో నిలచి ఆత్మ ఫలములు – ఫలియించుట కొరకు
నాపైనా నిండుగా – ఆత్మ వర్షము కుమ్మరించు
ఏ యోగ్యత లేని నాకు – జీవకిరీట మిచ్చుటకు
నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను
స్తోత్ర గీతము 2
శుభవేళ – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
ఆరాధన – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
తండ్రీ దేవా – నీకేనయ్యా
ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా
సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్
ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా
నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి
యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా
మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా
యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా
శాంతి నొసగువాడా – యెహోవా షాలోం
స్తోత్ర గీతము 3
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు
ఓ లార్డ్! యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు
ఆరాధన వర్తమానము
దేవుని నామములో మీ అందరికీ శుభములు. మన దేవుడు మంచి దేవుడు, మన అందరినీ సజీవుల లెక్కలో ఉంచినందుకు ఆయనకే స్తోత్రములు.
స్తుతి అనేది మనకు మనము చేసేది. ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాపూర్వకముగా చేసేది. కానీ ఆయన సన్నిధికి మనలను ఆయనే నడిపిస్తాడు. ఎందుకంటే, ఆయన తన వాక్యము ద్వారా మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు.
మన పితరుల జీవితాన్ని చూస్తే, దేవుడే తన ఆలోచన బట్టి నడిపించినవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రతివారినీ ఆయన తన ఆలోచన ద్వారా నడిపించాలి అనే కోరిక కలిగి ఉన్నాడు.
అందుకే ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన మనము అందరము, మన జీవితము గురంచి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అనే సత్యము మనము ఎరిగి ఉండాలి. ఈ సత్యము తెలియనంతవరకు అజ్ఞానముతో మనము దేవుని సన్నిధికి వచ్చేవారముగా ఉంటాము గానీ ఎప్పుడైతే మనము సత్యము ఎరిగి ఆయనను వెంబడిస్తామో అప్పుడు నిజమైన కృతజ్ఞతా బలి పీఠము కట్టకలుగుతాము.
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము 3:22
మనమీద దేవుని ప్రేమ కనపరుస్తున్నారు కాబట్టే, మనము నిర్మూలము కాలేదు. నేను ఫలానా ప్రకారము చేసాము కాబట్టి నేను ఇలా ఉండగలిగాను, చేయగలిగాను, సంపాదించగలిగాను అని అనుకుంటాము. అయితే సత్యము ఏమిటి అంటే, దేవుని ప్రేమ మనమీద చూపిస్తున్నాడు కాబట్టే, మనము చేయగలుగుతున్నము, ఉండగలుగుతున్నాము, సంపాదించగలుగుతున్నాము.
లోకములో ఒక సామెత ఉంది – “ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి”. ఈ అనుభవము మనకు ఎదురైనప్పుడు దేవుడి ప్రేమ, కృపయే నా జీవితమునకు ఆధారము అనే సత్యమును తెలుసుకోగలుగుతాము.
యోసేపు జీవితాన్ని చూస్తే, గృహనిర్వాహకుడుగా ఉన్నప్పుడు, యెహోవా తోడై ఉన్నాడు కాబట్టి, వర్థిల్లుతూ వచ్చాడు. అందుకే ఏ పరిస్థితిలోనైనా సరే, మనము దేవుని బట్టి కాక, మనము కలిగి ఉన్నదానిని బట్టి అతిశయపడకూడదు.
నాశనమునకు ముందు గర్వము బయలుదేరును. ఈ భయము మనము కలిగి ఉండాలి.
అబ్రహాము ఆశీర్వాదము మన జీవితములో అనుభవించడానికి కారణము యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేయబడిన రక్షణ. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమను గుర్తించినవారు ఖచ్చితముగా ఆయన ప్రేమకు స్పందిస్తారు.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. -విలాపవాక్యములు 3:23
వాత్సల్యత అంటే ప్రేమతో కూడిన జాలి. ఒక దినము నేను నశించిపోయే కార్యములతో ఉన్నప్పటికీ ఆయన వాత్సయలను బట్టి మరలా నన్ను సమకూరుస్తారు. అలా ప్రతి దినము చూపే కనికరమును బట్టి, నేను నాశనము కాను. ఖచ్చితముగా దేవుని చిత్తము నాలో నెరవేరుతుంది. అంటే నీవు నేను నాశనము కాకుండా ఆయన ప్రేమ అనుదినము కాపాడుతూ వస్తుంది.
మొదటిగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి దేవుడు మనపై కృప చూపిస్తున్నాడు. ఆ కృపను బట్టి ఆయన దయ మనకొరకు ఆయన సహాయమును దయచేస్తుంది. ఎలా అంటే, మనము నాశనము కాకుండా ఏమి సిద్ధపరచాడో, వాటిలోనుండి మనకు అవసరమైనది అనుగ్రహించబడుతున్నాయి.
ఈ సత్యము మనము ఎరిగినపుడు ఆయనకు కృతజ్ఞత మనము అర్పించాలి.
అయితే కొన్నిసార్లు మనము నష్టమును అనుభవించేవారిమిగా ఉంటాము. మరి దీనిని ఎలా చూడాలి అంటే, ఆ నష్టములో మనము నశించిపోలేదు కదా. ఆ నష్టములో సహితము దేవుని ప్రేమను నమ్మినపుడు, ఖచ్చితముగా రెండతలుగా దేవుడే దయచేసేవాడుగా ఉన్నాడు.
యోబు జీవితములో చూస్తే, శోధన అనుమతించబడినదానిని బట్టి నష్టపోయాడు. గానీ దేవుని ప్రేమ అతననిని విడువక తిరిగి సమకూర్చబడ్డాడు. అందుకే ఆయన ప్రేమను అనుదినము మనము కోరుకొనేవారిగా ఉండాలి.
యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. -కీర్తనలు 92:1-2
ఉదయమున మనము లేవగానే, ఆయన కృపను మనము కోరుకొనేవారిగా మనము ఉండాలి. ప్రతీ రాత్రి పడుకునే ముందు ఆయన విశ్వాస్యత ను కోరుకొనేవారిగా మనము ఉండాలి. అప్పుడు ఆయ్న దయ ద్వారా ఆయన సహాయము అందించబడుతుంది. ఆ సహాయము ఎలా అందించబడుతుంది అంటే, ఆయన సిద్ధపరచినదానిని మనకు దయడము ద్వారా.
ఆరాధన గీతము
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
పాపాల ఊబిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా
ఏ తోడులేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచావయ్యా
నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా
వారము కొరకైన వాక్యము
మన అందరికీ ఆయన వాక్యమును వినే అవకాశము ఇచ్చాడు. గత వారము తండ్రితో, కుమారునితోను ఎలా సహవాసము కలిగి ఉండాలో నేర్పించాడు. ప్రభువు నేర్పినదాని ప్రకారము నడవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే ఆ నేర్చుకున్నదాని యొక్క ఫలము కనబడుతుంది.
దానికొరకు ఉజ్జీవము మనము కలిగి ఉండాలి. ఉజ్జీవము, ఆసక్తి లేని యెడల ప్రభువు నేర్పినదాని ప్రకారము మనము జీవించలేము. అసలు ఒక సత్యము మనము గ్రహించాలి. ప్రభువు ఏ సత్యము అయితే నీ వద్దకు తీసుకువస్తున్నాడు అంటే, ఆ సత్యమును బట్టి నీ జీవితము మార్చబడాలి, మహిమపరచబడాలి అనేది ఆయన కోరిక.
దేవుడు మనలను ఆయన కొరకైన సాక్షిగా నిలబెట్టడానికే ఏర్పరుచుకున్నాడు. అసాధ్యమైనది సాధ్యమగునట్లుగా మన జీవితములో కార్యములు జరిగించి, వీరి దేవుడు సమర్థుడు అనే సాక్ష్యము ప్రకటించబడాలి అనేది ఆయన కోరిక. మన జీవితమును కట్టువాడు ఆయనే.
దావీదు గొర్రెలు కాసుకోనేవాడు అయితే సింహాసనముపై కూర్చున్నాడు. ఆ సింహాసనము కొరకు దావీదు ఏ ప్రయత్నమూ చేయలేదు గానీ, ప్రభువే తన కార్యము జరిగించాడు.
అలాగే నీయెడల కూడా ప్రభువు తన ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. ఆయన ఏ ఉద్దేశ్యము అయితే కలిగి ఉన్నాడో, దాని కొరకు నీవు చేయవలసినది, ఆయన యందు కనిపెట్టడమే.
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతోకూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.౹ -1 తిమోతికి 4:8
మన జ్ఞానము ప్రకారము మనము చేసినపుడు కొంతవరకే దాని ప్రయోజనము. అయితే దేవుని మాటను బట్టి, ఆయన రివలేషన్ బట్టి నీవు వెళ్ళినపుడు, ఇప్పటి జీవము కొరకు, రాబోయే జీవము కొరకు ప్రయోజనకరముగా ఉంటుంది.
దైవము అనగా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ అయి ఉన్నారు. దైవభక్తి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యెడల భక్తి కనపరచాలి అనేది మనము నేర్చుకున్నాము.
ఈరోజు పరిశుద్ధాత్ముడి తో ఎలా సహవాసము చేయాలో నేర్చుకుందాము.
పరిశుద్ధాత్ముడు ఒక శక్తిగా చూస్తుంటాము గానీ ఒక వ్యక్తిగా చూడలేకపోతుంటాము. అయితే ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు.
నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.౹ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹ -యోహాను 14:16-17
మనము బాప్తీస్మము తీసుకున్నపుడు ఒక నూతనమైన జీవితము అనుగ్రహించబడుతుంది. ఆ జీవితములో పరిశుద్ధాత్ముడు నివాసము చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకే నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అయి ఉన్నది.
లోకము ఆయనను చూడదు గనుక ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందలేదు. అయితే మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీలో ఉంటాడు. దానిని బట్టి సూపర్‌నేచురల్ కార్యములు మీ జీవితములో జరుగుతాయి.
వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. -అపొస్తలుల కార్యములు 1:14
పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.౹ అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.౹ మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ౹ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. -అపొస్తలుల కార్యములు 2:1-4
ఇక్కడ ఉన్న శిష్యులు దేనికొరకు ఎడతెగక ప్రార్థిస్తున్నారు అంటే, “నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి” అని యేసయ్య వారితో చెప్పాడు.
అలా వారు ప్రార్థనలో ఉన్నప్పుడు మొదట ఒక ధ్వని తో వారున్న ఇల్లంతా వినబడింది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా కనబడింది.
దానిని బట్టి, “అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి”.
దీనంతటనీ గమనిస్తే, పరిశుద్ధాత్ముడు నూతనముగా సృష్టించగల సమర్థుడై ఉన్నాడు. యేసయ్య జననము చూస్తే, అంతవాకు ఎప్పుడూ, అటువంటి విధానములో జననము కలుగలేదు కానీ, పరిశుద్దాత్ముడి శక్తిని బట్టి కన్యక గర్భవతియై కుమారుని కన్నది.
“మీరు ఆయనను ఎరుగుదురు” అనే సత్యమును మనము గ్రహించాలి. అంటే, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినపుడు, ఖచ్చితముగా నీవు ఎరుగులాగున నీకు తెలియచేయబడుతుంది. గనుకనే మనము పరిశుద్ధాత్మ విషయములో, ప్రార్థించినపుడు పట్టుదల ఏక మనసు కలిగి ఉండాలి.
ఇలా అనుదినము ప్రార్థనలో పరిశుద్ధాత్మతో సహవాసము కలిగిఉన్నప్పుడు, ఎలా మనతో ఆయన మాట్లాడుతున్నాడో మనకు ఒక గుర్తు స్పష్టముగా తెలుస్తుంది.
గనుక మొదట మనము తండ్రిని స్తుతించాలి, వాక్యమును ధ్యానించాలి, అప్పుడు మనము స్తుతిలో ఒప్పుకున్నది, వాక్యములో గ్రహించినది ప్రత్యక్షపరచబడునట్లు పరిశుద్ధత్మదేవుడు పనిచేసేవాడుగా ఉంటాడు.
అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.౹ -యోహాను 16:13
సర్వసత్యములోనికి నడిపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు బోధించేవాడుగా ఉంటున్నాడు. అలాగే ఎల్లప్పుడు మనలో, మనతో ఉంటాడు.
సహవాసము అనేది ఎల్లప్పుడు ఆయనతో మనము చెయ్యగలుగుతాము. మామూలుగా ఉన్న సమయములో కూడా ఆయనతో సహవాసము చేయగలుగుతాము. మనలో చెడ్డ ఆలోచన పుట్టినపుడు మనతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని గుర్తించినపుడు, ఆ చెడ్డ ఆలోచనను మనము వెంటనే విడిచిపెడతాము.
పరిశుద్ధాత్ముడితో సహవాసము అంటే, ఆయనతో మనము ఏకమైపోవడమే. అలా ఉన్నప్పుడు నీ మాట ఏదో, అదే పరిశుద్ధాత్మ మాట అయి ఉంటుంది. అలాగే ఆయన మాట ఏమి అయి ఉంటుందో, అదే నీ మాట అయి ఉంటుంది.
నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.౹ -గలతీయులకు 2:20
అంటే, నా జీవితము వాక్యము ఏమి చెప్తుందో ఆ ప్రకారమే ఉంటుంది. నా ఆలోచన, జ్ఞానము ఇంక ఉండదు.
పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ వాక్యమునే జ్ఞాపకము చేస్తాడు. మనము తప్పుగా చేస్తున్నపుడు, ఇది సరైనది కాదు అనే హెచ్చరిక ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ మాటకు లోబడితే, నీ జీవితము జీవముతో ఉంటుంది. అలా కాని యెడల, ఆయన దుఃఖించేవాడిగా ఉంటాడు.
పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము అంటే, మన జీవితము కొనసాగించబడుతున్నపుడు ఆయన అవును అంటే చేస్తూ, కాదు అంటే వదిలిపెడుతూ గనుక ప్రతీ కార్యమును జరిగించినపుడు, నిజమైన సహవాసము చెయ్యగలుగుతాము.
శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము;౹ -రోమా 8:5
పరిశుద్ధాత్మదేవునితో సహవాసం చేయాలి అంటే, ఆత్మ విషయములమీద మనసు ఉంచాలి. ఆత్మ సంబంధమైన విషయములు అంటే ఏమిటి? దేవునికి సంబంధించినవి.
ఉపవాసము ఆత్మీయమైనది ఎందుకంటే, శరీరము కృశించిననూ, ఆత్మ వృద్ధిచేయబడుతుంది.
ఒకరిగురించి మాట్లాడుకోవడము కాక, వారి నిమిత్తము ప్రార్థన చేయడము అనేది ఆత్మానుసారమైంది.
ఇలా ప్రతి విషయములో శరీరమునకు సంబంధించిన దాని ప్రకారము కాకుండా పరిశుద్ధాత్మ బోధించిన ప్రకారము మనముచేయగలగాలి. ఇచ్చేవిషయములో, చూసే విషయములో, చేసే విషయములో అన్ని విషయములలో ఆత్మ సంబంధమైన జీవితమును కనపరచాలి.
మనము ఇతరుల గురించి ప్రార్థించినపుడు, యేసయ్యకు పరిచారము చేసినట్టే అని యేసయ్య చెప్పాడు. ఈ మాటకు సాక్ష్యమివ్వడానికే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. గనుకనే ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండమని ప్రభువు చెప్పుచున్నాడు
ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.౹ -రోమా 12:11