దేవుడు మనలను విడిచిపెట్టడానికి కారణాలు – పార్ట్ 1.

ఈరోజు వాక్యము 3 భాగములుగా ఉండే వర్తమానము. ఈ రోజు మొదటిభాగము గూర్చి ధ్యానిద్దాము.

యెహెజ్కేలు 8 అధ్యాయము లో గమనిస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలగురించి ప్రవచన రూపములో మాట్లాడుతూ ఉన్నాడు. 5 వ వచనము నుండి చుసినట్టయితే –

నరపుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.౹ అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, వారుచేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడచేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.౹ -యెహెజ్కేలు 8:5-6.

“నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా… వీరు చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా” అని దేవుడు చెప్తున్నాడు. అసలు వారు ఏమి హేయకృత్యములు చేయుచున్నారు.

అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను.౹ –నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను.౹ –నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను. మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆయాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.౹ అప్పుడా యన నాకు సెలవిచ్చినదేమనగా – నరపుత్రుడా – యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.౹ -యెహెజ్కేలు 8:7-12.

నీవు దేవుని విడిచిపెట్టి, వేరే దానిని ఆశ్రయించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ అటువంటి పరిస్థితిలో నీవు ఉన్నట్టయితే దేవుడు నిన్ను సరిచేయుటకే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అలా చెయ్యటానికి కారణం ఏమిటి? “యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని”. వారే అనుకున్నారు, దేవుని ఎరుగనివారివలే హేయమైన కృత్యములు చేశారు.

యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను. -యెషయా 42:8.

ఇందాక మనముచేసిన 70 మంది ఎవరు అని ఆలోచిస్తే, దేవుని పరిచర్యకొరకు ఏర్పాటుచేయబడినవారు. మనలను కూడా దేవుడు ఆయన మహిమ కొరకు ఏర్పాటుచేసుకున్నాడు. ఆయన తన మహిమను మరొకరికి ఇచ్చువాడుకాదు.

ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? -ద్వితీయోపదేశకాండము 4:7.

మన మొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. కీర్తనా కారుడు దేవుని ఎరిగినవాడై”, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. -కీర్తనలు 75:1″ అని చెప్పుచున్నాడు. అజ్ఞానము కలిగిఉన్నట్టయితే దేవుని మహిమ కోల్పోయే వాడిగా ఉంటాడు. భయంకరమైన పాపపు దాస్యములోనుండి, నిత్యమరణములో నుండి విడిపించిన దేవుడు, నీ ప్రస్తుత కష్టమైన పరిస్థితులలో ఎలా వదిలేస్తాడు?

మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి –లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.౹ -నిర్గమకాండము 32:1. మరి ఎనిమిదవ వచనములో చూసినట్టయితే, “నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి–ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.౹ -నిర్గమకాండము 32:8”. ఐగుప్తులో నుండి అనేకమైన అద్భుతములు చేసి యెహోవా రప్పిస్తే, మోషే తిరిగిరావడం ఆలస్యమైన కారణంచేత, ఆ పోతపోసిన దూడ ఐగుప్తునుండి రప్పించింది అని బుద్ధిహీనమైన మాటలు చెప్పుచున్నారు. ఒక విషయము మనము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన సత్యము – “దేవుడు అన్యాయము చేయుట అసంభవము”.

“ఆలస్యము” అనేది ఒక విశ్వాసి జాగ్రత్త వహించవలిసిన పరిస్థితి. సత్యము ఏమిటి అంటే, ఆ ఆలస్యము అయిన పరిస్థితిలో, నీ జీవితమునకు కావలసిన ప్రతీదీ సిద్ధపరచబడుతుంది.

మన దేవుడు, నిత్యము ఉండేవాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యోబు జీవితము చుట్టూ కంచె ఉంది అని అపవాదికి ఎలా తెలిసింది? ఖచ్చితముగా ప్రయత్నిచినప్పుడే కదా?

నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.౹ -యిర్మీయా 2:17.

నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతల ననుసరించి పూజించి నమస్కరించినయెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను.౹ నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు. -ద్వితీయోపదేశకాండము 8:19-20.

మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.౹ లేనియెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండ మీరు శీఘ్రముగా నశించెదరు.౹ -ద్వితీయోపదేశకాండము 11:16-17.

  1. దేవుడు నిన్ను విడిచిపెట్టే పరిస్థితులు ఆయనకు హేయమైన క్రియలు చేయుటయే. అందుకే మన హృదయములు పదిలముగా ఉంచుకోవాలి.
  2. మన హృదయములు ఎలా పదిలముగా ఉంచుకోవాలి, దేవుని వాక్యము చేతనే.

నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది -కీర్తనలు 63:4-5.

పూర్తివీడియో యూట్యూబ్ లో చూడండి