14-04-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తోత్ర గీతము 1

నాలో ఉన్న ఆనందం
నాకున్న సంతోషం
నా జీవన ఆధారం నీవే కదా
నా ఆశ్రయము నా దుర్గము
నా కోట నీవే యేసు
నా బలము… నా యేసుడే

గాఢాంధకారములో నే సంచరించిననూ
ఏ అపాయమునకు నే భయపడను
నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్నాదరించును నా యేసయ్యా

నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును
నన్నాదరించును నా వెంట వచ్చుఁను
చిరకాలము నేను నీ మందిరావరణములో
నివాసము చేసెదను నా యేసయ్యా

స్తోత్ర గీతము 2

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా

కొట్టబడిన వేళ
నా గాయం కట్టినావే
బాధించినా స్వస్థపరిచేది నీవే

అణచబడిన వేళ
నా తలను ఎత్తినావే
శిక్షించినా గొప్ప చేసేది నీవే

విడువబడిన వేళ
నను చేరదీసినావే
కోపించినా కరుణ చూపేది నీవే

స్తోత్ర గీతము 3

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను నాట్యమాడెదన్
నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను
దావీదువలె నేను నాట్యమాడెదన్

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను పాటపాడెదన్
పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను
దావీదువలె నేను పాటపాడెదన్

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను స్తుతించెదను
స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను
దావీదువలె నేను స్తుతించెదను

ఆరాధన వర్తమానము

దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మరొక అవకాశము దేవుడు మనకు దయచేసాడు. దానిని బట్టి మనము సంతోషించాలి. ఉదయకాల సమయములో ఆదివారము యొక్క ప్రాముఖ్యత తెలియచేయబడింది.

నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. -యెషయా 58:13-14

ఈ విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్టిత దినము అనుకొని, సిద్ధపడి వస్తారో, వారిని ఉన్నతమైన స్థితిలో ప్రభువు పెడతారు. వారి కొరకు ప్రభువు సిద్ధపరచినది నీవు పొందుకుంటావు. అంతే కాక, నీకున్న లోటు సైతము పూడ్చబడుతుంది.

–యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.౹ నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.౹ ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియా ఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నర పుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.౹ నీవు ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు ఇశ్రాయేలు వారిమధ్యను ఇతర మనుష్యులమధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు.౹ -యిర్మీయా 32:17-20

ఇప్పుడు చదివిన మాటలలో దేవుని గూర్చి చెప్పబడుతుంది. ఆయన గొప్పతనము, ఆయన ఐగుప్తులో చేసిన క్రియలు గురించి చెప్పబడుతుంది. అయితే ఈ మాటలు ఎందుకు చెప్పుచున్నాడు?

ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు…సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు… నేడు అనేది నీ జీవితము మరియు నా జీవితము గనుక.

నీ దేవుడు ఏమై ఉన్నాడో నీవు గుర్తెరగాలి. ఆలోచన విషయములో గొప్పవాడు. మనము వెళ్ళే పరిస్థితి మాత్రమే మన కళ్ళ ముందు ఉంటుంది గానీ, అసలు మన కళ్ళముందు ఉండవలసినది, మన దేవుడు ఏమై ఉన్నాడో అనే సంగతి.

మన దేవుని గూర్చి చెప్పబడుతున్న వాస్తవము నిత్యము ఏకరీతిగా ఉంటుంది. అయితే మన కళ్ళముందు ఉండే వాస్తవమైన పరిస్థితి మార్చబడుతుంది.

మన జీవితము దేనిని ఆధారము చేసుకుని ఉంది? దేవుని అధారము చేసుకొని ఉంది. మనము ఒక విషయములో పోగొట్టుకున్నాము, అయితే నీ దేవుడి గూర్చి చెప్పబడుతున్న సత్యమే నిలిచేది. ఎందుకంటే, దేవుని గూర్చి చెప్పబడుతున్న సత్యము నీ వాస్తవాన్ని మార్చగలుగుతుంది.

“ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు…”- ఐగుప్తులో ఏమి చేసాడు ప్రభువు? వారి కన్నీరు, బాధ, శ్రమ చూసిన దేవుడు మోషేను పిలిచి వారిని విడిపించాలి అనే ఆలోచనను బయలుపరచారు. ఈరోజు కూడా నీమీద, నా మీద ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దానిని బట్టి నీ, నా జీవితములో ఆయన మహిమ పొందేవాడుగా ఉన్నాడు.

సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహా బలముకలిగి, చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి, ఐగుప్తు దేశములోనుండి నీ ప్రజలను రప్పించి మీ కిచ్చెదనని వారి పితరులకు ప్రమాణముచేసి, పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారి కిచ్చితివి.౹ -యిర్మీయా 32:21-22

మన ప్రభువైన యేసే మనకు వాగ్దానమై ఉన్నాడు. ఆ యేసయ్యను బట్టి మన జీవితములో విడుదల పొందుకుంటాము. అందుకే క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షావిధిలేదు. ఈరోజు ఐగుప్తు దేశములో జరిగించిన విడుదల కార్యము నీ, నా జీవితములో చేయాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. ఈ సత్యము విన్న మనము నమ్మి స్తుతిస్తే, ఆ కార్యము త్వరపడి మన జీవితములో జరుగుతుంది.

నీ జీవితములో దేవుడు కీర్తి తెచ్చుకుంటాడు. ఈ సత్యమును పట్టుకొని నిలబడితే, ఈ సత్యము ప్రత్యక్షపరచబడుతుంది. సూచక క్రియలు, మహాశ్చర్య కార్యములు జరిగించి, కీర్తి తెచ్చుకుంటాడు.

మన జీవితములు సూపర్ నేచురల్ జీవితములు, ఈ సత్యము మనము మర్చిపోకూడదు. మనలో ఆత్రుత ఆసక్తి లేని దానిని బట్టి, అనేకమైన ఆశ్చర్య కార్యములు మన జీవితములలో పోగొట్టుకునేవారిగా అయిపోతున్నాము.


నీ నెగటివ్ వాస్తమును మార్చడానికి ఈరోజు చెప్పబడిన సత్యము నీ జీవితమును మారుస్తుంది.

ఆరాధన గీతము

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా

నీ సాక్షిగా జీవించి నీ మహిమకై ఉండెదన్
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా

నీ సాక్షిగా జీవించి నీ మహిమనై ఉండెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

====================

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము

ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము

నిన్ను తరుముతున్న శత్రువు చేతికి నీవు దొరకకుండా, ఆ ఐగుప్తులో చేసిన మహత్కార్యములు, ఆశ్చర్యకార్యములు మరలా చేస్తాను అని ప్రభువు సెలవిస్తున్నాడు.

వారము కొరకైన వాక్యము

ఈరోజు మనము విశ్రాంతిని పొందటానికి మనము ఏమి చేయాలి అనే సంగతి తెలుసుకుందాము. అసలిన మన జీవితములకు విశ్రాంతి అవసరము.

విశ్రాంతి కావాలి అనే మాట మన జీవితములలో అనేకసార్లు వాడతాము. ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీస్కోవాలి అనే మాటలు బాగా పని చేసి అలిసినవారు అనుకుంటుంటారు.

మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. -కీర్తనలు 91:1

ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. -కీర్తనలు 90:1

మనకు ఆయన నివాస స్థలముగా ఉన్నాడో లేదో ఎలా గ్రహించగలము? తరము అంటే ఒక సమయముగా మనము చూడవచ్చు. మన జీవితములో అనేకమైన సమయములు, అనగా మంచిగా ఉండే సమయము, కష్ట సమయము అన్నమాట. ఈ అన్ని సమయములలో మనము విశ్రాంతి చేత నిలవగలుగుతున్నాము అంటే, ఆయన నివాస స్థలముగా మనకున్నాడు.

అయితే ఎలా ఉంటే, ఆయనే మనకు నివాస స్థలముగా మార్చబడతాడు అని నేర్చుకుందాము.

నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.౹ -యోహాను 6:56
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి౹ దానిని విరిచి–యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ -1 కొరింథీయులకు 11:23-24

ఆయన నీకు నివాసస్థలముగా చేయబడాలి అంటే, “జ్ఞాపకము” చేసుకోవాలి. అయితే ఏమి జ్ఞాపకము చేసుకోవాలి? నేను చేసిన పాపమును బట్టే ఆయన శరీరము నలుగగొట్టబడింది. మనము బల్లలో చేయి వేసినప్పుడు, ఒక చిన్న రొట్టెముక్క మనము తీసుకుంటాము. దాని అర్థము ఏమిటి అంటే, యేసయ్య శరీరము విరుగగొట్టబడటానికి కారణము నేను చేసిన పాపము కూడా అనే సత్యము.

మనము అలా జ్ఞాపకము చేసుకునే సమయములో, ఏ పాపమును బట్టి యేసయ్య శరీరము నలుగగొట్టబడింది అని నీవు నమ్మావో, ఆ పాపమును విడిచిపెట్టి మరలా ఆ పాపము వైపు వెళ్ళకుండా కాపాడుకున్నప్పుడు, ఆయన నీకు నివాస స్థలముగా చేశుకోగలుగుతావు.

యేసయ్య తన రక్తమును చెల్లించి, నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు. నీవు ఆ పరిశుద్ధతకు కారణము ఆయనే అని గుర్తించి, ఆ పరిశుద్ధతలో నీవు కొనసాగించబడినపుడు, ఆయన నీకు నివాస స్థలముగా మార్చబడతాడు.

నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలింపరు.౹ -యోహాను 15:4

ద్రాక్షావల్లిని నేను తీగెలు మీరు అని ప్రభువు చెప్పుచున్నాదు. అనగా మనము యేసయ్యతో అనుసంధానము చేయబడి ఉంటే అప్పుడు మనలో యేసయ్య నివాసము ఉంటాను అని చెప్పుచున్నాడు.

అయితే మనము తీగెలుగా అనుసంధానించబడ్డాము అని ఎలా చెప్పగలుగుతాము? ద్రాక్షతీగెలు చూస్తే, వల్లికి అనుసంధానము చేయబడిన తీగెలకే ఫలము ఫలిస్తుంది.

అయితే ఎవరు దేవుని చిత్తము ప్రకారము చేస్తారో వారే ఆయనతో అటాచ్ అయినట్టు.

పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహో దరియు, నాతల్లియుననెను. – మత్తయి 12:49.

ద్రాక్షా చెట్టుతో అటాచ్ అయితే ద్రాక్ష ఫలములు ఫలిస్తాయి. మనము యేసయ్యతో అటాచ్ చేయబడితే, మన జీవితముకూడా యేసయ్య జీవితము వలే ఆశ్చర్యకార్యములతో కూడిన, సూపర్ నేచురల్ జీవితమే మనది కూడా.

దేవుని చిత్తము మనము జరిగించినపుడే మనము సూపర్నేచురల్ జీవితమును ఫలిస్తాము. యేసయ్య ద్రాక్షవల్లి, నీవు నేను తీగెలు అని ప్రభువే ప్రకటించారు. ఈ ప్రకటన ఆయనే చేసారు అంటే దాని అర్థము ఏమిటి? నీవు విశ్రాంతి ఇవ్వాలి అనే ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు అని అర్థము.

అయితే మనము ఎలా సిద్ధపడాలి? దేవుని చిత్తము మనము జరిగించాలి అనే ఆసక్తి మనము కలిగి ఉండాలి. ఆయన చిత్తమును జరిగించవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది.

మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. -రోమా 12:2

దేవుని చిత్తము నీవు ఉత్తమమైనది అనుభవించి, తృప్తిచెంది ఆయనను మహిమపరచాలి. అందుకే ఆయన చిత్తము ఏమిటో అని తెలుసుకోవాలి అనే ఆశ మనము కలిగి ఉండాలి. అసలు దేవుని చిత్తము అంటే ఏమిటి? ఆయన కలిగిన ఉద్దేశ్యమే ఆయన చిత్తము.

మనము కలిగిన ప్రతీ దానిలో, మనకు సంబంధించిన ప్రతి దానిలో ఆయన ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. గనుక మన జీవితములో ప్రతి దాని విషయములో ఆయన చిత్తము కలిగి ఉన్నాడు. దానికి కారణము, ఆయనే మనలను సృష్టించాడు గనుక.

మనకొరకు అన్నీ సిద్ధపరచిన దేవుడు ఆయన. దేవుని చిత్తము ఏమిటో మనకు తెలీదు. అయితే, ప్రభువా నేనున్న పరిస్థితిలో నీవు నాకొరకు ఏమి సిద్ధపరచావో దానిని జరిగించు ప్రభువా అని ఆయనను అడిగితే, దేవుని చిత్తమే జరుగుతుంది.

ఇలా ప్రతీ సారీ మనము వెళుతుంటే, యేసయ్య జీవితము ఎలా ఉందో, అలాగే మన జీవితము కూడా అలాగే కనపరచబడుతుంది. యేసయ్య జీవితము చూస్తే, తండ్రి ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడో, ఆ చిత్తమే జరిగించాడు. తండ్రి ఏమి చేయునో దాని ప్రకారమే యేసయ్య చేస్తున్నాడు. గనుకనే యేసయ్య జీవితము జయ జీవితము. ఇలా ఉంటే మనము కూడా దేవుని చిత్తమును జరిగించేవారిగా ఉండి, విశ్రాంతిని పొందేవారిగా ఉండగలుగుతాము.