స్తుతిగీతము – 1
నీ కృపను గూర్చి నే పాడెదా
నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2)
నిత్యము నే పాడెదా
నా ప్రభుని కొనియాడెదా (2)
మహిమా ఘనతా
ప్రభావము చెల్లించెదా (2)
||నీ కృపను||
ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా
నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2)
నా యేసు నాకుండగా
నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా
మనసా నీకేలా (2)
||నీ కృపను||
వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా
మరణమే బాలియాగమై నన్ను విడిపించినా (2)
నా యేసు నాకుండగా
నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా
మనసా నీకేలా (2)
||నీ కృపను||
స్తుతిగీతము – 2
నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో
అన్నివేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను
నీతో నడవాలి – కీర్తిని చాటాలి
నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య…
ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా
మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !
ఒకటే మాటగా – ఒకటే బాటగా
నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా
శాంతినిచ్చు దేవా – ముక్తినొసగే తండ్రి
వ్యాధులైన బాధలైన రూపుమాపే నాథుడా
కన్నతండ్రిగా – ప్రేమ మూర్తిగా
చివరి శ్వాసవరకు కాచే దేవుడవు యేసయ్యా
స్తుతిగీతము – 3
ఇమ్మానుయేలు దేవా
ఇహపరములకు రాజా
సన్నుతించి కిర్తించేదము
సతతము నీ నామము
హల్లెలూయ ఆరాధ్యుడా
హల్లెలూయ స్తుతి పాత్రుడా
హల్లెలూయ అభిషక్తుడా
హల్లెలూయ అభి వందనం
ఆదియందు వాక్యమై యున్నావు
ఆ వాక్యము నేనే అని చెప్పావు (2)
మా వెలుగు మార్గం నీవే దేవా
నిత్య జీవము నీవేనయ్యా (2)
” హల్లెలూయ “
రాజులకు రారాజు నీవేనయ్యా
జనులందరి జీవాధిపతి నీవే
మా యోగ క్షేమము నీవేనయ్యా
మా స్తుతి గానము నీకేనయ్యా
” హల్లెలూయ “
ఆరాధన వర్తమానము
దేవుని సన్నిధి ఆయన అనుగ్రహిస్తేనేకానీ దొరికేదికాదు. మన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడైన వాడు. దేవుని ఎరిగినవారు కూడా కొన్ని సందర్భములతో లోకముతో కలిసిపోయేవారుగా ఉంటున్నారు. అయితే సత్యము ఎరగనంతవరకు అది క్షమించబడుతుంది. అయితే సత్యమును ఎరిగిన తరువాత అలా ఉండకూడదు. ఆ సత్యము ద్వారా కలిగే జీవములో మనము నిలిచి ఉండాలి.
మన దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఊర్కనే రాడు. ఆయను ఇచ్చువాడైన దేవుడు. మన యేసయ్య భూలోకములో జీవించిన సమయమును పరిశీలిస్తే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఎదోఒకటి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజున మన మధ్య ఉన్న వాడుగా మనకు కూడా కావలసినది ఇచ్చేవాడుగా ఉన్నాడు.
రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదువారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు దురు.వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. -కీర్తనలు 146:3-6
ఈ మాటలు చూస్తే, రాజుల చేతగానీ, నరుల చేతగాని రక్షణ కలుగుదు అంటే, మన జీవితములో దేవుడే సహాయకుడుగా ఉండేవాడుగా ఉన్నాడు అని అర్థము. ధన్యుడు అనగా సంతోషముగా జీవించేవారు. ఏ దుఃఖము మన జీవితములో ఉందో ఆ పరిస్థితులనుండి విడిపించి సంతోషముతో నింపేవాడుగా మన దేవుడు ఉన్నాడు. మన పితరులు అనేకసార్లు మన దేవునిని విడిచిపెట్టినవారుగా ఉన్నారు. దానిని బట్టి దేవుని శ్రేష్ఠకరమైన వాగ్దానమునలు కోల్పోయినవారుగా ఉన్నారు. మనము అత్య ఘడియలలో ఉంటున్నాము గనుక ఈ సత్యము ఎరిగి, ఆ సత్యములో నిలిచి ఉండేవారుగా మనము ఉండాలి.
దేవుని సహాయము ఎక్కడెక్కడ మనకు లభిస్తుంది?
యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును యెహోవాను స్తుతించుడి. -కీర్తనలు 146:10
సీయోను అనగా దేవుని పట్టణము అయి ఉంది. మనము కూడా దేవుని నివాస స్థలముగా ఉంటే, మన జీవితములోని తరములు అనగా వేర్వేరు సమయములు అన్నింటిలో ఆయనే రాజ్యము చేసేవాడు అనగా ఏలేవాడుగా, పోషించేవాడిగా, రక్షించేవాడిగా ఉంటాడు అని అర్థము.
బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును. -కీర్తనలు 146:7
ఆయన నీ జీవితమును ఏలునప్పుడు నీకు అన్యాయము జరగనివ్వడు. ఏ పరిస్థితి అయినా సరే న్యాయము జరుగులాగున ప్రతి కార్యము జరిగించేవాడుగా ఉన్నాడు.
ఆకలిగొనినవారికి ఆహారము దయచేసేవాడుగా ఉన్నాడు అనగా తృప్తిపరచేవాడు. మనము ఆహారము తినిన తరువాత కొంతసేపటికి శక్తి సన్నగిల్లుతుంది, అప్పుడు మనకు ఆకలి వేస్తుంది మరలా తింటాము. అలాగే మన జీవితములో శక్తి సన్నగిల్లిన పరిస్థితులు, లేదా అవసరములు తీర్చబడవలసిన పరిస్థితులలో ఆయన తృప్తిపరచేవాడు అని అర్థము.
యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును. -కీర్తనలు 146:8-9
తరములు అనగా సమయమును సూచిస్తుంది. కొన్ని సమయములు అనారోగ్య సమయము, కొన్ని బాధపడే సమయము, మరికొన్ని శత్రువుచేత దాడిచేయబడే సమయము ఇలా అవసరము తీర్చబడవలసిన ఏ సమయమైనా సరే ఆయన కాపాడేవాడుగా ఉంటాడు. మనము కలిగి ఉన్న దేవుడు మన జీవితములో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆయన కాపాడువాడు. అందుకే “యెహోవా నా కాపరి” అని దావీదు చెప్పగలుగుతున్నాడు.
మనము దేవుని పట్టణముగా ఉన్నంతకాలము మన జీవితమును ఏదీ ముట్టడానికి లేదు. మరి మన జీవితములో ఎందుకు నష్టము జరుగుతుంది అని ఆలోచిస్తే, పోగొట్టుకొనిన దానిని తిరిగి ఇవ్వగల సమర్థుడు నీ దేవుడు అని నీ జీవితములో సాక్ష్యము ప్రత్యక్షపరచడానికి ఆ పరిస్థితులను అనుమతిస్తాడు.
ఆయనే దేవుడుగా కలవారి జీవితములో నష్టము జరిగే సమస్యేలేదు. ఒకవేళ ఒక నష్టము అనుమతించబడినప్పటికీ, రెండంతల ఆశీర్వాదముతో తిరిగి సమకూర్చేవాడు మన దేవుడు. మనము అంత్య దినములలో, అంత్య ఘడియలలో ఉంటున్నాము, ఎత్తబడే సమయములో ఉన్నాము గనుక ఇప్పటికైనా మేల్కొని జాగ్రత్తపడాలి, సిద్ధపడాలి. ఇప్పుడు మనకు ఇవ్వబడిన జీవితము ప్రభువు మహిమ కొరకైన జీవితముగా సిద్ధపరచుకుందాము. ఆయన మన జీవితమును ఆయన ఏలునప్పుడు మన జీవితము క్షేమము చేత నింపబడుతుంది.
ఒకవేళ మన జీవితమును ఆయన ఏలేవిధానములో గనుక జీవించకపోయి ఉంటే, ఇప్పుడు ఒప్పుకుందాము, క్షమాపణ వేడుకుందాము. మరలా మన జీవితమును ఆయన చేతికి అప్పగించుకుందాము.
ఆరాధన గీతము
నీతో నడుతుము- నిన్నే కొలుతుము
నీ సహవాసము- నిత్యము క్షేమము
ఓ యేసయ్యా మా రక్షకా
నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో
నీవే మాకు నీడగా
దేవా-నీ సన్నిధిలోనా
దేవా- నీ దీవెనలెన్నో
దేవా- పొందెదము దినదినము
నీలో ఉండెదం- నీకై బ్రతికెదం
ఈ ఆనందము- ఇలలో చాటెదం
దేవా- మా స్వరములు ఇవిగో
దేవా- మా స్తోత్రాలు ఇవిగో
దేవా- మా సర్వస్వము నీకే
వారము కొరకైన వాక్యము
మన దేవుడు మనకు మరొక సమయము, మరొక అవకాశము ఇచ్చాడు. ఎందుకు మాటి మాటికీ మనము అవకాశము, సమయము ఇస్తున్నాడు? దేవుని చిత్తము లేకుండా ఆయన సన్నిధికి మనము రాలేము. ఒకసారి కురుపులతో బాధపడిన లాజరును గమనిస్తే, తన దయనీయమైన స్థితిలో కూడా తన దేవునిని మర్చిపోలేదు, దేవుని మీద విశ్వాసమును కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు గనుకనే చివరికి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు.
సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమ యములనుగూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.౹ రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.౹ లోకులు – నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు౹ సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.౹ మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.౹ -1 థెస్సలొనీకయులకు 5:1-5
ఈ మాటలు మన కొరకే వ్రాయబడుతున్నవి. లోకములో ఉన్నవారు ఈలాగున అనుకుంటారు. అయితే ఆయనను నిజముగా వెంబడించాలి అనే ఆశ కలిగి వెంబడించేవారికి మాత్రము దేవుని రాకడ గూర్చిన వర్తమానము, సమయము మరుగు చేయబడదు అని చెప్పుచున్నారు.
కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.౹ నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.౹ మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.౹ -1 థెస్సలొనీకయులకు 5:6-8
వెలుగువారము అంటే దేవునికి సంబంధించినవారము. చీకటివారు అంటే అపవాదికి సంబంధించినవారు. మెలకువ కలిగి ఉండుట అంటే, దేవుని సంబంధినవడిని నేను అని స్పృహలో జీవించేవాడు. మత్తుగా ఉండువాడు అంటే, దేవునికి సంబంధించినవారము అనే సత్యమును గ్రహించక అపవాదికి సంబంధిన దాడులు జరుగుతున్నప్పటికీ ఏమి పట్టించుకోని స్థితిలో ఉన్నావాడు.
మనము నివసించే కాలనీలలో దొంగలు పడుతున్న సమయములలో, కర్రలు దగ్గర పెట్టుకుని, మెలుకువగా కొంతమంది కలిసి కాపలా ఉండేవారు కదా! అలాగే మనము కూడా మన జీవితము సాతాను దాడికి లోనవకుండునట్లు మెలకువ కలిగి నిలబడాలి. అందుకే ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక లో ఈలాగు వ్రాయబడింది –
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి౹ -ఎఫెసీయులకు 6:13
ఆపద్దినమునందు నిలబడాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని వ్రాయబడింది.
మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము.౹ మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి.౹ -2 కొరింథీయులకు 10:3-4
మన ఎదుట ఏమి ఉన్నా సరే వాటిని పడగొట్టే బలము కలిగినవిగా దేవుడు మనకు ఇచ్చిన సర్వాంగకవచము ఇవ్వబడింది. ఈలోకములో అనేకమైన మాటలు, మన విశ్వాసమును చెడగొట్టేవిధముగా అనేకమైన మాటలు వినబడుతుంటాయి గనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఎవరు మాట్లాడుతున్నప్పటికీ అవి అపవాదిచేత ప్రేరేపించబడినవే అని మనము గ్రహించాలి.
గనుక మన విశ్వాసమును బలహీనము కాకుండా జాగ్రత్త పడాలి. మాటల చేతకానీ, పరిస్థితుల చేతగానీ మన విశ్వాసము నష్టపరచడానికి అపవాది ఎంతో ప్రయత్నిస్తాడు.
మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపెట్టి౹ మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవి ధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము.౹ -2 కొరింథీయులకు 10:5-6
మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసాము అని పౌలు చెప్పుచున్నాడు. అంతే కాక, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపెట్టాము అని చెప్పుచున్నాడు.
రాజుల చేతనైనను, మనుష్యుల చేతనైనను రక్షణ కలుగదు, ఎవరికైతే యాకోబు దేవుడు సహాయకుడిగా ఉంటాడో వారు ధన్యులు అనే మాట పట్టుకుని నిలబడుతున్న సమయములో, మనుష్యులతో సంబంధము లేకుండా ఎలా జరుగుతుంది అనే ఆలోచన పుడుతుంది. మానవ ప్రయత్నము చెయ్యాలి కదా అనే ఆలోచన పుడుతుంది. అయినప్పటికీ, ఆ మాటలకు తలవంచకుండా, ఆ ఆలోచనలను క్రీస్తు వద్దకు తీసుకువచ్చి ఆ ఆలోచనలను చెరబట్టాలి అని అర్థము. అనగా వచ్చిన వ్యతిరేకమైన మాటకు వ్యతిరేకముగా క్రీస్తు నామములో ప్రకటించి నిలబడటమే!
అయితే దేవుని యొక్క వాక్కు మన జీవితములలో నెరవేరబడటానికి ఖచ్చితముగా దేవునికి అనుకూలముగా ఉండాలి. అనగా వాక్యము చెప్పుచున్న ప్రకారముగానే జీవించాలి. ఆ ప్రకారముగా లేకుండా మనము ఎంత ఎదురుచూసినా దేవుని వాక్కు యొక్క నెరవేర్పు చూడలేము.
యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినవాడు. అలా మార్చబడిన తరువాత యాకోబు జీవితము ఎంతో మారింది. యాకోబుగా తన అన్నవద్దకు వెళితే చంపబడేవాడిగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలుగా మారినతరువాత తన అన్నను ఎదుర్కొన్నప్పుడు దయ చూపించబడ్డాడు. ఎందుకంటే, ఇక పాత యాకోబుగా కనబడనివ్వట్లేదు దేవుడు, దేవుని సహాయము యాకోబుకు అందించబడించి.
మన జీవితములో అటువంటి అనుభవము పొందుకోవాలి అంటే, మనము కూడా దేవుడు నివాసము ఉండులాగున మనలను సిద్ధపరచుకోవాలి. అప్పుడు నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు. మనము అంత్య ఘడియలలో ఉన్నాము అనే సంగతి ఎరిగి, మన జీవితమును చక్కపరచుకోవాలి.
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి౹ -ఎఫెసీయులకు 6:13
సమస్తమును నెరవేర్చిన వారు అంటే, దేవుడు ఏమి చెప్పారో ఆ ప్రకారముగా మన జీవితములో నెరవేర్చిన వారు. అలా ఎలా నిలబడగలము అంటే,
ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని౹ పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి.౹ ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.౹ మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.౹ ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.౹ -ఎఫెసీయులకు 6:14-18
సర్వాంగ కవచము ధరించుటతోపాటు, మెలకువ కలిగి ఉండుట ఎంతో ప్రాముఖ్యము. నడుమునకు సత్యము అనే దట్టీ కట్టుకొని ఉండుట ఎందుకు? మనము జారిపోకుండా నిలబడాలి అంటే, దేవుని సత్యము మీద ఆధారపడినప్పుడే. ఎలా అయితే దట్టీ కట్టినప్పుడు మన వస్త్రములు జారకుండా ఉంటాయో, దేవుని సత్యమును ఆధారము చేసుకున్నప్పుడు మనము కూడా జారకుండా ప్రతి పరిస్థితులలో నిలబడగలుగుతాము. ఈరోజు మనము తెలుసుకున్న సత్యము, “మన దేవుడు తరములన్నిటిలో రాజ్యము చేయువాడు”. ఆ సత్యములో మనము నిలబడాలి.
పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి. యుద్ధములో చెప్పులు ఎందుకు వాడతాము అంటే యుద్ధభూమిలో అటు ఇటు తిరగవలసిన ప్రతి పరిస్థితిలో మన కాళ్ళు గాయపడకుండా నిలబడటానికి. అనగా మనము కూడా సువార్త వలన మనకు నిలబడే సిద్ధమనస్సు కలుగుతుంది. ఆ సిద్ధమనస్సుతో దేవుని సత్యములో నిలిచి వుండుట అని అర్థము.
ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అపవాది ఖచ్చితముగా తన బాణములు మన ప్రతీ పరిస్థితులలో వేస్తుంది. అయితే దేవుని వాక్యమునందు విశ్వాసముతో నిలబడినప్పుడు ఆ బాణములు ఏమీ చేయలేవు.
మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనము విశ్వాసము చేత అపవాది ప్రయత్నములను అడ్డగించినప్పటికీ, వేరే విధానములో ప్రయత్నించే అవకాశము ఉంది గనుక రక్షణ అనే శిరస్త్రాణము మనము ధరించి, అపవాదిని ఎదుర్కోవడానికి వాక్యమును ఖడ్గముగా మనము కలిగి ఉండాలి.
ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. అనగా పరిశుద్ధాత్ముడు మనకు మార్గదర్శకుడుగా ఉంటాడు గనుక, ఆయన చెప్పినట్లుగా మనము ప్రార్థన, విజ్ఞాపనలలో మనము పట్టుదల కలిగి మెలకువగా ఉండాలి అని వ్రాయబడింది. అంతేకాక పరిశుద్ధాత్ముడు మనము అనేకమైన మర్మములు మనకు తెలియచేసేవాడుగా ఉన్నాడు. మనము చేసే పోరాటములలో ఎలా అపవాదిని ఎదుర్కోవాలో పరిశుద్ధాత్ముడే మనకు మార్గము చూపిస్తాడు.
ఈ సర్వాంగ కవచము ధరించుకుని మెలకువగా ఉండాలి. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.౹ -1 థెస్సలొనీకయులకు 5:6. అప్పుడు శత్రువు నీ జోలికి రావడానికి అవకాశమే లేదు. గనుక అంత్య దినములలో మనకు ఇవ్వబడిన రక్షణ కాపాడుకుందాము. విశ్వాసములో బలహీనముగా ఉంటే, విశ్వాసములో బలముగా ఉందాము. దేవుని కొరకైన కార్యములలో సిద్ధమనసు కలిగి ఉందాము. మనదేవుడు సర్వశక్తి గల దేవుడు గనుక మన జీవితములలో విజయమే