మందిరము కొరకై ప్రార్థన – archived

జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీస్ యొక్క మందిరము కొరకు ప్రార్థించుచుండగా “వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను – కీర్తన 107:7” అనే వాక్యము ద్వారా ప్రభువు ప్రవచనాత్మకముగా దైవ జనుడి ద్వారా మాట్లాడినారు. అప్పటినుండి అనేకమైన సూచనల ద్వారా నడిపించుచున్నారు, బలపరచుచున్నారు కనుక మందిరపు పని కొరకై ప్రార్థన విషయాలను పొందుపరచడము జరిగినది. మిమ్ములను ప్రభువు ప్రేరేపించి బలపరచిన కొలదీ ఈ క్రింద పేర్కొన్న విషయముల గురించి వాక్యములను ఎత్తిపట్టి ప్రార్థించగలరు.

వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను – కీర్తన 107:7
And He led them forth by the right way, that they might go to a city for habitation  – Psalms 107:7
మందిరము కొరకైన స్థలము స్థిరపరచబడుటకై ప్రార్థన | Prayer for finalizing a place for the church
ఈ ప్రార్థన దేవుడు ఆలకించి, మందిరము కొరకై స్థలము దయచేసినాడు. ప్రార్థించిన మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు. మందిరము పని కొరకై మీ ప్రార్థన కొనసాగించమని ప్రేమ పూర్వకముగా మనవి చేస్తున్నాము
God heard and answered this prayer and granted a place for our church. We thank you in the name of our Lord Jesus for your prayers. We lovingly request you to continue your prayers for the construction of the church!

పరలోకమందున్న మా తండ్రీ, నిశ్చయముగా ఈ లోకమందు నీవు నివాసము చేయలేవు ఏలయనగా ఆకాశమహాకాశంబులు సహితము నిన్ను పట్టజాలవు; మేము కట్టింపబూనుకొనుచున్న ఈ మందిరము నిన్ను ఏలాగు పట్టును? అయినను నీ దాసులమగు మా ప్రార్థన అంగీకరించి, మత్తయి 18:20 లో సెలవిచ్చినట్టు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామమున కూడుకుందురో అక్కడ వారి మధ్య నీవు ఉందువని సెలవిచ్చిన నీ మాట చొప్పుననూ, నీ దాసుడైన మా దైవ జనునికి నీవిచ్చిన వాగ్దానము ప్రకారము నివాసపురమునకు మేము చేరునట్ట్లునూ, నీ మందిరము కట్టుటకు అనువైన ఒక స్థలము మా సంఘమునకు చూపించుమని ప్రార్థిస్తున్నాము. 2 సమూయేలు 24:18 లో దావీదుకు అరౌనా కళ్ళెము చూపించినట్లు, ఆదికాండము 28:10-22 లో యాకోబుకు బేతేలును చూపించినట్లు మా సంఘముకొరకై స్థలమును చూపించి స్థిరపరచుము తండ్రీ, యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్!

Heavenly Father, surely you cannot dwell on this earth because, even the heavens cannot contain you. How can the church building we desire to build could contain you? Even then, please accept the prayers of thy servants regarding the church building. In Mathews 18:20 you told, wherever two or three gather in your name, your presence is with them. Also you have given the promise to the man of God regarding the “dwelling place (Psalsm 107:7)”. Please remember these and provide a suitable place to construct the church building. As you directed David to the Arouna’s field and as you directed Jacob to Bethel, please show us the perfect place to construct the church building. We pray in the name of our Lord and Savior Jesus Christ, Amen.

మందిరము కొరకై స్థలము కొనుటకై ధనము సమకూర్చబడుటకై ప్రార్థన| Prayer for money to buy the land for the church
ఈ ప్రార్థన దేవుడు ఆలకించి, మందిరము కొరకై స్థలము దయచేసినాడు. ప్రార్థించిన మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు. మందిరము పని కొరకై మీ ప్రార్థన కొనసాగించమని ప్రేమ పూర్వకముగా మనవి చేస్తున్నాము
God heard and answered this prayer and granted a place for our church. We thank you in the name of our Lord Jesus for your prayers. We lovingly request you to continue your prayers for the construction of the church!

పరలోకమందున్న మా తండ్రీ!  నీ జనులమైన మేము నిన్ను ఒక స్థిరమైన స్థలమందు ఆరాధించులాగున, నీవు స్థిరపరచిన స్థలమును కొనుటకై అవసరమైన ధనము మాకు సమకూర్చుము దేవా! నీ జనులమైన నా సామర్థ్యము అల్పము. కానీ నీ కృపామహదైశ్వర్యములు అత్యధికములు. యేసు క్రీస్తునందు సమస్తమును మాకొరకై సమకూర్చిన దేవా, యెషయా 45:3 లో నీ వాక్కు చెప్పినట్లుగా, మమ్ములను పేరు పెట్టి పిలిచి, నీవు నిర్ణయించిన స్థలములో సమకూర్చు దేవుడవు నీవే అని మేము తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును మాకు అనుగ్రహించి నీ నామమును మహిమ పరుచుకొమ్మని  యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్!

Heavenly Father, provide us the required resources and money to buy the appointed place for worshipping you. Lord, our ability to accomplish this huge task is very limited. But thy abundance of grace is unlimited. According to thy word in Isaiah 45:3, please provide us the hidden treasures and riches stored in secret places, so that thy name will be glorified among thy people and the world  . We pray in the name of our Lord and Savior Jesus Christ, Amen.

దైవజనునికి ప్రార్థనలో దేవుడు హగ్గయి గ్రంథము ద్వారా తెలియ చేసిన మాటలు –

సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.౹ -హగ్గయి 1:2
అనగా జీసస్ కేర్స్ యూ మందిరము కట్టబడవలసిన సమయము ఇదే!

–ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? -హగ్గయి 1:4
అనగా మందిరము మీద, మందిరపు పని మీద ఆసక్తి కలిగిఉండవలసిన అవసరమును ప్రభువు జ్ఞాపకము చేస్తున్నాడు.

జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.౹ -హగ్గయి 1:12
మనము కూడా ప్రభువు ఈ వాక్యము ద్వారా తెలియచేసిన సంగతిని విని, స్వీకరించి, అంగీకరించి భయభక్తులు కనపరచాలి.

వారు కూడివచ్చి, రాజైన దర్యావేషుయొక్క యేలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలుగవదినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. -హగ్గయి 1:15
మనము భయభక్తులు ఎలా చూపిస్తాము అంటే, దేవుని వాక్కును బట్టి మందిరపు పనిని ప్రారంభించడము, కొనసాగించడము!

అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ -హగ్గయి 2:4
నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.౹ -హగ్గయి 2:5

పని ప్రారంభించబూనుకొనే మనలను ఏ ఆధారము లేకుండా దేవుడు వదలడు. ఆయనే తోడుగా ఉంటాడు గనుక భయపడవద్దు అని ప్రభువు చెప్పుచున్నాదు. ఈ సందర్భములో గిద్యోను జీవితములో జరిగిన సంగతి జ్ఞాపకము చేసుకొంటె, తాను కనిష్టుడైనవాడు, బలము లేని వాడు అయినప్పటికీ దేవుడే తోడుగా ఉండి, యుద్ధము గెలవడానికి బలము దయచేసాడు, కనిష్టుడు, అల్పుడు అయిన వానిని గొప్పవాడుగా చేసాడు. అలాగే మనకు కూడా ఆర్థిక వనరులు లేనప్పటికీ, ప్రభువే వాటి విషయములో తోడుగా ఉండి సహాయము చేస్తాడు.

ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.౹ నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ -హగ్గయి 2:6-7

ఈ మాటలు ప్రవచనాత్మకమైనవి మరియు ప్రభువు తోడుగా ఉండి ఎలా సహాయము చేస్తాడొ అనే విషయములో ప్రభువు యొక్క నడిపింపును గూర్చిన మాటలు.

  1. ఆకాశము సూపర్నేచురల్ సహాయమును సూచిస్తుంది.
  2. భూమి అనగా మనమే అనగా జీసస్ కేర్స్ యూ సంఘములో జతపరచబడిన వారిని సూచిస్తుంది.
  3. సముద్రము అనగా చేపలకు నిలయము, చేపలు ఆత్మలను సూచిస్తాయి. గనుక నూతనముగా మందిరపు పని నిమిత్తమై జత చేయబడేవారిని సూచిస్తుంది అన్నమాట.
  4. నేల అనగా ఇంగ్లీషులో “ఎండిన నేల” అని వ్రాయబడింది. అనగా ఎండిన పరిస్థితులలో ఉన్నవారిని ప్రభువు మన మినిస్ట్రీ ద్వారా బాగుచేసి మందిరపు పని కొరకు వాడుకొంటాడు.
  5. అన్యజనులు అనగా ప్రభువు ఎలాంటివాడో, ఏమి చేయగలడో ఇంతవరకు తెలియనివారు. అటువంటి వారిని ప్రభువు నడిపించి వారు ప్రభువు ఏమి చేయగలడో చూపించి తన మందిరము కొరకైన మార్గములు తెరిచేవాడుగా ఉన్నాడు అని అర్థము.

ఈ వాక్యములను ఎత్తిపట్టుకుని క్రింద పేర్కొన్న ప్రార్థనా విషయముల కొరకు ప్రార్థించండి.

  1. మందిరపు ప్లాన్ మరియు డిజైన్ కొరకు
  2. మందిర నిర్మాణమునకు అవసరమైన పర్మిషన్ల కొరకు
  3. మందిర నిర్మాణము కొరకైన ఆర్థిక సహాయము కొరకు పైన చెప్పబడిన వాక్యము ఆధారముగా ఏర్పాటుచేయబడినవారికొరకు ప్రార్థించవలసినది.
  4. మందిరపు పని కొరకు
    1. ఐరన్ వర్కు
    2. వడ్రంగి పని
    3. కరెంటు పని
    4. తాపీ పని
    5. పునాది మరియు స్లాబు పనులు
    6. ప్లంబింగు పని
    7. P.O.P పని
    8. ప్లాస్టింగు పని
    9. రంగులు వేసే పని
    10. ఇతర సహాయకరమైన పనులు
  5. మందిరము పనికి కావలసిన ముడి సరుకుల కొరకు
  6. మందిరము కట్టడానికి కావలసిన బిల్డర్, ఇంజినీర్, పనివారికొరకు
  7. పుల్ పిట్ ప్లాట్ఫారం కొరకైన జ్ఞానము
  8. మందిరము యొక్క ఆడియో సెట్టింగ్స్
  9. మందిరము యొక్క లైటింగ్స్ మరియు ఇతర కరెంటు పనులకొరకు
  10. మందిర నిర్మాణము సమయములో వాతావరణ అనుకూలత కొరకు
  11. ఈ మందిరమునకు ఇవ్వబడిన వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు
  12. మందిరము కట్టబడే సమయములో దైవజనునికి మరియు ఆయన కుటుంబమునకు కావలసిన రక్షణ, కాపుదల, సహాయము, తోడ్పాటు, ఆరోగ్యము, ప్రయాణ సదుపాయము, జ్ఞానము మరియు దేవుని కృప కొరకు
కొనబడిన స్థలములో మందిరము కట్టగలుగుటకై ప్రార్థన | Prayer for building the church in the purshared land.
కొనబడిన స్థలములో మందిరము కట్టగలుగుటకై ప్రార్థన | Prayer for building the church in the purshared land.

పరలోకమందున్న మా తండ్రీ!  నీవు ఏర్పరుచుకున్న నీ జనులైన ఇశ్రాయేలు ప్రజలు నీ మందిరము కట్టవలసిన సమయములో దైవ జనుడైన మోషే ద్వారా కట్టవలసిన రీతి తెలియచేసావు. కట్టుటకై సామర్థ్యము కలుగజేసావు. సరైన జ్ఞానముతో నీవు నింపిన మనుష్యులను సమకూర్చావు. మేము కూడా నీవు ఏర్పరుచుకుని, పిలిచి, యేసు క్రీస్తు రక్తములో నీతిమంతులముగా తీర్చబడిన నీ జనులము. నీ మాట ప్రకారము మందిరము కట్టపూనుకొనుచుండగా, కట్టు రీతిని మాకు తెలియచేయండి. నీవు నీ జ్ఞానముతో నింపిన ఇంజనీరు, బిల్డర్, మేస్త్రీ మరియు పనివారిని సమకూర్చి, నీకు మహిమకరముగా మందిరము నిర్మింపబడులాగున కృపచూపించండి. నిర్గమకాండము 36:1,2 లో ఎలా అయితే ప్రజ్ఞావంతులను ఏర్పరిచావో, అదేవిధముగా ఇప్పుడుకూడా దయచేయుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్!

Heavenly Father, when thy chosen Israel people were building the tabernacle, you guided them through the man of God, Moses about every detail of arrangement and construction. You gathered the people by filling them with thy wisdom. We are also chosen, called and made righteous in the blood of Jesus Christ, thy Son. We are also getting ready to build this church according to thy word. Please reveal the way that we should construct this building. Please send the engineer, builder, workers and their leaders who are filled with thy wisdom. In same way as you sent the experts in  Exodus 36:1-2, now also send the experts for this task. We pray in the mighty name of our Lord and savior Jesus Christ, Amen!

మందిర నిర్మాణములో ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రార్థన | Prayer to remove every disturbances for the construction.

పరలోకమందున్న మా తండ్రీ! దేవుని మందిరము కట్టబడుచున్నప్పుడు ఆటంకపరచువారు, హేళణచేయువారు, శపించువారు ఉన్నప్పటికీ నెహెమ్యా 6:16 లో ఎలా అయితే “మందిరము దేవుని వలన కట్టబడినది” అనే సాక్ష్యము ప్రకటించబడినదో, అదే కృప మా యెడల చూపించి ప్రతి అవరోధమును అధిగమించునట్టుగా మమ్మును బలపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్!

Heavenly Father, In Nehemiah 6:16 there were people who came against the work of the building of temple. They were discouraging and mocking the work of thy children. But finally there went a testimony saying, ” the temple was built by the hand of God”. In the same way, when we prepare for the work of the church building there could be people mocking and discouraging but Lord, shower your grace and enable us to finish the work to proclaim the same testimony saying, ” The hand of our Lord enabled us to build this church”. We pray in the name of our Lord and saviour Jesus Christ