అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు
అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు
తండ్రి కుమార శుధ్ధాత్మ దేవా ॥2॥
దర్శించుమయా వర్షించుమాపై
ఫలభరితులుగా చేయుమయా
తొలకరి వర్షం కడవరి వర్షం
పంటను విస్తారం చేయుమయ ॥2॥
సంవత్సరములు జరుగుచుండగా
నూతనపరచు నీ కార్యములన్
పరిశుధ్ధాత్మతో మము వెలిగించి
శక్తిమంతులుగ చేయుమయా ॥2॥
“దర్శించుమయా”
జీవ వాక్యముతో మము బ్రతికించి
సత్యముతో స్వాతంత్రులు జేయుము
సజీవ సాక్ష్యులై సర్వలోకముకు
రాయబారులుగా జీవించెదం ॥2॥
“దర్శించుమయా”
వెనుకవి మరచి ముందున్న వాటికై
క్రీస్తు యేసు నందు దేవుని
ఉన్నత భహుమానము కొరకై
గురియొధ్ధకే పరుగెత్తదము ॥2॥
“దర్శించుమయా”
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య – 2
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య – 2
నీవే లేకుండా నేనుండలేనయ్య – 2
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య – 2 ||నేనుండ||
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం – 2
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును – 2
నీవే రాకపోతే నేనేమైపోదునో – 2 ||నేనుండ||
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా – 2
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు -2
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య- 2 ||నేనుండ||
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా -2
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము -2
నిన్ను మించిన దేవుడే లేడయ్య- 2 ||నేనుండ||
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
హల్లెలూయా……..హల్లెలూయా (2)
హల్లెలూయా……..హల్లెలూయా హోసన్న
హల్లెలూయా……..హల్లెలూయా
1. ఎల్ ఓలామ్ (2)
అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా
2. ఎల్ షద్దాయ్ (2)
పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||
3. అడోనాయ్ (2)
ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2)
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) ||హల్లెలూయా||
ఆరాధన వర్తమానం
“రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య” – ఈ పాట పాడి మనము ఆరాధించాము. అయితే అది మన జీవితములో సత్యమేనా?
యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగలవారందరు వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చి యున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి యున్నాడు తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడిచేసి యున్నాడు. – కీర్తన 111:2-6.
దేవుడు చేసే కార్యములు అన్ని మహిమతో నిండినవే, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంది గాబట్టే, మనము ఇంకనూ జీవించువారిగా ఉన్నాము. దేవుని విడిచిపెట్టక, ఆయన యందు భయము కలిగి, భక్తి కలిగి జీవించేవారి జీవితములో మనము పాడిన పాట, “రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య” అనేది సత్యమే!
“తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చి యున్నాడు” అనే మాట ఎలా చూడవచ్చు? “రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును – మత్తయి 6:34”. అలా మనము అడుగుపెట్టిన ప్రతీ దినమూ, మనకు ఆహారము ఇచ్చియున్నాడు. అటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవరు? ఆయనే నాకు సిద్ధపరచువాడు అనే సత్యము ఎరిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీవు విశ్వసించినప్రకారము నీకు జరుగుతుంది. కానీ ఆయనను యజమానుడుగా కలిగి ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యము. ఆయన యజమానుడు అంటే, ఆయన చెప్పిన ప్రకారము నీవు చేస్తావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో సమస్తము నీకు దొరకును, కేవలము ఆహారము మాత్రమే కాదు.
అంతే కాక, “ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును”. ఆయన మరచిపోయే వాడు కాదు. తన ప్రజల పక్షమున ఆశ్చర్య కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారికి ఈ విధముగా జరుగుతుంది. అయితే భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏమిటి? దేవుని వాక్యము ప్రకారము మన జీవితములను సరిచేసుకుంటూ ఆయనకు నచ్చిన విధములో మనము మారి ఆయ్నను సంతోషపెట్టడమే! దావీదుకు తన కృప చూపిన దేవుడు నీకు నాకు నడిపించడా? ఇశ్రాయేలీయులను నడిపించాలి అని కోరుకున్నాడు కానీ వారైతే ఒక మనుష్యుడైన రాజును కోరుకున్నారు. మరి ఈరోజు నిన్ను నడిపించాలి అని ఆయన కోరుకుంటున్నాడు, నీవు ఎలా సిద్ధపడతావు? “మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి” అని వాక్యము చెప్తుంది. నీవు విన్న వాక్యము ప్రకారము నీవు మారితే ఆ మార్పుకు తగిన ఫలము మీ జీవితములో ఫలించాలి.
దేవుడు చేసిన నిబంధన గూర్చి చూస్తే –
ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను – లూకా 1:74-75.
నిబంధనను బట్టి, నీ జీవితములో ఉన్న శత్రువు నుండి నీవు విడిపించబడతావు, వాడి మీద జయమునే పొందుకుంటావు. శత్రువు అనగా దేవుడు నీకొరకు దయచేసిన సంతోషమునకు వ్యతిరేకముగా నిలిచే ప్రతీదీ శత్రువుగా చూడవచ్చు.
నీకున్న ధైర్యము ఆయన నిబంధన. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన దయను బట్టి మనకు ఆహారము దయచేయుచున్నాడు. ఆయన నమ్మకత్వము మన కొరకు సిద్ధపరిచేదిగా ఉంది. ఆయన నిబంధన మన జీవితములో తన క్రియలను వెల్లడి పరుస్తుంది.
ఆరాధన గీతము
నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2) ||నా ప్రాణమా||
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||
Main message| మెయిన్ మెసేజ్
మనమందరము దేవుని బిడ్డలము కనుక దేవుడు మననుండి కొన్ని కార్యములు ఎదురుచూస్తున్నారు. దాని అర్థము, ఆ కార్యము చెయ్యగల సామర్థ్యము మనకు ఇవ్వబడింది.
మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. – కొలస్సీ 3:1-4.
“మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే” అనగా మీరు యేసు ప్రభువును అంగీకరించి ఆయన చేసిన సిలువయాగమును విశ్వసించి, మారు జన్మ పొందినవారైతే. ఈ విషయము ఎంతో ప్రాముఖ్యము లేదా మిగతా అన్ని విషయములకూ మూలము.
మనము చేసే ప్రార్థనలో మన అవసరముల గూర్చి అడుగుతాము, మన కుటుంబము గూర్చి అడుగుతాము. అయితే పౌలు “పైన ఉన్నవాటి మీద” వెతకమని చెప్పుచున్నాడు. పరలోకములో దేవుడు మన మీద కలిగి ఉన్న “చిత్తము” గూర్చి వెతికి తెలుసుకుని దానిని నెరవేర్చాలి. దీని గూర్చే ప్రభువు ఎదురుచూస్తున్నారు.
అయితే దేవుని చిత్తము మనము ఎలా తెలుసుకోగలము? లోకములో ఉన్న తల్లిదండ్రులు పిల్లలనుండి ఏమి ఆశిస్తున్నారు? అని పిల్లలకు తెలియదా? ఖచ్చితముగా తెలుస్తుంది. అలాగే దేవుని బిడ్డలుగా ఆయన ఏమి కోరుకుంటున్నారు అనేది కూడా మనము ఎరిగి ఉండాలి.
పేతురు జీవితములో జరిగిన ఒక కార్యమునుండి ఈ విషయాలి నేర్చుకుందాము.
అయితే ఆయన పేతురు వైపు తిరిగిసాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు అని పేతురుతో చెప్పెను. – మత్తయి 16:23
ఇక్కడ చూస్తే, యేసుక్రీస్తుతోనే పేతురు ఉన్నాడు. అయితే యేసు ప్రభువు చెప్పిన మాటను అలా కాదు అని ప్రభువునే గద్దిస్తున్నాడు. మన నిమిత్తము దేవుడు కలిగిన ఉద్దేశ్యములు అవి ఎంతో ఉన్నతమైనది. అయితే ఆ వాక్యము నాకు సరిపోయే విధముగా ఉందా? నా ఇష్టాలకు సరిపోయేవిధముగా ఉందా అని ఆలోచించి దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా మాట్లాడి గద్దించి దేవుని చిత్తమును నెరవేర్చకుండా తప్పిపోతున్నాము.
మనుష్యుల రీతిగా పేతురు ప్రభువుకు కీడు కలుగకూడదు అనే ఆలోచన మనుష్యరీతిగా చెప్పాడు. అయితే దేవుని చిత్తము, యేసు ప్రభువు ద్వారా దేవుడు నిర్ణయించిన ప్రణాళిక ఎరుగక ఆ విధముగా మాట్లాడాడు. అయితే ఈరోజు మనము నష్టమును తెచ్చుకోవాలి అని గాని, మనము చనిపోవాలి అని కాదు గానీ, దేవుని చిత్తమును ఎరిగి, తెలుసుకుని ఆయన చిత్తము జరుగులాగున మనము అవకాశము ఇవ్వాలి. అలా కాక పోతే, మనము సాతాను బిడ్డలుగా అయిపోతాము. “దేవుని సంగతులను ఆలోచించలేని” జీవితమ్ను ఎంతో నష్టకరమైనది.
క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. 2 కొరింథీ 4:17-18
దేవుడు మనకొరకు కలిగిన చిత్తము మనకు ఎదురుగా కనబడదు. మన కంటి ఎదురుగా కనబడే విషయాలు అయిన మన అవసరాలు, కష్టాలు అనే వాటి కొరకే రాత్రి పగలు కష్టపడతాము. అయితే దేవుడు మనకొరకు కలిగిన చిత్తము కొరకు వెతికి, తెలుసుకుని మనము జీవించాలి.
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. రోమా 8:6-8
ఈ లోకములో మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, సమాజములో ఉన్నతముగా ఎంచబడాలి అని కోరుకోవడము మంచిదే కానీ ప్రభువును సంతోషపెట్టడము అనేది ప్రధానమైనదిగా లేకపోతే అవన్నీ వ్యర్థమే.
అయితే దేవుని ఆత్మ కలిగినవారికి ఆయన చిత్తమే ప్రధానము.
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు – రోమా 8:9.
మన అంతరంగపురుషుడు అనగా మన ఆత్మను బలపరచకపోతే, శరీరము బలముగా మారి, ఆత్మానుసారముగా మనము జీవించలేము. పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచే విషయములు మనము ఆలోచించగలిగే విధానములో ఉండవు. అయితే దేవుని పరిశుద్ధాత్మ కార్యము జరిగించబడాలి అంటే ఆ పరిశుద్ధాత్మకు నీవు అవకాశము ఇవ్వాలి. ఒక్కోసారి, ఆయన నడిపించే విధానములో అనూహ్యమైన సంఘటనలు జరగవచ్చు. అయితే మన దృష్టి దేవుని మీదే, ఆయన చిత్తము మీదే ఉండాలి. అప్పుడు ఆయన మనము ఊహించని రీతిలో మనలను నడిపిస్తాడు.
మనలను అనవసరమైన విషయములలో ముంచివేసి చిక్కులపెట్టే విధానములో అపవాది ప్రయత్నిస్తాడు. అయితే పైనున్న వాటిని అనగా దేవుని చిత్తమును వెతికే వారిగా ఉన్నట్టయితే ఆ చిక్కులో పడకుండా మనలను మనము కాపాడుకోగలుగుతాము.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి – రోమా 12:2.
ఈ లోకములో అనేకమైన మర్యాదలు, వ్యవహారములు ఉన్నాయి. అయితే వాటి ప్రకారము కాకుండా, దేవుని చిత్తప్రకారము ఏది మచిది? ఏది ఉత్తమమైనది అని తెలుసుకుని ఆ ప్రకారము చెయ్యాలి! మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. బలిగా అర్పించుట అనేదానిని గమనించినపుడు, ఒకసారి అర్పించినతరువాత దానిలో ఇక ఏ మాత్రము జీవము ఉండదు. అలాగే మనము సజీవ యాగముగా మనము అర్పించినప్పుడు, మన జీవితములో ఇంతకు ముందు ఉన్న లోకానుసారమైన సంగతులు ఇక జీవించకూడదు.