01-01-2023 నూతన సంవత్సరపు మొదటి ఆరాధన – వాగ్దానమును స్వతంత్రించుకొనుట

యేసయ్య నామము నా ప్రాణ రక్ష

యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)

నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను (2) ||యేసయ్య||

రోగ భయం – మరణ భయం
తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య||

అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య||

పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య||

యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య||

లేచి వెళ్ళెదం సాగి వెళ్ళెదం


లేచి వెళ్ళెదం సాగి వెళ్ళెదం
ఆ వాగ్దాన దేశమునకు సాగి వెళ్ళెదం

మన దేవుడు యెహోవాయే
యెల్ల వేళలా సహాయుడు
సైన్యములకు అధిపతియైన
యెహోవా ఎల్షడ్డాయిగా ఏలును

విమోచించెను తన ప్రజలను
విడిపించును పాప దాస్యము
పరిశుద్ధ దేవుని ఆరాధించుటకు
యెహోవా కాదేషు శుధ్ధి చేయును

పగటివేళ మేఘస్తంభము
రాత్రివేళ అగ్ని స్తంభము
త్రోవలో తోడుగా ఉండి నడిపించును
యెహోవా యీరే మన సహాయము

ఆకాశమునుండి మన్నాను ఇచ్చును
మారాను మధుర పానము చేయును
పాలు తేనెలతో తృప్తిపరుచును
యెహొవా రోహి లేమిచేయడు

శత్రుసైన్యముపై జయమునిచ్చును
సముద్రములో దారినిచ్చును
దక్షిణహస్తముతో ఆదుకొనును
యెహోవా నిస్సీ ధ్వజమైయుండును

కృపచూపువాడా (JCY Song)

కృపచూపువాడా నీ కృపతో మమ్ము ఎల్లప్పుడు మమ్ము రక్షించువాడా
దయచూపువాడా నీ దయతో మాకు సమకూర్చువాడా
నీ కృపతో రక్షించి
నీ దయతో దీవించి
నన్ను నిత్యము తృప్తిపరచితివే

జీసస్ కేర్స్ యూ
జీసస్ కేర్స్ యూ
జీసస్ కేర్స్ యూ

జీసస్ కేర్స్ మీ
జీసస్ కేర్స్ మీ
జీసస్ కేర్స్ మీ

కుదరని రోగమైన
చెదరిన జీవితమైన
వుయ్ డోంట్ కేర్
వుయ్ డోంట్ కేర్
వుయ్ డోంట్ కేర్
వుయ్ డోంట్ కేర్

పరమ వైద్యుడై నన్ను స్వస్థపరచి
ఆరోగ్యము అనుగ్రహించితివే

జీసస్ కేర్స్ యూ
జీసస్ కేర్స్ యూ
జీసస్ కేర్స్ యూ

జీసస్ కేర్స్ మీ
జీసస్ కేర్స్ మీ
జీసస్ కేర్స్ మీ

బ్లమైన శత్రువైనా
బలహీన స్థితి అయినా
వుయ్ డోంట్ కేర్
వుయ్ డోంట్ కేర్
వుయ్ డోంట్ కేర్
వుయ్ డోంట్ కేర్

నా ముందు నడచువాడు
నా యుద్ధం చేయువాడు
నను విజయమునకు నడిపించువాడు

జీసస్ కేర్స్ యూ
జీసస్ కేర్స్ యూ
జీసస్ కేర్స్ యూ

జీసస్ కేర్స్ మీ
జీసస్ కేర్స్ మీ
జీసస్ కేర్స్ మీ

ఆరాధన వర్తమానం

ఈ సంవత్సరము అద్భుతమైన సంవత్సరము. ఎందుకు అంటే, నీ ముందు ఏదీ నిలువదు. నీ దగ్గరకు రావచ్చు కానీ, నీ ముందు దేవుని వాక్కు నడుస్తూ వుంది గనుక ఏదీ నిలువదు. ప్రభువైన యేసే వాక్యము గనుక, నీ ముందు వాక్కుగా నడిచేవాడు నీ యేసయ్యే! ఈ సంవత్సరము యొక్క మొదటి దినము ప్రభువు దినముగా మొదలయ్యింది. అది ఎంతో ధన్యత. మన జీవితాలకు ఆయనే ఆధారము అయి ఉన్నాడు.

ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు – యోహాను 1:16.

ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప ఈ సంవత్సరమంతా అనుగ్రహించబడును గాక. కృప సమస్తమూ సమకూర్చును. ఈ దినము, ఆయనను ఒప్పుకుని, ఘనపరచి ఆరాధిద్దాము. ఇవి హృదయపూర్వకముగా పలుకువారు, ఖచ్చితముగా ఈ అనుభవము పొందగలుగుతారు. ఈ సంవత్సరము నీ జీవితమును మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను – కీర్తన 50:23

దేవుని పరిపూర్ణతలోనుండి నీకు దయచేసినవి నీవు అర్పించే స్తుతియాగము అర్పించుట ద్వారా పొందగలుగుతావు. ఈ సంవత్సరమునకు కావలిసిన సమస్తము నీకు దేవుడు అనుగ్రహించినాడు. అది అనుభవించడానికి నీవు చేయవలసిన ఒక కార్యము స్తుతి ఆరాధన అర్పించుట.

దేవుడు ఇశ్రాయేలీయులతో “ప్రథమ ఫలము” నాది అని సెలవిచ్చాడు. ఎవరైతే ఆ నియమము ప్రకారము చేస్తారో, వారు ఆశీర్వదించబడతారు. ఈ సంవత్సరము యొక్క ప్రథమ ఫలము అయిన మొదటి దినము దేవుని సన్నిధిలో ఆయనకు అర్పించి మిగతా అన్ని రోజులు అశీర్వాదములు పొందుకుందాము.

ఈరోజు మనము దేవుని పెదవులతో కాక, హృదయముతో స్తుతిద్దాము ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

నా ప్రియ యేసు
పదివేలలో అతి సుందరుడా సుందరుడా

యేషూ ఊ ఊ ఊ వా ఆ ఆ ఆ ఆ

ఈ సంవత్సరం నీదు కరుణ
నీ దయ నీ కృప కలుగును ఆమేన్
యేషూ ఊ ఊ ఊ వా ఆ ఆ ఆ ఆ


నీదే రాజ్యము నీదే బలము
నీకే మహిమ కలుగును గాక ఆమేన్
యేషూ ఊ ఊ ఊ వా ఆ ఆ ఆ ఆ

ఈ సంవత్సరం నీకే మహిమ
నీకే ఘనత చెల్లును ఆమేన్
యేషూ ఊ ఊ ఊ వా ఆ ఆ ఆ ఆ

 

New year message| వాగ్దానము యొక్క సిద్ధపాటు కొరకై వర్తమానము

ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. – హెబ్రీ 6:17

ఈ వాక్యము వాగ్దానమునకు వారసులైన వారికి మాత్రమే చెందినది. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఐగుప్తులో ఉన్నప్పుడు వాగ్దానము చేసాడు కానీ కొందరే స్వతంత్రించుకున్నారు. పై వాక్యము యొక్క అర్థము ఏమిటి అంటే, ఖచ్చితముగా ఆయన వాగ్దానమునకు వారసులైన మీ జీవితములో ఆ వాగ్దానము నెరవేర్చాలి అని తీర్మానము చేసుకున్నాడు అని.

దానికొరకు ఆయన రెండు విషయాలను సూచనగా ఉంచాడు.

శరణాగతులమైన మనము అనగా నిస్సహాయస్థితిలో సహాయము కొరకు ఎదురు చూసేవారు. అయితే నీ స్థితిలో ఒక వాగ్దానము చేస్తున్నాడు. అది నిశ్చయమైన వాగ్దానము. అయితే అది ఎలా స్వతంత్రించుకోవాలి అనేదానికొరకు ఒక నియమము ఉంది. వాగ్దానమునకు వారసులుగా ఉండుట అనేది.

మన పితరుల జీవితములో చూస్తే, వారు దేవుని యొక్క శక్తిని ఎరగని వారుగా ఉండిన కారణముచేత వారు వాగ్దానమును స్వతంత్రించుకోలేకపోయారు, సణుగుకునేవారుగా ఉన్నారు.

మనము వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అంటే, మొదటిగా దేవుని శక్తిని ఎరగి నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవదిగా సణుగుకోకూడదు. మన నోటి మాటచేత మన ఆశీర్వాదమును పోగొట్టుకొనేవారముగా ఉంటాము అయితే జీసస్ కేర్స్ యూ లో ఉన్న మనము అలా ఉండకూడదు. మన జీవితములో ఆశీర్వాదములు ఆలస్యమవ్వడానికి కారణము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని ఎరగక, ఆయనను నమ్మకపోవడమే. ఒక్కొక్కసారి నీ విశ్వాసమును పరీక్షించడానికి దేవుడు ఆలస్యము చెయ్యవచ్చు కూడా. అయినప్పటికీ నీ దేవుడు నిన్ను ఆశీర్వదించుకోవడానికి సంకల్పించుకున్నాడు అని మీరు నమ్మి ముందుకు సాగటమే.

ఈ సంవత్సరము మీదే అంటే ఏమిటి? నీవు ఏదైతే అనుకుంటున్నావో? నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావో? అనగా నీ హృదయవాంఛలు అన్నీ కూడా నెరవేర్చువాడు. ఈ సంవత్సరము అంతా కూడా నీవు కలిగిఉన్నదానిని బట్టి గాక, దేవుని మాటచేత నెరవేర్చబడతాయి. ఈ సంవత్సరము ఈ దినముతో ప్రారంభమవుతుంది, కనుక దేవుని సన్నిధిని పదే పదే జ్ఞాపకము చేయండి. ప్రభువు ఇచ్చిన మాటను బట్టే ఖచ్చితముగా ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. అందుకే ప్రతీ దినమూ నీవిచ్చిన మాటను బట్టి నా జీవితమును ఆశీర్వదించుము అని అడగండి కానీ దయచేసి సణగకండి. దేవుని శక్తిని ఎరిగిన వారుగా ఉండండి. ఒకవేళ నీ నోట నేగటివ్ మాట వస్తుంటే నోరు కట్టుకోండి.

కాలేబు దేవుని యెదుట ఏ విధముగా నడిచాడు? ఆ దినమున మోషే ప్రమాణము చేసినీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పు డును స్వాస్థ్యముగా ఉండుననెను – యెహోషువ 14:9. కాలేబు నిండు మనస్సుతో ఎలా అనుసరించాడు అని గమనిస్తే, 12 మంది కానాను దేశాన్ని చూడటానికి వెళ్తే, 10 మంది దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మాట్లాడారు గానీ, 2 మాత్రమే దేవుని శక్తిని ఎరిగిన వారుగా దేవునికి అనుకూలమైన మాట మాట్లాడారు. ఒకవేళ నీలో నెగటివ్ ఆలోచన వచ్చినా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు సహితము విశ్వసించినవారుగా ఉండుటను బట్టి మనము ఆ నెగటివ్ ఆలోచనలను జయించగలుతాము.

జీసస్ కేర్స్ యూ లో ఉన్న మనము దేవుని వాగ్దానమును నమ్మే వారుగా ఉండాలి, సణగకూడదు (ఓర్పు లేనప్పుడే సణుగుడు వస్తుంది) అలాగే నీ దేవుడు ఖచ్చితముగా చెయ్యగలడు అని ఆయన శక్తిని నమ్మాలి. నీ దేవుడు 2023 లో నీ జీవితమునకు విశ్రాంతిని కలుగచేస్తాడు అని వాగ్దానము ఇచ్చాడు. ఆ వాగ్దానమును స్వతింత్రించునే సిద్ధపాటు కలిగి, 2023 లో సాక్షులుగా ఉందాము.