జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీస్ యొక్క మందిరము కొరకు ప్రార్థించుచుండగా “వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను – కీర్తన 107:7” అనే వాక్యము ద్వారా ప్రభువు ప్రవచనాత్మకముగా దైవ జనుడి ద్వారా మాట్లాడినారు. అప్పటినుండి అనేకమైన సూచనల ద్వారా నడిపించుచున్నారు, బలపరచుచున్నారు కనుక మందిరపు పని కొరకై ప్రార్థన విషయాలను పొందుపరచడము జరిగినది. మిమ్ములను ప్రభువు ప్రేరేపించి బలపరచిన కొలదీ ఈ క్రింద పేర్కొన్న విషయముల గురించి వాక్యములను ఎత్తిపట్టి ప్రార్థించగలరు.
వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను – కీర్తన 107:7
And He led them forth by the right way, that they might go to a city for habitation – Psalms 107:7
దైవజనునికి ప్రార్థనలో దేవుడు హగ్గయి గ్రంథము ద్వారా తెలియ చేసిన మాటలు –
సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.౹ -హగ్గయి 1:2
అనగా జీసస్ కేర్స్ యూ మందిరము కట్టబడవలసిన సమయము ఇదే!
–ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? -హగ్గయి 1:4
అనగా మందిరము మీద, మందిరపు పని మీద ఆసక్తి కలిగిఉండవలసిన అవసరమును ప్రభువు జ్ఞాపకము చేస్తున్నాడు.
జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.౹ -హగ్గయి 1:12
మనము కూడా ప్రభువు ఈ వాక్యము ద్వారా తెలియచేసిన సంగతిని విని, స్వీకరించి, అంగీకరించి భయభక్తులు కనపరచాలి.
వారు కూడివచ్చి, రాజైన దర్యావేషుయొక్క యేలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలుగవదినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. -హగ్గయి 1:15
మనము భయభక్తులు ఎలా చూపిస్తాము అంటే, దేవుని వాక్కును బట్టి మందిరపు పనిని ప్రారంభించడము, కొనసాగించడము!
అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ -హగ్గయి 2:4
నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.౹ -హగ్గయి 2:5
పని ప్రారంభించబూనుకొనే మనలను ఏ ఆధారము లేకుండా దేవుడు వదలడు. ఆయనే తోడుగా ఉంటాడు గనుక భయపడవద్దు అని ప్రభువు చెప్పుచున్నాదు. ఈ సందర్భములో గిద్యోను జీవితములో జరిగిన సంగతి జ్ఞాపకము చేసుకొంటె, తాను కనిష్టుడైనవాడు, బలము లేని వాడు అయినప్పటికీ దేవుడే తోడుగా ఉండి, యుద్ధము గెలవడానికి బలము దయచేసాడు, కనిష్టుడు, అల్పుడు అయిన వానిని గొప్పవాడుగా చేసాడు. అలాగే మనకు కూడా ఆర్థిక వనరులు లేనప్పటికీ, ప్రభువే వాటి విషయములో తోడుగా ఉండి సహాయము చేస్తాడు.
ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.౹ నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ -హగ్గయి 2:6-7
ఈ మాటలు ప్రవచనాత్మకమైనవి మరియు ప్రభువు తోడుగా ఉండి ఎలా సహాయము చేస్తాడొ అనే విషయములో ప్రభువు యొక్క నడిపింపును గూర్చిన మాటలు.
ఆకాశము సూపర్నేచురల్ సహాయమును సూచిస్తుంది.
భూమి అనగా మనమే అనగా జీసస్ కేర్స్ యూ సంఘములో జతపరచబడిన వారిని సూచిస్తుంది.
సముద్రము అనగా చేపలకు నిలయము, చేపలు ఆత్మలను సూచిస్తాయి. గనుక నూతనముగా మందిరపు పని నిమిత్తమై జత చేయబడేవారిని సూచిస్తుంది అన్నమాట.
నేల అనగా ఇంగ్లీషులో “ఎండిన నేల” అని వ్రాయబడింది. అనగా ఎండిన పరిస్థితులలో ఉన్నవారిని ప్రభువు మన మినిస్ట్రీ ద్వారా బాగుచేసి మందిరపు పని కొరకు వాడుకొంటాడు.
అన్యజనులు అనగా ప్రభువు ఎలాంటివాడో, ఏమి చేయగలడో ఇంతవరకు తెలియనివారు. అటువంటి వారిని ప్రభువు నడిపించి వారు ప్రభువు ఏమి చేయగలడో చూపించి తన మందిరము కొరకైన మార్గములు తెరిచేవాడుగా ఉన్నాడు అని అర్థము.
ఈ వాక్యములను ఎత్తిపట్టుకుని క్రింద పేర్కొన్న ప్రార్థనా విషయముల కొరకు ప్రార్థించండి.
- మందిరపు ప్లాన్ మరియు డిజైన్ కొరకు
- మందిర నిర్మాణమునకు అవసరమైన పర్మిషన్ల కొరకు
- మందిర నిర్మాణము కొరకైన ఆర్థిక సహాయము కొరకు పైన చెప్పబడిన వాక్యము ఆధారముగా ఏర్పాటుచేయబడినవారికొరకు ప్రార్థించవలసినది.
- మందిరపు పని కొరకు
- ఐరన్ వర్కు
- వడ్రంగి పని
- కరెంటు పని
- తాపీ పని
- పునాది మరియు స్లాబు పనులు
- ప్లంబింగు పని
- P.O.P పని
- ప్లాస్టింగు పని
- రంగులు వేసే పని
- ఇతర సహాయకరమైన పనులు
- మందిరము పనికి కావలసిన ముడి సరుకుల కొరకు
- మందిరము కట్టడానికి కావలసిన బిల్డర్, ఇంజినీర్, పనివారికొరకు
- పుల్ పిట్ ప్లాట్ఫారం కొరకైన జ్ఞానము
- మందిరము యొక్క ఆడియో సెట్టింగ్స్
- మందిరము యొక్క లైటింగ్స్ మరియు ఇతర కరెంటు పనులకొరకు
- మందిర నిర్మాణము సమయములో వాతావరణ అనుకూలత కొరకు
- ఈ మందిరమునకు ఇవ్వబడిన వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు
- మందిరము కట్టబడే సమయములో దైవజనునికి మరియు ఆయన కుటుంబమునకు కావలసిన రక్షణ, కాపుదల, సహాయము, తోడ్పాటు, ఆరోగ్యము, ప్రయాణ సదుపాయము, జ్ఞానము మరియు దేవుని కృప కొరకు