31-12-2023 – ప్రవచన పరిచర్య

స్తుతిగీతము – 1

మేలులు నీ మేలులు మరచి పోలేనయ్యా
నా ప్రాణమున్నంతవరకు
మరచి పోలేనయ్యా
హల్లెలూయా యేసయ్యా

కొండలలో ఉన్ననూ మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ విడచిపోలేదయ్యా
నీది గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా
గొర్రెపిల్ల మనసయ్యా

శ్రమలలో ఉన్ననూ మరచిపొలేదయ్యా
చీకటిలో ఉన్ననూ నన్ను విడచిపోలేదయ్యా
నీది ఆదరించే మనసయ్యా యేసయ్యా
నీది కాపాడే మనసయ్యా

అగ్నిలో ఉన్ననూ కాలిపోలేదయ్యా
జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా
నీది పావురము మనసయ్యా యేసయ్యా
నీది పావురము మనసయ్యా

స్తుతిగీతము – 2

సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2)
సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం
మా దేవా నీకే అర్పితం
||సంతోష||

నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో
దీవెన కలదు నీ ప్రతి మాటలో (2)
విడువను ఎడబాయనని
వాగ్ధానమిచ్చి బలపరచావు (2)
||సంతోషం||

రక్షణ ఆనందం మాకిచ్చావు
మా క్రయ ధనమంతా చెల్లించావు (2)
ఏ తెగులు నీ గుడారమును
సమీపించదని సెలవిచ్చావు (2)
||సంతోషం||

స్తుతిగీతము – 3

నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు (2)
వందనం యేసయ్యా (4)

ఏపాటివాడనని నేను
నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి
నన్నెంతగానో దీవించావు (2)
||వందనం||

బలహీనుడనైన నన్ను
నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు (2)
||వందనం||

ఆరాధన వర్తమానము

2023 చివరి ఘడియలలో మనము ఉన్నాము, ఈ సంవత్సరపు ముగింపు ఘడియలలో మనము దేవుని స్తుతించినప్పుడు ఆరంభించబడే ఘడియలు శ్రేష్టముగా ప్రారంభించబడతాయి. ఈ సత్యము తెలిసిన వారు ఖచ్చితముగా స్తుతిస్తారు. గనుక ఈ క్రింది గీతము ద్వారా మనము దేవుని స్తుతిద్దాము –

హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు మా దేవునికిచ్చెదము.
ఆ.. ఆ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

అల సైన్యములకు అధిపతియైన – ఆ దేవుని స్తుతించెదము
అల సాంద్రములను దాటించిన – ఆ యెహోవాను స్తుతించెదము

ఆకాశము నుండి మన్నాను పంపిన – ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమును పంపిన – ఆ యెహోవాను స్తుతియించెదము

“అల సాంద్రములను దాటించిన” అంటే దేవుడు మన కార్యమును తన శక్తితో చేసినవాడు. ఆయన మార్పు లేని వాడు గనుక మాటి మాటికి తన శక్తిని మన జీవితములో కనపరచేవాడుగా ఉన్నాడు గనుక హృదయమారా ఆయ్నను స్తుతిద్దాము.

ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యమును బట్టి నీవు స్తుతిస్తావో అప్పుడు ఆ కార్యము మరలా మాటి మాటికీ జరిగేదిగా ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులను దేనీనీ మరువకుము అని దావీదు తన కష్ట కాలములో రాసాడు. అయితే ఇంకకు ముందు ఏ మేలు దేవుడు చేసాడో, అదే మేలు ఈ సమయములో కూడా చేస్తాడు అని నమ్మి స్తుతించాడు. మన్నా అంటే దేవుని వాక్కు. బండలాంటి మన జీవితములలో జీవము పొర్లి పారేదిగా ఉంది. మారాలాంటి మన జీవితము మధురముగా మార్చబడుతుంది.

దేవునిని స్తుతించినపుడు ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తే, మన జీవితములో ఎప్పుడూ అపవాది నాశనము చేయడానికి ప్రయత్నము చేస్తాడు. దేవుడు జీవింపచేయుటకు ప్రయత్నిస్తాడు.

ఎప్పుడైతే దేవునిని స్తుతిస్తావో దేవుని మహిమ విడుదల అవుతుంది, అపవాది క్రియలను లయపరచేదిగా ఉంది. ఈ 2023 లో నీవు చేసే స్తుతి, 2024 లో అపవాది ఎన్ని ప్రయత్నాలు సిద్ధపరచినా సరే అవన్నీ లయపరచబడతాయి.

నీ గతమును మార్చడానికి నీ వర్తమానమును ఉపయోగించి నీ భవిష్యత్తును స్థిరపరుస్తాడు.

2024 లో 12 నెలలు ఉన్నాయి, ప్రతీ నెలా దేవుడు చేసే కార్యములను బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది. ఈ 12 నెలల కొరకు దేవుడు ఏమి సిద్ధపరచాడో అవి ప్రత్యక్షపరచబడటానికి ఇప్పుడే మనము కృతజ్ఞత చెల్లించాలి. మనము చెల్లించే కృతజ్ఞత మనలను ప్రమోట్ చేసేదిగా ఉంది. 2024 లో అనేకమైనవి ముగింపులోనికి వచ్చును.

సాక్ష్యముల సమయము:

ప్రశాంతి సిస్టర్ సాక్ష్యము: ఈ సంవత్సరము నీ గృహము కట్టబడుతుంది అని 2023 లో వాగ్దానము వచ్చింది. 2021 లో కూడా గృహము కట్టుకుంటారు అని ప్రాఫెసీ వచ్చింది. అయితే కరోనా వలన అది ఆగిపోయింది. 2022 లో కూడా ఇంతకు ముందు జరగనిది ఇప్పుడు దేవుని కృపద్వారా జరుగుతుంది అనే వాగ్దానము వచ్చింది. అప్పుడు కూడా ఆటంకము వచ్చింది. 2023 మాత్రము దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరబడింది. యోవేలు 2:26 నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అనే వాగ్దానము కూడా దీనికి తోడై ఆశ్చర్యకరముగా సొంత గృహము కట్టుకొన్నారు.

దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో కారుకూడా ఇచ్చి పిల్లలను స్కూల్ కి తీస్కెళ్ళడానికి, స్కూటర్ కూడా నేర్చుకోవడానికి ఆశ్చర్యమైన సంఘటనల ద్వారా దేవుడు ప్రార్థన ఆలకించి వారి జీవితములో మహిమపరచుకున్నారు.

దేవుని వాక్కు విడుదల అయినపుడు దాని కార్యము జరగవలసినదే

కుసుమ సిస్టర్ మరియు డానియెల్ బ్రదర్ సాక్ష్యము: స్వాస్థ్యము ఆడ్ అవుతుంది, నిన్ను విస్తరింపచేస్తున్నాడు, నీవు స్వతంత్రించుకోవడానికి విస్తరించబడతావు అని కుసుమ సిస్టర్ కి వాగ్దానము వచ్చింది.

ఇంతకు ముందు రెండు సార్లు అబార్షన్ జరిగింది. దీనిగురించి కుటుంబము చాలా డిప్రెషన్ కు లోనయ్యింది. ఇంతకు ముంది 2020 లో “భవిష్యత్తులో నీకు నిరీక్షణ కలుగునట్లుగా” అని ఉద్యోగము విషయములో వాగ్దానము ఇచ్చి, నెరవేర్చాడు. ఇదే వాగ్దానము జ్ఞాపకము చేసుకుని నిలబడ్డారు. అంతే కాక, వన్+వన్ అనే ఆఫర్ అని ప్రభువు చెప్పారు. స్కేల్ 3 మేనేజర్ కొరకు సిద్ధపరుస్తున్నాడు అని దైవజనుడి ద్వారా మాట్లాడాడు.

ఈ రెండు భూఫలము, గర్భఫలము జనవరి 31 కి విడుదల అవుతాయి, దేవునికే మహిమ కలుగును గాక.

వరలక్ష్మి సిస్టర్ సాక్ష్యము : తన కూతురు ఇంజినీరింగ్ కాలేజ్ లో సీట్ దొరకడానికి దేవుడు కృప చూపించాడు. తన భర్త ఆరోగ్యము విషయములో కూడా కృప చూపించాడు. ప్రతీ చిన్న విషయములో దేవుని కృప లేనిదే ఏమి పొందుకోలే

ఆనంద్ బ్రదర్ సాక్ష్యము: తన ఇల్లు స్వతంత్రించుకోవడములో అడ్డుగా ఉన్నవారిని దైవ జనుడి ద్వారా చూపించడము జరిగింది. ఇప్పుడు ఆ అడ్డు తొలగిపోతుంది అని విశ్వాసము కలిగి ఉన్నాడు.

ఒక స్తుతి గీతము ద్వారా ప్రభువును స్తుతిద్దాము:

యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా
మా ఇమ్మానుయేలు రాజా

రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శక్తి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో రాజుల రాజునకే

ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతుము
రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము

మన దేవుని నామము వినగానే, మన ఆత్మ ఉత్తేజితము అవ్వాలి. యేసు అనే పేరు చెప్పగానే, “దేవా నాకు సహాయము చేయ్యి” అని అర్థము. మన దేవుని నామము స్తుతించడములో సిగ్గుపడకూడదు. ఆయన లేకుండా మనము లేము.

ముత్యాలరావు బ్రదర్ సాక్ష్యము: దేవుడు రెండు అవకాశములు ఇచ్చాడు. మొదటి అవకాశము సద్వినియోగపరచుకోలేని కారణాన నష్టము చూసారు, 2021 సింగపూర్ వెళ్ళేసమయములో చెన్నై లో క్వారంటైన్ అయింది. సింగపూర్ కి వెళ్ళిన తరువాత కరోనా వచ్చింది. అక్కడకు వెళ్ళక ముందు వచ్చి ఉంటే అక్కడకు వెళ్ళడము కుదిరేదు కాదు. అయితే ఉద్యోగములో, వెల్డర్ నుంచి ఫిట్టర్ గా, తరువాత టీం లీడ్ గా ఇప్పుడు ప్రమోట్ అయ్యారు. అంతే కాక దైవ జనుడి ద్వారా చెప్పబడిన మాట ద్వారా ఆయన జీతము కూడా పెరిగింది. దానిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక!

సందీప్ బ్రదర్ సాక్ష్యము: ఉన్న ప్రదేశములో ఉండవు, మారుతుంది అనే వాగ్దానము వచ్చింది. ఆ తరువాత విజయవాడ ఇంక ఇతర ప్రదేశములలో అవకాశము వచ్చింది. అయితే దైవజనుడి ప్రార్థన ద్వారా బయట కాదు గానీ, ఉన్న చోటనే, వేరే డిపార్ట్మెంట్లో తృప్తి కలిగిన పొజిషన్ లో బ్రదర్ ఇప్పుడు ఉన్నారు. దీనిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక!

విజ్ఞాని సిస్టర్ సాక్ష్యము: ఆరోగ్యము విషయములో దేవుడు 2023 లో కృప చూపించాడు. అంతకుముందు తెలియని కారణముల చేత ఆరోగ్యము పాడైనా సరే, దేవుడు కృప చూపించాడు.

చదువు విషయములో ఎంత చదివినా సరే గుర్తు ఉండని పరిస్థితిలో ఉండి 10 పాస్ అవుతానని అనుకోని స్థితిలో 60% తో ఉత్తీర్ణత సాధించింది. ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరములో సి.ఇ.సి గ్రూప్ తీసుకున్నారు. అక్కడనుండి పరీక్షలలో కూడా జ్ఞానమును పెంచి మంచి మార్కులతో సిస్టర్ తో ఆయన కృప తోడుగా ఉంచారు. ఇంకా తను మారవలసిన స్థితి ఉంది అని గమనించి మార్చుకోవడానికి సిద్ధపడింది. దేవుని తోడును బట్టి సిస్టర్ యొక్క జీవితము మహిమ కరమైన సాక్ష్యముతో సిద్ధపరచును గాక! మన దేవుడు తన ప్రేమను క్రియల ద్వారా చూపిస్తాడు.

సంఘము స్థలము యొక్క సాక్ష్యము: అనేక ప్రాంతములకు నడిపించబడుతున్నాము, అనేక ప్రాంతములను స్వతంత్రించుకోబోతున్నాము. అంతే కాక, విస్తారమైన మందలకు సరిపడిన స్వాస్థ్యము దేవుడు ఇస్తున్నాడు అని వాగ్దానము ఇవ్వడము జరిగింది.

మన దేవుడు ఎంతో నమ్మకత్వము చూపించి స్థలము దయచేసాడు. దానిని బట్టి దేవునికే మహిమ.

దేవునికి కృతజ్ఞత చెల్లించడము దేవుని చిత్తము. ఇప్పుడు మనము దేవుని చిత్తము జరిగిస్తాము. దేవుని చిత్తము జరిగించినపుడు, ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు దేవుని చిత్తమును జరిగించడానికే ఈ భూలోకములోనికి వచ్చాడు. అప్పుడు తండ్రి, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను” అని సాక్ష్యము ఇచ్చాడు. ఇప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించడము ద్వారా నిన్ను బట్టి కూడా దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు.

ఎప్పుడైతే ఆ సాక్ష్యము యేసయ్య పొందుకున్నాడో, ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని శక్తి కనపరచబడింది. మనము కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లించడము ద్వారా దేవుని చిత్తము జరిగిస్తాము. అప్పుడు మనకు కూడా “నా ప్రియ కుమారుడు” అని సాక్ష్యము వస్తుంది. మన జీవితములను కూడా ముద్రిస్తాడు. అంతే కాక, నీవంటి వాడు మరొకడు లేని విధములో నిన్ను సంతోష పరుస్తాడు.

దేవునిని స్తుతించుటలో మనము అర్పించదగినది మన హృదయమే! ఒకసారి 5000 వేల మందికి ఆహారము అందించిన సందర్భములో, ఇంకా కార్యము జరగక మునుపే, ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాడు. ఇక్కడ ఒక మర్మము ఉంది, ఇది ఎంతో ప్రాముఖ్యము. ఆయన మనసులో ఒక్క శాతము కూడా అనుమానము లేదు. మనము కూడా దేవుని ద్వారా ఇవ్వబడిన వాక్కు విషయములో 1 శాతము అనుమానము లేకుండా నిలబడితే, మనము తెలిపే కృతజ్ఞత సూపర్ నేచురల్ ను మనము పొందుకోనే విధముగా సిద్ధపరుస్తుంది. 

నీ గతము మార్చబడటానికి నీ వర్తమానమును దేవుడు వాడుకుంటాడు. దాని ద్వారా నీ భవిష్యత్తును స్థిరపరుస్తాడు. ఇదే 2024 కొరకు వాక్యము. ఈ సత్యమును గ్రహించి నిలబడితే 2024 నిండి పొంగి పొర్లుతుంది.

యేసయ్య 5000 వేల మందికి పంచిపెట్టిన తరువాత, 12 గంపలు ఎత్తినారు. ఒకటే వాగ్దానము 12 నెలలకు సరిపడగా నీ గిన్నె నిండి పొంగి పొర్లే విధమైన ఆశీర్వాదము నీకు ప్రభువు ఇస్తున్నాడు.

కృతజ్ఞత చెల్లించక మునుపు 5 రొట్టెలే, అయితే ఆ తరువాత 12 గంపలు అయ్యాయి. 2023 లో కొంచెమే ఉన్నావేమో, అయితే నీవు చెల్లించే ఈ కృతజ్ఞత 2024 లో నీ గిన్నె నిండి పొర్లే విధముగా సిద్ధపరుస్తుంది.

అనంద్ బ్రదర్ ప్రాఫెసీ: 5 రొట్టెలు సరిపోవట్లేడు కానీ దేవుడు 12 గంపలుగా మార్చబడుతున్నవి. నీ ఇంటి విషయములోని దుఃఖమును తొలగించేవాడిగా ఉన్నాడు.

2024 అనేకమైన వాటికి సూపర్ నేచురల్ ముగింపు అయి ఉంది.

యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను – యోహాను 6:11

ఇక్కడ “వడ్డించడము” అనే మాట వాడబడింది. కృతజ్ఞత చెల్లించాక, సమృద్ధిగా మార్చబడింది. అదేవిధముగా జీతము పెరుగునట్లు దేవుడు సిద్ధపరుస్తాడు.

రాజు బ్రదర్ ప్రాఫెసీ: 2024 లో సమృద్ధే గానీ లేమిని చూడరు.

అయితే దీని కొరకు మనము చెయ్యవలసినది కృతజ్ఞత చెల్లించుటయే

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను – కీర్తన 50:23

స్తుతియాగము అర్పించినపుడు దేవునికి మహిమ కలుగుతుంది. అపవాది మన జీవితములను నాశనము చేయడానికి ప్రయత్నము చేస్తున్నాడు. అలాగే దేవుడు నిన్ను ఆ ప్రతి ప్రయత్నములనుండి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. నీవు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినపుడు విడుదల అయ్యే మహిమ, నీ కొరకు 12 నెలలకు సిద్ధపరచిన గంపలను అపవాది ఎత్తుకుపోకుండా కాపాడుతుంది.

ఈరోజు మనము 2023 లో చేసిన దానికి, అలాగే 2024 లో సిద్ధపరచినదానికి కృతజ్ఞత చెల్లించాలి.

ఎల్లప్పుడును నా మనవి వింటున్నావు అని యేసయ్య కృతజ్ఞత చెల్లించేవాడు. అంటే, రాబోయే దాని విషయములో కూడా యేసయ్య కృతజ్ఞత చెల్లించాడు. ఈరోజు చేస్తున్న కృతజ్ఞత ఆరాధన నీ కొరకు సిద్ధపరచిన సంవత్సరవమును స్థిరపరుస్తుంది.

గుర్తు పెట్టుకో – 12 గంపలు 12 నెలల కొరకు సిద్ధపరచబడ్డాయి. దేవుని స్తుతించు.

ఈ గంపలు కాపాడుకోవడానికి నీకు దేవుడు తెలియచేసిన మర్మము: “స్తుతి ఆరాధన” “కృతజ్ఞత” చెల్లించుటయే!

12 నెలలకు 12 అద్భుతములు, నీవు చేసుకోలేనివి, నీ వల్ల కానివి దేవుడు చేసేవాడుగా ఉన్నాడు.

10 మంది కుష్టు రోగులు అద్భుతము పొందుకున్నప్పటికీ 9 మంది కృతజ్ఞత చెల్లించలేదు. ఆ గుంపులో నీవు నేను ఉండకూడదు.

12 గంపలు నీ ఊహకు మించిన కార్యములతో నిండినవి. గనుక ఈ సమయమును పోనివ్వవద్దు. దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించకుండా నీ నోరు కట్టుకొనవద్దు. మనము దేవునిని ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

నేనును నా ఇంటి వారందరు
మానక స్తుతించెదను (2)
నీ కను పాప వలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)

ఎబినేజరే ఎబినేజరే
ఇంతకాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే
నా తోడు వై నడచితివే

స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కను పాప గా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం (2)

చరణం :
ఎడారిలో ఉన్న నా జీవితమును
మెల్ల తో నింపితివి (2)
ఒక కీడైన దరిచేరక నను
తండ్రిగా దాచావు స్తోత్రం (2)
” ఎబినేజరే “

చరణం :
ఆశలే లేని నాదు బ్రతుకుని
నీదు కృపతో నింపితివి (2)
నీవు చూపిన ప్రేమ ను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2)
” ఎబినేజరే “

దేవా ఈ సమయమును ఆశీర్వదించావు స్తోత్రము. ఇప్పుడు చేసే మా ఆరాధన 12 నెలల ఆశీర్వాదమును స్థిరపరుస్తుంది.

యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా
యెహోవా షాలోం యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు దేవా

రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శుద్ధి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో
రాజుల రాజునకే

దేవా నీ కృపాబాహుళ్యముతో
కరుణచూపితివే
మా దోషశిక్షను భరియించి
మమ్మును ధన్యుల చేసితివే

రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శుద్ధి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో
రాజుల రాజునకే

ప్రభువా నీ ఉపకారములకు
ఏమి చెల్లింతుము?
రక్షణపాత్రను చేతబూని
ఆరాధించెదము

యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా
యెహోవా షాలోం యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు దేవా
రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శుద్ధి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో
రాజుల రాజునకే

 

 

 

ప్రవచన పరిచర్య

నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును – ద్వితీయోపదేశకాండము 7:19

2024 లో దేవుని శక్తి, మహిమ మరియు బాహుబలము పునరావృతము అవుతుంది. ఇంతకుముందు దేవుని బాహుబలము చూసాము అయితే ఆ సూచక క్రియలు, మహత్కార్యములు, బాహూలము, చాచిన చేయి పునరావృతము అవుతుంది

అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు – యెషయా 43:1

పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని ప్రభువు చెప్పుచున్నాడు. దేనికొరకు చెప్పుచున్నాడు? మనకొరకు సిద్ధపరచబడిన 2024 గురించి మాట్లాడుతున్నాడు. ఈ 2024 నీకొరకు నాకొరకు దేవుని చేత సృజించబడింది, నిర్మించబడింది. దేని చేత నిర్మించబడింది అంటే, తన బాహుబలము, చాచిన చేయి చేత నిర్మించబడింది.

2024 ముగింపు సంవత్సరము. ఇంతవరకు నీవు అనుభవించిన దుఃఖించిన పరిస్థితికి ముగింపు. గనుక “నా దుఃఖము ముగించబడింది, నా శ్రమ ముగించబడింది” అని డిక్లేర్ చేసుకోండి.

ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి తీసుకువెళతాను అని మాట ఇచ్చాడు. అయితే మోషే ద్వారా ప్రారంభించబడి, యెహోషువ ద్వారా ముగించబడింది. అందుకే ఈ సంవత్సరము యెహోషువ సంవత్సరము గా దేవుడు ముద్రించాడు.

మోషేను దేవుడు ఏర్పరచుకుని కొంత ప్రయాణము కొనసాగింపచేసాడు గానీ ముగించబడలేదు. అనగా దేవుడు ఏ మాట ద్వారా తన వాగ్దానమును ప్రారంభించాడో, అది 2024 ముగింపు గా ఉంటుంది, అది ఇంక కొనసాగించబడదు. ముగింపు ప్రభువు నిర్ణయించాడు. మాటి మాటికి గాయపరచబడుతున్న నీ పరిస్థితికి ముగింపు ప్రభువు నిర్ణయించాడు.

యెహోషువ జీవితము కొనసాగించబడింది, దేని చేత? మోషే తన దగ్గర ఉన్న కర్ర చేత అద్భుతములు చేస్తూ నడిపించాడు. అయితే యెహోషువ కు మాత్రము ధర్మశాస్త్రము ఇచ్చి దాని ద్వారా నడిపించమన్నాడు. అందుకే మందసమును ముందు పెట్టుకుని తన ప్రయాణమును కొనసాగించాడు.

ఐగుప్తు నుండి విడిపించబడిన తరువాత కర్ర ద్వారా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసాడు. అయితే యెహోషువ సమయములో నిబంధన మందసము ద్వారా యోర్దానును రెండు పాయలు గా చేసాడు. అనగా దేవుని శక్తి మరలా పునరావృతము అయింది. ఈ సంవత్సరమునకు మనము దేవుని వాగ్దానమును ఆధారము చేసుకోవాలి. ప్రతి నెలా ఇదే వాగ్దానమును ఎత్తిపట్టి కొనసాగించండి.

యెహోషువ దేవుని వాక్కును పట్టుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మనము కూడా దేవుని వాగ్దానమును పట్టుకుని ముందుకు వెళ్ళాలి.

5 రొట్టెలే గానీ, సమృద్ధిగా మార్చబడింది. ఒకే వాగ్దానము 12 నెలల కొరకు ఇవ్వబడింది. ప్రతి నెలలోని 30, 31 రోజులు ఇదే వాగ్దానము స్థిరపరచబడుతుంది.

వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనముచేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను – యెహోషువ 11:20

ముందు చెప్పబడ్డ మాటలు నెరవేర్చబడునట్లుగా ఇప్పుడు కార్యము మొదలు అవుతుంది. మోషే సమయములో దేవుడు ఆజ్ఞాపించాడు, అది యెహోషువ సమయములో ముగించబడింది.

ఈ సంవత్సరములో మన జీవితాలలో ఏది ఎదురైనా విజయము నీకొరకే సిద్ధపరచబడింది. ఇదే సత్యము, వాగ్దానమును జ్ఞాపకము పెట్టుకోవడమే! ఎటువంటి నెగటివ్ పరిస్థితి వచ్చినా మనకు వాగ్దానము ఉంది గనుక మనము భయపడనవసరము లేదు.

ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను, అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను – యెహోషువ 11:20

మోషే సమయములో అనాకీయులను చూసి భయపడ్డారు. అయితే యెహోషువ సమయములో అదే అనాకీయులను చంపివేసినారు. ఈ 12 నెలలో ఏ నెలలో ఎవరు వ్యతిరేకముగా ఉన్నా, పరిస్థితి వ్యతిరేకముగా ఉన్నా అది విజయము పొందలేదు. మీదే విజయము ఇదే ఖచ్చితము. ఇంతకు ముందు మీరు భయపడిన విషయము ఇప్పుడు ముగించబడవలసినదే.

యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశ మంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్ప గించెను. అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను యెహోషువ 11:23

2023 లో మిగల్చబడిన వాగ్దానము అది 2024 లో ముగించబడుతుంది. ఇలా జరుగులాగున దేవుడు నిర్మించేసాడు. ఇంతకు ముందు యుద్ధము చేయునట్లు శత్రువు ఉన్నాడేమో గానీ, 2024 లో శత్రువు అనేవాడు ఉండడు, సమాధానము కలిగిన సంవత్సరము. యేహోవా రాఫా గా స్వస్థత, యెహోవా షమ్మా గా సమాధానము నెరవేరుతుంది.

అనాకీయులను ఇక మీరు చూడరు. 2024 లో పునరావృతము అయేదిగా ఉంది. మోషే ఒక మాట చెప్పాడు – “ఇంతకు ముందు చూసిన ఐగుప్తీయులను ఇంక మీరు చూడరు”. అలాగే యెహోషువ సమయములో, – “ఇంతకు ముందు ఉన్న అనాకీయులను ఇక చూడలేదు”. నీ పడిపోయిన జీవితాన్ని తిరిగి లేవనెత్తుతున్నాడు. అనాకీయులు చాలా ఎత్త్తైనవారు, చాలా బలము కలిగినవారు. అయితే, నిన్ను భయపెట్టినది ఏదైనా సరే ఇక మిగిలి ఉండదు.

“నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును” అనగా నీకు భయము పుట్టిస్తున్న అప్పు అయినా, సమస్య అయినా జనులైనా సరే వారికి నీ దేవుడు అలాగే చేయును. అనగా దేవుని బాహుబలము కనుపరచబడి ఆ పరిస్థితి లయ పరచబడుతుంది.

ఈ 2024 నీ జీవితములో సమాధానము కలుగచేస్తుంది. నీకొరకు 2024 ని నిర్మించాడు గనుక మొదటి నెల నుండి నేను మిస్స్ అవ్వకూడాదు అనే ఆశ నీవు కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని బాహుబలము పునరావృతము అయింది.

ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లివారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను – యోహాను 2:3-4.

ఇక్కడ మరియ మరియు యేసయ్య ఇద్దరూ కనపరచబడుతున్నారు. ద్రాక్ష రసము అయిపోయింది. మరియకు ఈ విషయము తెలియచేయబడింది. ఆ తరువాత యేసయ్యకు తెలియచేయబడింది. అనగా మరియకు తెలియచేయబడిన సమయములో ద్రాక్షారసము అయిపోయిన స్థితి ఉంది. అయితే యేసయ్య సమయము వచ్చినపుడు ఆ ద్రాక్షరసము నూతనముగా నింపబడింది.

మరియ 2023 లో నీవు ముగించబడని సమస్యను సూచిస్తుంది. యేసయ్య 2024 లో అదే సమస్య ముగించబడేది గా సూచిస్తుంది. సమయము మిస్స్ అయిపోయిందేమో, అద్భుతము మిస్స్ అయింది అని అనుకున్నారేమో, అయితే మరియ వలే నమ్మి ఈ సత్యమును పట్టుకో. ఇంతకు ముందు అద్భుతము జరిగుతుంది అని నమ్మినప్పటికీ జరగనిది లేదా మిస్స్ అయిపోయినది ఇప్పుడు జరుగుతుంది.

సుకన్య సిస్టర్ కొరకు ప్రాఫెసీ: కుసుమ సిస్టర్ జీవితములో ఏ రీతిగా 2023 లో మాట వెల్లడి పరచి స్థిరపరిచాడో అలాగే ఈ సిస్టర్ జీవితములో 2024 లో కూడా 2023 లో ఎదురు చూసిన అద్భుతము జరుగుతుంది.

వరలక్స్మి సిస్టర్ కొరకు ప్రాఫెసీ : కుమారుని జీవితములో అద్భుతము జరుగుంది.

మరియ సమయము, జీసస్ సమయము జాగ్రత్తగా అర్థము చేసుకోవాలి. మరియ సమయము 2023 ఆశించావు కానీ, మిస్స్ అయిపోయావ్. యేసయ్య సమయము 2024, నీవు ఆశించినది ముగించబడుతుంది, లేదా నెరవేరబడుతుంది.

మరియ అద్భుతము జరుగుతుంది అని నమ్మింది అందుకే, అక్కడ పనివారితో యేసయ్య ఎలా చెప్తే అలా చెయ్యమని చెప్పి వెళ్ళిపోయింది. నీవు 2023 లో నమ్మింది 2024 లో సూపర్ నేచురల్ గా నెరవేర్చబడుతుంది. 2024 ఖచ్చితముగా పరిపూర్ణమైన సంవత్సరము. సూచక క్రియ జరిగించబడుతుంది. నీవు నమ్మిన దానికి దేవుడు సూచక క్రియ జరిగిస్తాడు.

దేవమణి సిస్టర్ కొరకు ప్రాఫెసీ : నీ కళ్ళ ముందు దేవుడు జరిగించబోయే క్రియ నీవు చూస్తావు.

2023 లో అనగా మరియ సమయములో ద్రాక్షారసము అయిపోయినప్పుడే ఆ కుటుంబము అవమాన పరచబడాలి. అయితే ఈ అవమానమును తప్పించడానికి అల్రెడీ సమయము సిద్ధపరచబడింది. ఏ అవమానము అయితే జరగవలసిందో, అది తప్పించబడింది. అంతే కాక ఆ కుటుంబానికి మంచి సాక్ష్యము వచ్చింది. ఇది 2024 లో మరలా జరిగించాలి అని ఆశ పడుతున్నాడు. సూచక క్రియల ద్వారా ప్రభువు ముగించాలి అని కోరుకుంటున్నాడు. 2024 సూపర్నేచురల్ జరుగునట్లుగా ఈ సంవత్సరమును నిర్ణయించాడు.

2024 నీ కొరకు ఆయన బాహుబలము చేత, సూచక క్రియల చేత నిర్మించబడి ఉంది.

ఒకదాని చేత ఈ సంవత్సరము నిర్మించబడలేదు గానీ, బాహు బలము, సూచక క్రియలు, చాచిన చేయి, మహత్కార్యములతో నిర్మించబడి ఉంది. ఒక నెల సూచక క్రియ అయితే మరొక నెల బాహుబలము చేత అద్భుతము జరుగుతుంది.

ఈ 12 నెలలు నేను అద్భుతము చూడాలి అనే ఆశ నీవు నేను కలిగి ఉండాలి.

నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును – ద్వితీయోపదేశకాండము 7:19

మీరు ఇంతకు ముందు చూసినది మరలా ఆయన చేసినవాడుగా ఉన్నాడు.

జి సూజన్: నీవు చూస్తుండగానే దేవుని శక్తి, సూపర్ నేచురల్ శక్తి ద్వారా దేవుని సూచక క్రియలు జరిగించబడతాయి.

2023 లో మీరు ఎదురుచూసిన అద్భుతము 2024 లో ఖచ్చితముగా జరుగుతుంది.

చైతన్య సిస్టర్ కొరకు ప్రాఫెసీ : ఇప్పుడు సూచక క్రియలు జరిగించబడుతాయి. సన్నీ జీవితములో అసాధ్యము అనుకున్నది ఖచ్చితముగా జరుగుతుంది. 2024 లోనే ఇది జరుగుతుంది.

గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. యోహాను 2:11

దేవుడు చేసిన కార్యమును బట్టి అనేకులు విశ్వాసము ఉంచారు. మనము చేసే ప్రార్థనలలో, నూతన చర్చ్ స్వస్థత మరియు అద్భుతములు జరిగే స్థలము గా ఇవ్వబడిన ప్రవచనము కొరకు ప్రార్థిస్తున్నాము. 2024 లో ఆ చర్చ్ కట్టబడుతుంది, సన్నీ జీవితములో 2024 లో అద్భుతము జరిగి, సన్నీ వంటివారు అనేకులు స్వస్థత పొంది దేవుని మహిమపరచేవారుగా ఉంటారు.

2023 లో ఏ అద్భుతము అయితే ఆశించినప్పటికీ జరగలేదో, 2024 లో ముగించబడుతుంది. అది కూడా సూపర్ నేచురల్ గా జరుతుంది.

ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను. అపొస్తలుల కార్యములు 3:16

యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా! అంటూ ఆయన నామమును పట్టుకునే 2024 లోనికి అడుగు పెట్టాము. అక్కడ బలపరచబడిన వ్యక్తి పుట్టినది మొదలుకొని, కుంటివాడైన ఒక మనుష్యుడు దేవాలయమునకు మోసుకొని పోబడుతున్నాడు. వాడు కలిగి ఉన్న అవిటితనమును బట్టి ప్రతి దినము దేవాలయమునకు నడిపించబడుతున్నాడు. అయితే వాడి జీవితములో ఒక దినము, వాడు ప్రతిదినము వెళుతున్న దేవాలయములోనే వాడికి స్వస్థత పొందాడు.

ఏ అవిటితనమును బట్టి, ఏ అవసరమును బట్టి నీవు దేవునికి మొరపెడుతున్నావో, నీవు పుట్టినది మొదలుకొని నీకు ఉన్న సమస్య కొరకు ప్రతి దినము దేవునికి మొర పెట్టావో, ఆ సమస్య, అవసరము తీర్చబడుతుంది. మీరు చేసే ప్రార్థనకు జవాబు వస్తుంది.

ఆ కుంటివాడి జీవితము ఎలా మార్చబడింది? ఆయన నామమును బట్టి అని లేఖనము చెప్పుచున్నదు. మీకు కూడా ఏ నామము బట్టి మొర్ర పెడుతున్నారో, అదే నామము బట్టి ఆ సమస్య తీర్చబడుతుంది.

పేతురు యోహానులు, అక్కడకు వచ్చారు. వారు ఊరకనే అక్కడకు రాలేదు గానీ దేవుని చిత్త ప్రకారమే అక్కడకు వచ్చారు. ఆ తరువాత అక్కడ ఉన్నవారు రక్షించబడునట్లుగా ఆ కుంటివాడు అద్భుతము పొందుకున్నాడు.

2024 అనేది పరిపూర్ణమైన సంవత్సరము గా నిర్ణయించాడు గనుక మీరు చేసే ప్రార్థనలకు సొల్యూషన్స్ సిద్ధపరచబడ్డాయి.

చంద్రకళ సిస్టర్ కొరకు ప్రాఫెసీ: రెండు సొల్యూషన్స్ నీవు చేస్తున్న ప్రార్థనలకు ఏర్పాటు చేసాడు. ఈ రెండు సొల్యూషన్స్ ద్వారా నీవు కలిగిన అవిటితనమునుండి విడుదల పొందునట్లుగా సిద్ధపరుస్తున్నాడు, దీనినిబట్టి అనేకులు రక్షణ పొందునట్లుగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.

2024 ముగించబడునట్లుగా రెండు సొల్యూషన్స్ దేవుడు మనకొరకు సిద్ధపరిచాడు.

పక్షిరాజు యవ్వవనమువలె నీ ¸యవ్వవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు కీర్తన 103:5

పక్షిరాజు నూతనముగా చేయబడకమునుపు చాలా భయంకరముగా ఉంటుంది. పక్షిరాజు అనగా గ్రద్ద. ఒకానొక సమయములో తన శరీరము అంతా గాయపరచబడుతుంది. ఆ సమయము అయిపోయినతరువాత యవ్వనముగా రూపాంతరము చెందుతుంది. అలాగే 2024 నూతనపరచబడే సంవత్సరముగా ఉంటుంది. ముందు ఉన్న జీవితము కోల్పోయిందేమో అయితే ఆ పోగొట్టుకున్నది తిరిగి పొందుకుంటాము.

ఏ ధనము అయితే నష్టపోయామో ఆ ధనము తిరిగి సమకూర్చ బడుతుంది. కోల్పోయిన జీవితమును నూతనమైన జీవితముగా చేస్తున్నాడు. ఆరోగ్యము పోగొట్టుకున్నావా? ఆరోగ్యము రెస్టొర్ అవుతుంది.

వల్లూరి కళ్యాణి కొరకు ప్రాఫెసీ: నూతనమైన ఆరోగ్యముచేత నీవు ఉండబోతున్నావు. ఇంతకు ముందు నిన్ను బాధించినది ఇప్పుడు ముగించబడుతుంది.

మధుసూదనరావు బ్రదర్ కొరకు ప్రాఫెసీ: నీ ధనము రెస్టొర్ అవుతుంది. ఈ సంవత్సరము తృప్తి పరచబడతావు.

ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను – యోహాను 1:17

మనిషిని రక్షించడానికొరకు దేవుడు ధర్మశాస్త్రమును సిద్ధపరచాడు. అలాగే అదే మనిషిని రక్షించడానికి యేసు ప్రభువును సిద్ధపరచాడు. నన్ను రక్షించడానికి ఒక సొల్యూషన్ మొదట దేవుడు పంపించాడు, అది నన్ను విడుదల చేయలేకపోతుంది. అయితే యేసయ్య అనే సొల్యూషన్ మాత్రము నన్ను రక్షించగలిగింది.

2023 మొదటి సొల్యూషన్ అయితే 2024 రక్షించిన సొల్యూషన్ గా ఉంది.

ధర్మశాస్త్రము కండిషన్స్ తో కూడినది యేసయ్య కృపతో కూడినది. 2023 లో ఒక అవకాశము దొరికినప్పటికీ ఫుల్ ఫిల్ అవ్వలేదు. అయితే 2024 లో ఖచ్చితముగా కృపా సంవత్సరమై నిన్ను నిలబెట్టి నిన్ను తృప్తిపరచేదిగా ఉంటుంది.

తేజ, సందీప్, మౌనిక కొరకు ప్రాఫెసీ: మరొకసారి మీకు అవకాశము ఇవ్వబడుతుంది. ఖచ్చితముగా కృపా సంవత్సరమై నిన్ను నిలబెట్టి నిన్ను తృప్తిపరచేదిగా ఉంటుంది.

ప్రదీప్ బ్రదర్ మరియు భార్య కొరకు ప్రాఫెసీ: 2024 లో మీ పొజిషన్స్ మార్చబడుతున్నాయి.

ఉద్యోగము చేసే ప్రతివారి పొజిషన్స్ మారబోతున్నాయి. ఈ 2024 అంతటా కృప వెల్లడిపరచబడుతుంది. ఈ 12 నెలలు సంపూర్ణమైన కృప మనము కలిగి ఉంటున్నాము. మీ జీవితాలలో దేవుని కృపను పొందుకొనేవారుగా మీరు ఉంటున్నారు.

కృపపొందిన మరియ జీవితములో దేవుని చిత్తము జరిగించబడింది, దేవుని ఉద్దేశ్యము నెరవేర్చబడింది. నీవు కూడా కృప పొందుకున్నావు గనుక నీ జీవితములో దేవుని ఉద్దేశ్యము నెరవేరబడుతుంది. కృపపొందిన మరియ జీవితములో శరీరములో, జీవితములో పరిశుద్ధాత్మ శక్తి స్థిరపరచబడింది. ఇప్పుడు ఆ కృపను బట్టి మరియ నామము ఇన్ని సంవత్సరాలవరకు వెల్లడిపరచబడుతుంది.

భానుప్రియ సిస్టర్ కొరకు ప్రాఫెసీ: ఈ సంవత్సరము ఒక నూతన ఆరంభముగా ఉండబోతుంది. ఈ నూతన ఆరంభము ప్రతీ సంవత్సరము జరుగుతుంది.

దేవుని కృపను పొందుకున్న మన అందరి జీవితములలో ఒక నూతన ఆత్మీయ ప్రారంభము ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి కనపరచబడటము మన అందరి జీవితములో ప్రారంభమవుతుంది. అంతకు ముందు ఎప్పుడు జరగినిది మరియ జీవితములో ఆరంభించబడింది. అలాగే మన జీవితములో కూడా జరుగుతుంది.

ప్రభు కోసము నిలబడాలి అనే ఆశ కలిగిన ప్రతీ ఒక్కరినీ వాడుకొనేవాడుగా ఉన్నాడు.

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను- ప్రకటన 21:1

ఈ మినిస్ట్రీ వ్యక్తులు నూతనమైన ప్రదేశములలో ఉండులాగున అనగా విదేశములలో ఉండులాగున ప్రభువు కార్యము చేస్తున్నాడు.

కేరళ సునిల్ బ్రదర్ కొరకు ప్రాఫెసీ: 2024 లో అనేకమైన ప్రాంతములకు నడిపించబడతావు.

ఇక్కడ ఉన్న బిడ్డలను కూడా నూతనమైన ప్రదేశములకు దేవుడు తీసుకువెళుతున్నాడు.

సొంత ఇల్లు లేనివారికి సొంత ఇల్లు దేవుడు అనుగ్రహిస్తున్నాడు.

ప్రదీప్ బ్రదర్ కొరకు ప్రాఫెసీ : సొంత గృహము దేవుడు ఇస్తున్నాడు.

కృప మనలను సంతోషపరచేదిగా ఉంది. 12 నెలలకు 12 ఆశీర్వాదాలు, 12 అద్భుతములు సిద్ధముగా ఉన్నాయి.

సుధ వల్లురి సిస్టర్ కొరకు ప్రాఫెసీ: పర్మనెంట్ స్థలము సిద్ధపరచబడుతుంది.

సుధీర్ బ్రదర్ కొరకు ప్రాఫెసీ: మరొక సారి దేవుని కృప సిద్ధపరచబడుతుంది.

మార్టిన్ బ్రదర్ కొరకు ప్రాఫెసీ: నీ జీవితము, కుటుంబము రెస్టొర్ చేయబడుతుంది.

అశ్విని సిస్టర్ కొరకు ప్రాఫెసీ: 2024 నీ సంతోషమును పరిపూర్ణము చేసే సంవత్సరము

రత్న సుధీర్ బ్రదర్ కొరకు ప్రాఫెసీ : అనాకీయులు హతమార్చబడుతున్నారు. బలముగా నిలబడి ఉన్నది కూల్చివేయబడుతుంది. సౌఖ్యము అనుభవించుదువు.

సుధా చక్రవర్తి సిస్టర్ కొరకు ప్రాఫెసీ: మరియ సమయములో అద్భుతము జరగాల్సింది కానీ మిస్స్ అయింది. అయితే 2024 అద్భుతములు జరిగే సమయము.

అప్పారావు అంకుల్ కొరకు ప్రాఫెసీ: ఆరోగ్యము రెస్టొర్ అవుతుంది. ఆయుష్షు పొడిగించబడుతుంది.

యాకోబు అకుల్ కొరకు ప్రాఫెసీ: సొంత గృహము సిద్ధపరచబడింది. అద్భుతము వెంబడి అద్భుతము జరుగుతుంది.

అరుణ కుమారి సిస్టర్ కొరకు ప్రాఫెసీ: మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. 2023 లో ఉన్న బాధ ఇంక ఉండదు.

దేవి సిస్టర్ గారి సహోదరి కొరకు ప్రాఫెసీ: 2024 లో నీ ఆశ పరిపూర్ణము చేయబడుతుంది. బలమైన పరిస్థితులన్నీ కూలద్రోయబడుతున్నాయి. ఇంక అనాకీయులను చూడవు.

యామిని సిస్టర్ కొరకు ప్రాఫెసీ: అనాకీయులను నీవు ఇంక చూడవు. 2024 పరిపూర్ణమైన యేర్.

అహరోను బ్రదర్ కొరకు ప్రాఫెసీ: నూతనమైన ప్రయాణము నీ జీవితములో ఆరంభించబడుతుంది. దేవుని శక్తి చేత అది స్థిరపరచబడుతుంది.

వీరేంద్ర బ్రదర్ కొరకు ప్రాఫెసీ: ఈ సంవత్సరము వృద్ధి కలుగచేయబడుతుంది.

వేణు సిస్టర్ కొరకు ప్రాఫెసీ: మహాశ్చర్య కార్యములు స్థిరపరచబడతాయి.

శ్రీలత సిస్టర్ కొరకు ప్రాఫెసీ: మేలు చేత నీ హృదయమును తృప్తి పరుస్తాను అని దేవుడు చెప్పుచున్నాడు.

చంద్రశేఖర్ బ్రదర్ కొరకు ప్రాఫెసీ: దేవుని యొక్క కనికరము నీ జీవితములో విడుదల చేయబడుతుంది.

మృదుల సిస్టర్ కొరకు ప్రాఫెసీ: నీ జీవితము ఇంక్రీజ్ అవుతుంది. నీవు బ్లెస్స్ అవుతున్నావు.