30-Oct-2022 – ఆదివారము ఆరాధన – అద్భుతం చూడడానికి

ఆయనే నా సంగీతము

ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే||

స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే||

ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే||

సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||

ఇది జరుగునని

ఇది జరుగునని నేననుకొనని భీకరకార్యములు
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

సంద్రమే రహదారిగా మారాయే మధురముగా
ఆకాశం ఆహారన్నే కురిపించేదిగా (2)
బండయే నీటిని రప్పించేదిగా (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నీటిని ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా
గాలి తుఫానే భయముతో నిమ్మళమవ్వగా(2)
మృతులనే సజీవులయి లేచువారిగా(2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

ఇది జరుగునని నేననుకొనని భీకరకార్యములు
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

అద్భుతముల కొరకు

అద్భుతముల కొరకు ఆశించుచున్నాము
నీకసాధ్యమేదియు లేనె లేదు యేసయ్యా ||2||
యెహోవా యీరే, యెహోవా షాలోం
యెహోవా నిస్సీ, యెహోవా రాఫా ||2||

వాగ్దానములు చేయువాడా – నమ్మదగిన దేవా
వాగ్దానములు నెరవేర్చుటకు – శక్తిగల దేవుడవు ||2||
మాటతప్పని వాడవు – మార్పులేని వాడవు
నిన్న నేడు నిరతము – ఉన్నవాడవు
మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు ||2||
అద్భుతములు చేయును || యెహోవా యీరే ||

సమస్తము సాధ్యము చేయువాడా – సజీవుడైన వాడా
నీళ్ళను ద్రాక్షారసముగ మార్చి – అద్భుతము చేసితివి” ||2||
“అరణ్య యాత్రలో మన్నాతో – ఆకలి తీర్చితివి
బండనుండి నీటి ఊటతో – దాహము తీర్చితివి” ||2||
మహతైన కార్యములు – మహాశ్చర్య కార్యములు… ||2||
అద్భుతములు చేయుము || యెహోవా యీరే ||

చీకటిని ఉదయముగా మార్చు – నీతి సూర్యుడవు
లేనివాటిని ఉన్నట్టుగానె – పిలచు దేవుడవు ||2||
మృతులను సజీవులుగా, చేయు దేవుడవు
సమాధినుండి లాజరును, లేపిన నాధుడవు
మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు ||2||
అద్భుతములు చేయును || యెహోవా యీరే ||

ఆరాధన వర్తమానం

దేవుని సన్నిధిలో ఉండగలుగుట అనేది దేవుడు మనకు ఇచ్చిన ఆధిక్యత. ఆయన మాత్రమే ఘనతనొందుటకు అర్హుడై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడో అనే అనుభవము కలిగి ఉన్నప్పుడు ఆయనను మనము నిజముగా ఆరాధించగలుగుతాము.

సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి. సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి – కీర్తన 98:4-5.

మన శక్తిని ఆధారము చేసుకుంటే కొంచెమే సంతోషము కానీ ఆయనను ఆధారము చేసుకొన్నప్పుడు పూర్ణ సంతోషము అనుభవించ్”యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు అగలుగుతాము. అది కేవలము ఆయన ఏమై ఉన్నాడో అనుభవపూర్వకముగా ఎరిగినప్పుడే అది సాధ్యము అవుతుంది.

యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు…” అని మొదటి వాక్యములో చూడగలము. మరి ఎవరికి ఈ ఆశ్చర్యకార్యములు చేసాడు? నీ జీవితములోనే అనే సత్యము నీవు ఎరగాలి. మన దేవుడి పేరే ఆశ్చర్యకరుడు. ఒక వైద్యుడి దగ్గరకు వెళితే ఆరోగ్యమునకు సంబంధించిన మాటలు, కార్యములు చూడగలుగుతాము. అలాగే ఒక బ్యాంకు అధికారి దగ్గర డబ్బు గూర్చిన విషయాలే మాట్లాడతారు. మరి మన దేవుడు ఆశ్చర్యకరుడు గనుక ఆయన దగ్గర ఆశ్చర్య క్రియలగూర్చియే మాట్లదతారు, ఆశ్చర్య క్రియలే చేస్తారు. దేవుడు పరలోకములో ముగించినదే భూమి మీద స్థిరపరచబడతుంది. కానీ ఎవరైతే ఆ సత్యమును అంగీకరించి స్వీకరిస్తారో, వారి జీవితములో స్థిరపరచబడుతుంది.

అదే మొదటి వాక్యములో, “ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.” అని వ్రాయబడింది. ఈరోజు నీ జీవితములో కావలిసిన విజయము కలుగజేయువాడు మన దేవుడు. ఆయన విజయవంతుడు గనుక ఆయన నామము పేరట నిలబడిన మనకు, నమ్మిన మనకు ఖచ్చితముగా విజయము కలుగజేయబడుతుంది. “కలుగజేయబడుట” అంటే నీ జీవితములో విజయము కలుగుటకొరకై ఏమి జరగాలో, సిద్ధపరచబడాలో అవన్నీ సృష్టించి విజయమును కలిగించుట. మన జీవితములో ఖచ్చితముగా బలము కావాలి. మనము ఉన్న బలహీన పరిస్థితులలో ఆయనే మనకు విజయము కలుగచేయువాడుగా ఉన్నాడు.

యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు – కీర్తన 98:2 అంటే అర్థము ఏమిటి? నీ జీవితములో విజయము కొరకైన ప్రణాళిక గూర్చి వెల్లడిపరిచాడు. ఇప్పుడు నీవు చెయ్యవలసినది విశ్వాసముతో స్వీకరించడమే. అలా స్వీకరించుటలో ఒక విధానము ఆరాధన! మన ఆత్మీయ జీవితానికి, శారీరిక జీవితానికి ఆయనే ఆధారము అయిఉన్నాడు. ఆత్మీయముగా ఎదిగినప్పుడు శారీరకముగా ఖచ్చితముగా ఎదుగుదల ఉంటుంది ఇదే మనకు బయలుపరిచిన మర్మము.

ఒక చిన్న ఇండికేషన్ ఏమిటంటే, ఒక మాట పదే పదే నీదగ్గరకు వస్తుంది అంటే దేవుని ఉద్దేశ్యము నీపై ఉంది. నీ దగ్గరకు వచ్చిన మాటను శ్రద్ధగా నీవు స్వీకరించాలి. 

Worship Song | ఆరాధన గీతం

నాకై అన్ని చేసి ముగించెనేసు యేసు
నాకింకా భయము లేదీసమయములో (2)
నాకై అన్ని చేసి ముగించినందుకు(2)
నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై||

క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)
క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై||

ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదు వేల మందిని కూడా (2)
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2)
యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||

Main Message | మెయిన్ మెసేజ్

అద్భుతము చూడాలి అనుకుంటున్నారా! అయితే ఈరోజు దేవుని మాటలు జాగ్రత్తగా గమనించండి.

గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతనితట్టు తిరిగిబలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా – న్యాయాధిపతులు 6:13,14.

ఇక్కడ గిద్యోను దేవుని కార్యములు చూడలేదు గానీ, కేవలము విన్నవాడుగానే ఉన్నాడు. తన చుట్టు ఉన్నపరిస్థితులు చూస్తే చాలా దయనీయముగా ఉంది.

ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధన మైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయ లేదు. వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.
6 దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి – న్యాయాధిపతులు 6: 2- 6.

అయితే అటువంటి పరిస్థితులలో గిద్యోను తన వద్దకు వచ్చిన దేవుని వాక్కును నమ్మలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, నీవు విన్న ప్రకారము ఇంతవరకు జరగకపోయినా ఇప్పుడు మరలా బలము తెచ్చుకో! ఇప్పుడు ఆ అద్భుతము నీవు చూస్తావు అని చెప్పుచున్నాడు. దేవుని గూర్చిన అనుభవము లేకనే ఇటువంటి అవిశ్వాసము మనలో కలుగుతుంది. అయితే దేవుని వాక్కు మనకు వచ్చినప్పుడు గిద్యోనుకు వచ్చిన ప్రకారముగానే దేవుని అద్భుతము చూడగలిగే అవకాశము వచ్చింది అనే సత్యము మనము గ్రహించాలి. దేవుని ఉద్దేశ్యము ఇశ్రాయేలు ప్రజలను రక్షించడము. దానికొరకు గిద్యోను ఎన్నుకోబడ్డాడు అనే సంగతి అతడు ఎరగలేకపోతున్నాడు. అందుకే తన సందేహాన్ని వెలిబుచ్చాడు. అయితే దేవుని సమాధానము – “ఇప్పుడు నీవు చూస్తావు”. బాలుడైన సమూయేలుకూడా రెండుసార్లు దేవుని స్వరాన్ని గమనించలేకపోయాడు. అయితే మూడవసారి గమనించినవాడై దేవుని స్వరాన్ని వినగలిగాడు. అయితే గిద్యోను తన యొక్క సందేహమును బట్టి కొంత సమయమును వృధా చేసాడు.

అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి? నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను – న్యాయాధిపతులు 6:15,16.

దేవుని అద్భుతాన్ని అనుభవించాలి అంటే సందేహములన్నీ తీసివేయాలి. గిద్యోను “నేను దేని సహాయము చేత ఇశ్రాయేలును రక్షింపగలను?” అని అడుగుతున్నాడు. అయితే ఏంటి, నిన్ను పంపిన వాడను నేను అని ప్రభువు చెప్పుచున్నాడు. అనగా నిన్ను పంపినవాడనే నేను, నీ సహాయము కూడా నేనే.

అందుకు మోషేనేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయు లను ఐగుప్తు లోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడ నని దేవునితో అనగా ఆయననిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను – నిర్గమకాండము 3:11,12.

ఉదయాన కూడా మనము చూసాము, ఆ సారెఫతు గ్రామములో అంతమంది ఉండగా ఆ విధవరాలి ఇంటికే ఎందుకు పంపించబడ్డాడు అని. మోషేను కూడా దేవుడు ఎన్నికచేసుకున్నాడు. మోషే కూడా సందేహాన్ని వెలిబుచ్చినప్పుడు, నేనే నిన్ను పంపితిని అనుటకు ఇదే సూచన అని దేవుడు చెప్పాడు. అలాగే నీ జీవితములో కూడా అద్భుతము చెయ్యాలి అనేదే ఆయన ఉద్దేశ్యము. అయితే ఆ విషయము లో మనము దేవుని వాక్యమును నమ్మగలగాలి. అందుకే దేవుని వాక్యము చెప్పుచున్నది – “చూడక నమ్మినవారు ధన్యులు”. మోషే ఇప్పుడు సామాన్యమైన వ్యక్తి అయి ఉన్నాడు ఫరో దగ్గరకు వెళ్ళడము అనేది సులువైన పని కాదు. అయితే దేవుడు అద్భుతము చేయగలడు అనే అనుభవము లేనంతవరకు అలా అనుకున్నాడు కానీ సూచన చూపించన తరువాత సిద్ధపడ్డాడు.

అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకీలాగు సెలవిచ్చెనునేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు. – యిర్మీయా 1:6-8.

ఈరోజు నిన్ను కూడా ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఆయన నీకు తోడై ఉంటడు.

అప్పుడు మోషేప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను. – నిర్గమకాండము 4:10-12.

మన బలాన్ని బట్టి, అర్హతను బట్టి జరగలేదు కానీ దేవుని చిత్తమును బట్టి జరిగింది. ఏ బలహీనత అయితే మోషే చూపిస్తున్నాడో అదే విషయములో దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పుచున్నాడు. ఒక్క అడుగు నీవు వేయగలిగితే దేవుడు ఖచ్చితముగా నాలుగు అడుగులు నడిపిస్తాడు.

అలాగే గిద్యోను కూడా నేను దేని సహాయము చేత నేను జయించగలను అని అడుగుతున్నాడు. అయితే ఏ విషయములో బలహీనుడో ఆ విషయములో దేవుడు తోడుగా ఉంటాడు.

మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెనుఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచినీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడ వేయుమనుము; అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమ కాజ్ఞా పించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్ప మాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి. నిర్గమకాండము 6:8-11.

మోషే కర్ర పడవేస్తే సర్పముగా మారడము అనే సూచన చూసాడు. ఫరో దగ్గర ఏమీ భయపడకుండానే ఆ క్రియ చేయగలిగాడు. అయితే ఫరో కూడా అలా చెయ్యగలడు అని దేవుడు చెప్పలేదు. అయితే ఆ పరిస్థితిలో మోషే ఎలా ఉండిఉంటాడు? ఖచ్చితముగా భయపడి ఉండాలి. అయితే నీ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు, కానీ సాక్షిగా నిలబెట్టేవాడు. ఫరో మంత్రజ్ఞులు కూడా కర్రలు సర్పములుగా మార్చారు. అంటే అద్భుతము పొందుకోవడానికి మనము ముందుకు అడుగువెయ్యగానే అనేకమైన ఆటంకాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఇంక ముందుగా సిద్ధపరచడము లేదుగానీ, దేవుని మహత్కార్యము కనపరచబడటమే! అహరోను కర్ర మిగతా కర్రలన్నింటినీ మింగివేసెను.

ముందుగా సమాచారము ఉన్నఫ్ఫుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అలాగే ముందుగా నీకు సమాచారము లేనప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు.

“దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను?” అని గిద్యోను అడుగగా, “అయిన నేమి? నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను”. మన జీవితములో కూడా మనము బలహీనులమే అయిననేమి? మనలను ఎన్నిక చేసుకొన్నవాడు ఆయనే గనుక ఆయన తోడుగా ఉంటాడు. విజయము అనుగ్రహించే వరకు కూడా ఏమి చెయాలో, ఎలా చెయ్యాలో దేవుడే చెప్పి నడిపించాడు.

ఈరోజు నిన్ను కూడా ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఆయన నీకు తోడై ఉంటడు.

అప్పుడు మోషేప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను. – నిర్గమకాండము 4:10-12.

మన బలాన్ని బట్టి, అర్హతను బట్టి జరగలేదు కానీ దేవుని చిత్తమును బట్టి జరిగింది. ఏ బలహీనత అయితే మోషే చూపిస్తున్నాడో అదే విషయములో దేవుడు బలాని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఒక్క అడుగు నీవు వేయగలిగితే దేవుడు ఖచ్చితముగా నాలుగు అడుగులు నడిపిస్తాడు.

మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా ఇశ్రాయేలీ యులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని – న్యాయాధిపతులు 6:7,8.

ఇశ్రాయేలును విడుదల చెయ్యడమే దేవుని ఉద్దేశ్యము అందుకే గిద్యోనును ఏర్పరుచుకున్నాడు. నీ జీవితములో అద్భుతము జరుగుట నీ బలము బట్టి కాదు గానీ నీ దేవుని బట్టియే.

నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధ కుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలు చెయ్యలేడు – యోహాను 3:2. అనగా దేవుని తోడులేకుండా అద్భుతములు జరుగవు.

మీరు అమోరీయుల దేశమున నివసించు చున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. న్యాయాధిపతులు 6:10. అద్భుతము చూడాలి అంటే దేవుడు ఏమి చెయ్యవద్దు అను చెప్పుచున్నాడో ఆ విషయాలలో సరిచేసుకోవాలి.