ఆరాధన వర్తమానము
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఏర్పాటు చేసిన దినము దేవుని నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి మనందరినీ సజీవుల లెక్కలో నుంచి ఆయన సన్నిధికి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు ఈ ఆరాధనని ప్రారంభించుకుందాం.
ఈరోజు చాలా శ్రేష్టకరమైన దినం మన జీవితాల్లో. ఈ దినాన్ని చూడడానికి, ఈ దినంలో దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమ పరచడానికి మనల్నిందరినీ కూడా సజీవు లెక్కలు ఉంచిన ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ఆమెన్.
ఈ దినాన్ని క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా ప్రత్యేకమైన దినముగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈస్టర్. నెక్స్ట్ సండే ఈస్టర్. ఈస్టర్ ముందు ఈ దినం పామ్ సండే (మట్టల ఆదివారం) అని ఈరోజు పిలుస్తూ ఉంటారు.
ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు సకల మానవాళి నిమిత్తమై ఆయన సిద్ధపడుతున్నటువంటి దినమైంది. ఈ సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం.
మనము దేవుని స్తుతించడానికి, దేవుని మహిమ పరచడానికి ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. హృదయాన్ని సిద్ధపరుచుకొని దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి రావాలి. సిద్ధపాటు లేకుండా దేవుని ఆరాధన చేయడం అసంపూర్ణంగా ఉంటుంది.
సత్యాన్ని గ్రహించిన వారు మాత్రమే హృదయపూర్వకంగా దేవుని స్తుతించగలుగుతారు. దేవుడు ఏమై ఉన్నాడో అది మనము తెలుసుకున్నప్పుడు, ఆయన కృప ఏ రీతిగా మన జీవితంలో కనపరచబడుతుందో గుర్తించినప్పుడు, నిజంగా హృదయపూర్వకంగా స్తుతించగలుగుతాం.
ఇది వేరే వారి జీవితాలను పరీక్ష చేయడం కాదు — నీ జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు నీకే తెలుస్తుంది. అందుకోసమే ఆరాధన అనేది వ్యక్తిగతమైనది. నీ జీవితంలో ఆయన చేసిన మేలులు, నీ జీవితంలో ఆయన చూపిస్తున్న కృప — వాటిని మీరు పరీక్ష చేసుకుంటేనే గాని ఆయన ప్రేమ ఏంటో తెలియదు.
ఆయన నిత్యము ప్రేమించే వాడే. కానీ ఆ ప్రేమ ఏ రీతిగా నీ యెడల కనపరచబడుతుందో మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు మాత్రమే హృదయపూర్వకమైన ఆరాధన చేయగలుగుతాం.
శారీరకంగా బలహీనపడినా ఆత్మలో మాత్రం దిన దినమూ హెచ్చుతలే ఉండాలి — దేవునికి స్తోత్రం. ఆత్మీయమైన జీవితంలో బలహీనత కనపరచబడకపోవడానికి గల కారణం ఆయన మన యెడల కనపరుస్తున్న ప్రేమ మాత్రమే.
దేవుడు వెంబడించుటలో మనం ఎక్కడ కూడా బలహీనపరచబడకూడదు. దినాలు గతించిపోతున్నాయి — కానీ ఆత్మలో బలవంతులముగా ఉండాలి.
ఎఫెసీయులకు 2:1-2 — మీరు మీ అపరాధములయందును పాపములయందును చనిపోయినవారై యుండగా ఆయన మిమ్మును బ్రదికించెను; వాటియందు మీరు ఒకప్పుడు ఈ లోకపు రీతిని అనుసరించి, అంతరిక్షమునందు అధికారముగలవాని అనగా అవిధేయులైనవారి యందు ఇప్పుడు కార్యసాధకమగు ఆత్మ అధిపతిని అనుసరించి నడుచుకొంటిరి.
మనం మునుపు పాపం వలన చచ్చిన వారమై, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. అయినప్పటికీ కూడా ఆయన తన ప్రేమను మన యెడల కనపరిచాడు.
ఎఫెసీయులకు 2:5 — మనము పాపముల చేత చనిపోయినవారమై యున్నను క్రీస్తుతో కూడ మనలను బ్రదికించెను; కృప చేత మీరు రక్షింపబడియున్నారు.
మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇది మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. మునుపు జీవం లేని జీవితాలు జీవించాం — ఇప్పుడు క్రీస్తు ద్వారా జీవం కలిగిన వారమయ్యాం.
**”నన్ను జీవింపజేశావు — చాలు నాకు.”**
ఆరాధన అంటే ఆయన నామానికి ఘనపరచడం మాత్రమే. ఆరాధన చేసే సమయంలో ప్రార్థన విన్నపాలు చెప్పకూడదు. **ప్రార్థన వేరు — ఆరాధన వేరు.**
ఆరాధన అనేది నీ స్థితిలో ఆయన ప్రేమ ఏ విధంగా కనపరుస్తున్నాడో, దాన్ని ఒప్పుకోవడం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు హృదయం నుంచి ఆరాధన వస్తుంది — కన్నీళ్లు ఆగవు, శరీరం తట్టుకోలేదు. **ఇదే యదార్థమైన ఆరాధన.**
## క్రీస్తు – మన కొరకు బలి
ఆయన మన కొరకు తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు. ఆదిమ దినాలలో ధర్మశాస్త్ర ప్రకారం గొర్రెపిల్ల మీద పాపి చెయ్యి ఉంచినప్పుడు పాపం అక్కడికి బదిలీ అయి జీవం ఇక్కడికి వచ్చేది.
అదే రీతిగా యేసుక్రీస్తు మన కొరకే బలి అయిన గొర్రెపిల్ల. ఆ శరీరాన్ని స్వీకరించినప్పుడు “ఈ శరీరాన్ని బట్టి నేను జీవమై ఉన్నాను” అని నమ్మికతో ఒప్పుకుంటాం.
**ఏమి ఇవ్వగలుగుతాను నీ ఎనలేని ప్రేమకు — విరిగి నలిగిన హృదయమే నిన్ను అర్పించెద.**
## దేవుని పిలుపు – మన ధైర్యం
రోమీయులకు 8:30 — మరియు ఆయన ముందుగా నిర్ణయించినవారిని పిలిచెను; పిలిచినవారిని నీతిమంతులుగా తీర్చెను; నీతిమంతులుగా తీర్చినవారిని మహిమపరచెను.
దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించి పిలిచాడు. ఇతరులతో పోల్చుకొని కృంగిపోకూడదు.
50 మంది గుంపులో నీకంటే ముందు ఉన్నారేమో — కానీ ఆ 50 మందిని పిలిచిన వాడు ఆయనే, అందులో నువ్వు కూడా ఉన్నావు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాడి ఆరంభం కూడా ఇక్కడి నుంచే.
ఈరోజు లాస్ట్ లో ఉన్నావేమో — వన్ డే నీ స్థానం కూడా అదే. **ఆయన నామ మహిమ కొరకై నీ స్థితి మార్చబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.**
- 1️⃣ సిద్ధపాటుతో దేవుని ఆరాధించాలి — హృదయాన్ని సిద్ధపరుచుకొని దేవుని సన్నిధికి రావాలి. సత్యాన్ని గ్రహించి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నప్పుడు మాత్రమే హృదయపూర్వకంగా స్తుతించగలుగుతాం.
- 2️⃣ ఆరాధన అనేది వ్యక్తిగతమైనది — నీ జీవితంలో ఆయన చూపిన మేలులు, కృపను నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడే ఆయన ప్రేమ తెలుస్తుంది. వేరే వారితో పోల్చుకోవడం కాదు — నీ జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకోవడమే అసలైన ఆరాధనకు మొదటి అడుగు.
- 3️⃣ క్రీస్తు మనల్ని జీవింపజేశాడు — మనం పాపం వలన చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఈరోజు మనం జీవంతో ఉన్నాం అంటే అది ఆయన ప్రేమ మాత్రమే. మునుపు ఉన్నట్టు మనం ఇప్పుడు ఉండటానికి లేదు — కృతజ్ఞతా హృదయంతో ఆయనను మహిమ పరచాలి.
- 4️⃣ ఆరాధన మరియు ప్రార్థన వేరు — ఆరాధన చేసే సందర్భంలో విన్నపాలు చెప్పకూడదు. ఆరాధన అనేది ఆయన నామానికి ఘనపరచడం మాత్రమే. ఆయన కృప, ప్రేమను జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఒప్పుకోవడమే నిజమైన ఆరాధన.
- 5️⃣ పిలవబడిన గుంపులో నువ్వు ఉన్నావు — ఇతరులతో పోల్చుకొని నిరాశ పడకూడదు. దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించి పిలిచాడు. ఆయన నామ మహిమ కొరకై నీ స్థితి మార్చబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనను పట్టుకొని వెంబడించే వాడివై ముందుకు సాగు.
—
వారము కొరకైన వాక్యము
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.
ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు చాలా శ్రేష్టకరమైన దినం మన జీవితాల్లో. ఈస్టర్ ముందు ఈ దినం మట్టల ఆదివారం (Palm Sunday) అని పిలుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఎరుషలేములో ప్రవేశించిన ఈ దినం సకల మానవాళి నిమిత్తమై ఆయన సిద్ధపడుతున్నటువంటి దినమైంది. ఈ సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం.
యోహాను 12 – జనసమూహం యేసును ఎదుర్కోవడం
యోహాను 12:12-13 — మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన జనసమూహము యేసు ఎరుషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి “జయము జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక” అని కేకలు వేసిరి.
అక్కడ ఉన్నటువంటి జనాలు యేసుక్రీస్తు ప్రభువు ఎరుషలేములోనికి ప్రవేశించుచున్నాడని విని వారందరూ కూడా ఆయన ఎదుర్కొని పోయారు. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని “హోసన్నా! ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక!” అని కేకలు వేసారు.
లాజరు సాక్ష్యం
యేసుక్రీస్తు ప్రభువు 11వ అధ్యాయం అంతా కూడా ఒక గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఆయన చనిపోవడానికి ముందు ఒక సాదృశ్యంగా లాజరును ఆయన సజీవుడై లేపడం జరిగింది. ఒక మృతమైనటువంటి వాడు తిరిగి సజీవంగా జీవింప చేయబడటం చాలా గొప్ప కార్యముగా ఆ దినాల్లో కనపరచబడతా ఉంది.
మరణము యొక్క అధికారం నుంచి విడుదల చేయగలిగిన వ్యక్తి ఇప్పుడు ఎరుషలేములోనికి వస్తున్నాడు అనగానే వారందరూ కూడా ఆయన ఎదుర్కొనిపోతా ఉన్నారు. ఒక జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ అక్కడ కనపరచబడతా ఉంది.
జకరియా ప్రవచనం – ప్రవచన నెరవేర్పు
జకరియా 9:9 — సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు విధిపడును రక్షణ గలవాడును.
ఈ దినము ప్రవచన నెరవేర్పు దినం. జకరియా ప్రవచించిన రీతిలో ఆ దినము నెరవేర్పు దినముగా ఉంటుంది. వారందరూ కూడా ఒక మరణము పై ఉన్నటువంటి అధికారమును గ్రహించిన వారుగా ఉంటున్నారు.
మత్తయి 21 – గాడిద పిల్ల
ప్రభువు శిష్యులను పంపడం
మత్తయి 21:1-3 — తరువాత ఎరుషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పకేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి:“మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి; వెళ్ళగానే కట్టబడియున్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును; వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి.
ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల ‘అవి ప్రభువునకు కావలసినవని’ చెప్పవలెను; వెంటనే అతడు వాటిని తోలుపెట్టెనని చెప్పి వారిని పంపెను.”
మత్తయి 21:4-5 — **ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను.**
గాడిద పిల్ల – ఆధ్యాత్మిక సందేశం
1. కట్టబడిన జీవితం – బంధకత్వం
గాడిద కట్టబడి ఉంది — బంధించబడిన జీవితానికి చిహ్నం. ఈ గాడిద ఎంతటివి తినగలిగే శక్తి కలిగి ఉన్నా, ఎలా నడచగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నా — కట్టబడిపోయి ఉన్న సందర్భాల్లో దానికి తినాలని ఆశ ఉంది, ఆకలి తీర్చుకోవాలన్న శక్తి ఉన్నా గాని తీర్చలేని పరిస్థితి.
ఎందుకంటే కట్టబడింది. కట్టబడ్డ జీవితం భయంకరమైన జీవితం, ఎటువంటి ఆశ నెరవేరలేనటువంటి జీవితం.
గాడిద అనేది లోకంలో చాలా తృణీకరించబడినదిగా ఉంటా ఉంది. అటువంటి దానికి ప్రవచనంలో పాలుపంపులు జరుగుతూ వచ్చాయి. ఒక గాడిద పిల్లకు కూడా ఒక ప్రవచనము ప్రభువు చేత ప్రకటించబడుతుంది. దేవుని దృష్టిలో ప్రతి ఒక్క విషయము కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటుంది.
మనం కూడా పాపంలో బంధించబడ్డవారమై ఉన్నాం. కానీ తృణీకరించబడినది కూడా దేవుని దృష్టిలో ప్రత్యేకం.
2. విడుదల – ప్రభువుకు కావలసినది
“ఇది ప్రభువుకు కావలసినది” — ఇది గాడిద యజమానికి చెప్పమంటున్నాడు.
ప్రభువుకు కావలసిన సమయం వచ్చింది కాబట్టే విడుదల జరిగింది. గాడిద విడుదల కావడానికి గల కారణం ఏమై ఉంది? ప్రభువుకు కావలసిన సమయం, ప్రభువుకి అవసరమైన సమయం.
రెండు శిష్యులు – రెండు సొల్యూషన్స్
ప్రభువు దాన్ని విడుదల చేయడాని కొరకు రెండు శిష్యులను పంపించాడు — రెండు సొల్యూషన్స్ కచ్చితంగా నిన్ను సంతోషింపజేస్తాయి.
ఎక్కడైతే బంధించబడిపోయి నీ జీవితము విడుదల రాకుండా, రానివ్వకుండా ఏవైతే అడ్డుగా ఆటంకాలుగా ఉంటున్నావో దానినుంచి విడుదల చేయగల శక్తి దేవుడు ఏర్పాటు చేసిన ఆ రెండు సొల్యూషన్స్ లో ఖచ్చితంగా ఉంటాయి.
3. ఉద్దేశం – ప్రభువు మహిమ కొరకు
విడుదల అయిన తర్వాత ఏమైంది? గాడిద పిల్ల మీద ప్రభువు ఎక్కడం జరిగింది. ఆయన ఎరుషలేం వీధులన్నీ సంచరించాడు.
ఎందుకు తిరుగుతూ వచ్చాడు? ప్రభువు మహిమ కొరకు ఉపయోగపడడం. గాడిద పిల్ల విడుదల అయింది — కానీ లోకాన్ని ఎంజాయ్ చేయడానికి కాదు. ప్రభువును క్యారీ చేసే ఉద్దేశం కొరకే విడుదల జరిగింది.
మనకు ఉన్న సందేశం
గాడిద కొరకు ప్రవచనం ఉంది – మన కొరకు కూడా
గాడిద విషయంలో ప్రభువు మాట్లాడుతుంది ఏంటంటే మన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితాలు కూడా ఆయన సృష్టించినటువంటి జీవితాలుగానే ఉంటున్నాయి. మన జీవితానికి కూడా దేవుని యొక్క ప్రవచనం ఉంది.
మన జీవితాలు ఎంత హీనంగా ఉన్నప్పటికీ, నిషేధించబడ్డప్పటికీ, తృణీకరించబడ్డప్పటికీ కూడా మన జీవితాల కొరకు ఆయన వాక్కు విడుదల అయింది.
సత్యం గ్రహించడం – నాలుగు ముఖ్య సత్యాలు
1. విడుదల నిశ్చయం — ఏ పరిస్థితిలో ఉన్నా సరే, దేని చేత బంధించబడినా సరే విడుదల అనేది నిశ్చయం.
2. సమయం నిర్ణయించబడింది — దానికి సమయం కూడా ఆయన నిర్ణయించాడు. దేవుని సమయంలో విడుదల జరుగుతుంది.
3. సొల్యూషన్స్ సిద్ధం — రెండు మార్గాలు పంపబడతాయి. నీ సమస్యకు దేవుడు పరిష్కారం సిద్ధం చేసాడు.
4. ప్రభువు మహిమ కొరకు — విడుదల ఉద్దేశం ప్రభువు మహిమ కొరకు. లోకం కొరకు కాదు. “ప్రభువునకు కావలసినది” — ఈ మాట మనం గుర్తుంచుకోవాలి.
సమర్పించబడిన జీవితం
“ఇక జీవించువాడను నేను కాదు”
విడుదల తర్వాత మనం ఎలా జీవించాలి?
“ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తా ఉన్నాడు.” సంపూర్ణ సమర్పణ కావాలి. కేవలం ఆరాధన కాదు — పూర్తి హృదయ సమర్పణ.
హెచ్చరిక – లోకం వైపు చూడకూడదు
విప్పబడిన తర్వాత లోకం వైపు చూడకూడదు. ఒకవేళ విడుదల అయిన తర్వాత లోకం వైపు చూస్తే మళ్ళీ కట్టబడే ప్రమాదం ఉంది.
గాడిది పిల్ల విడుదల అయిన తర్వాత ప్రభువును క్యారీ చేసింది — లోకాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు. అదే రీతిగా ప్రభువు కొరకు మాత్రమే జీవించాలి.
ఎరుషలేములోని ప్రజల ఉదాహరణ
ఎరుషలేములో ప్రజలు లాజరు జీవితంలో జరిగిన కార్యం చూశారు. కానీ సత్యం గ్రహించలేదు — వారి స్వంత జీవితాల గురించి. 5 రోజుల తర్వాత అదే ప్రజలు “సిలువ వేయము! సిలువ వేయము!” అన్నారు.
కారణం ఏమిటి? సత్యం స్థిరపరచబడలేదు. వారి హృదయాల్లో పూర్తి సమర్పణ లేదు.
తరతరాల ఆశీర్వాదం
గాడిద మరియు గాడిద పిల్ల – రెండు తరాలు
రెండూ విడుదల చేయబడ్డాయి — గాడిద మరియు గాడిద పిల్ల.
ఇది రెండు తరాలను సూచిస్తుంది:
∙ ఫస్ట్ జనరేషన్: కట్టబడిన తరం → విడుదల పొందిన తరం
∙ సెకండ్ జనరేషన్: విడుదల పొందిన తరం → ఆశీర్వదించబడిన తరం
అబ్రాహాము మాదిరి
అబ్రాహాము నడక చూడండి:
∙ అబ్రాహాము: విశ్వాసంతో నడిచాడు
∙ ఇస్సాకు: తండ్రి నడక వల్ల ఆశీర్వాదం
∙ యాకోబు: తాత నడక వల్ల ఆశీర్వాదం
∙ తరతరాల ఆశీర్వాదం కొనసాగుతుంది
సందేశం: మన నడక మన తరువాతి తరాలను ప్రభావితం చేస్తుంది. నీ విడుదల నీ కుటుంబానికి మాత్రమే కాదు — నీ తరువాత తరానికి కూడా ఆశీర్వాదం.
నివాసం మరియు సంచరణ
2 కోరింథీయులు 6:16
2 కోరింథీయులు 6:16 — మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము… **నేను వారిలో నివసించి సంచరింతును,** నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలైయుందురు.
గాడిది పిల్ల మీద ఎక్కి ఆయన ఎరుషలేం వీథులన్నిటిలో సంచరించాడు. ఎందుకు?
ప్రభువు మనలో:
1. నివాసం: దేవుడు మనలో నివసిస్తున్నాడు. మన హృదయాలు ఆయన ఆలయం.
2. సంచరణ: మన ద్వారా పనిచేస్తున్నాడు. మన జీవితంలో సంచరిస్తాడు.
3. ఉద్దేశం: ఎరుషలేం వీథుల్లో తిరిగినట్లు — లోకానికి వెలుగు, అందరికీ కనబడే సాక్ష్యం.
దీపస్తంభం మీద దీపం
ఉన్నత స్థానం
గాడిది పిల్ల యేసుక్రీస్తును క్యారీ చేసి ఎల్ల వీధులలోను తిరిగింది. అందరూ చూచే విధంగా ఉన్నత స్థానంలో ప్రభువును క్యారీ చేసింది.
కట్టబడిన స్థితి → విడుదల → ఉన్నత స్థానం — ఇదే మన ప్రయాణం.
దీపాన్ని దీపస్తంభం మీద పెట్టినట్లుగా
మన జీవితం అందరికీ కనబడే విధంగా ప్రభువును క్యారీ చేయాలి:
∙ చీకటిని పారద్రోలడం
∙ సాక్ష్యం ఇవ్వడం
∙ ఇతరులను రక్షించడం
∙ ప్రభువు మహిమను ప్రపంచానికి చూపడం
ప్రవచన నెరవేర్పు నీలో
ఎప్పుడు నెరవేరుతుంది?
1. సత్యం గ్రహించినప్పుడు:
∙ ప్రభువు నా కొరకే వచ్చాడు
∙ మరణం నుండి విడుదల నాకు ఇచ్చాడు
∙ ప్రభువు మహిమ కొరకు నేను సృష్టించబడ్డాను
2. సంతోషం:
“సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి”
రెండు సొల్యూషన్స్ రావడం వల్ల సంతోషం. ప్రవచనం నెరవేరుతుందని తెలిసి ఆనందం.
3. హృదయ సమర్పణ:
∙ ప్రజలు బట్టలు పరిచారు — బాహ్యం
∙ కానీ హృదయాన్ని సమర్పించాలి — అంతరంగం
∙ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో
హోసన్నా – స్తుతి
ప్రజల ప్రతిస్పందన
ప్రజలు కేకలు వేశారు:
∙ “హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడు!”
∙ “దేవుని నామము ఉన్నత నామము!”
∙ “కృతజ్ఞత స్తుతులు నీకే!”
పూర్ణ హృదయంతో స్తుతించారు.
మన స్తుతి
సత్యాన్ని గ్రహించిన వారంగా:
∙ హృదయం ఉప్పొంగుతుంది
∙ సంతోషంగా ఉంటాము
∙ ఆయన మహిమకు అర్హుడు
∙ పూర్ణ ఆత్మతో ఆయనను స్తుతిస్తాము
ముగింపు సారాంశం
- 1️⃣ కట్టబడిన జీవితం → విడుదల నిశ్చయం — ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకత్వంలో ఉన్నా, ప్రభువుకు కావలసిన సమయం వచ్చినప్పుడు విడుదల జరుగుతుంది. రెండు సొల్యూషన్స్ సిద్ధంగా ఉన్నాయి.
- 2️⃣ విడుదల ఉద్దేశం – ప్రభువు మహిమ కొరకు — లోకం కొరకు కాదు, ప్రభువు మహిమ కొరకు మాత్రమే. “ప్రభువునకు కావలసినది” అన్న మాట మనం గుర్తుంచుకోవాలి.
- 3️⃣ సంపూర్ణ హృదయ సమర్పణ — కేవలం ఆరాధన కాదు, పూర్తి సమర్పణ కావాలి. “ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తా ఉన్నాడు.” విడుదల తర్వాత లోకం వైపు చూడకూడదు — మళ్ళీ కట్టబడే ప్రమాదం.
- 4️⃣ తరతరాల ఆశీర్వాదం — గాడిద మరియు పిల్ల = రెండు తరాలు. నీ విడుదల నీ మాత్రమే కాదు, నీ తరువాత తరాన్ని కూడా ఆశీర్వదిస్తుంది. మన నడక మన తరువాతి తరాలను ప్రభావితం చేస్తుంది.
- 5️⃣ నివాసం మరియు సంచరణ — ప్రభువు మనలో నివసిస్తాడు, మన జీవితంలో సంచరిస్తాడు. ఎల్ల వీథులలో = అందరికీ కనబడే సాక్ష్యం జీవితం. లోకానికి వెలుగు.
- 6️⃣ ఉన్నత స్థానం – దీపస్తంభం మీద దీపం — కట్టబడిన స్థితి → విడుదల → ఉన్నత స్థానం. గాడిది పిల్ల ప్రభువును ఉన్నత స్థానంలో క్యారీ చేసింది. మన జీవితం కూడా దీపస్తంభం మీద దీపంలా అందరికీ కనబడాలి.
- 7️⃣ ప్రవచన నెరవేర్పులో సంతోషం — “సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి.” నీ జీవితానికి ప్రవచనం ఉంది. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆ ప్రవచనం నెరవేరే సమయం వచ్చినప్పుడు సంతోషించు.
- 8️⃣ సత్యం స్థిరపరచుకోవాలి — ఎరుషలేములో ప్రజలు లాజరు సాక్ష్యం చూశారు కానీ సత్యం గ్రహించలేదు. 5 రోజుల తర్వాత “సిలువ వేయము” అన్నారు. మనం సత్యాన్ని గ్రహించి, స్థిరపరచుకొని, పూర్ణ హృదయంతో ప్రభువును సేవించాలి.
