29-01-2023 ఆదివారం మొదటి ఆరాధన – దేవుని బట్టి నిలబడు

నిన్ను స్తుతియించుట నాకు ఆనందము

నిన్ను స్తుతియించుట నాకు ఆనందము

నాలోని ఆశ నాలోని కోరికా

నాలోని ఆశ నాలోని కోరికా
నిన్ను చూడాలని
నాలోని ఆశ నాలోని కోరికా
నిన్నుచేరాలని
దేవా…. యేసయ్యా నిన్న చూడాలని….
దేవా…. యేసయ్యా నిన్న చేరాలని

జెసుస్ ఇ వంత్ తొ వొర్షిప్ యౌ హాల్లెలూయ
జెసుస్ ఇ వంత్ తొ ప్రైసె యౌ లొర్ద్ “2”
మ్య్ జెసుస్ ఇ వంత్ తొ సీ యౌ “2” ఫొరెవెర్ “2”
“నాలోని”
శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా
వేదనలో నేను కృంగిన లేవనెత్తెను నీ చేయి “2”
ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా
తరతరాలు మారినా మారని దేవుడా ఆ…. ఆ …. ఆ
“జెసుస్”
విరిగినలిగిన మనసుతో నీ దరిచేరితి యేసయ్యా
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా “2”
నా తుది శ్వాసవరకూ దేవా నిన్నే కీర్తింతును
నా బ్రతుకు దినములన్నీ నిన్నే పూజింతును

నా ప్రాణమా.. నీకే వందనం

నా ప్రాణమా.. నీకే వందనం
నా స్నేహమా.. నీకే స్తోత్రము (2)
నినునే క్రీర్తింతును మనసారా థ్యానింతును (2)

హాల్లెలూయ హాల్లెలూయ హాల్లెలూయ
హాల్లెలూయ హాల్లెలూయ నా యేసయ్య
|| నా ప్రాణమా||

సర్వ భూమికి మహరాజా – నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా – నీవే పరిశుద్దుడా (2)
సమస్తభుజనుల స్తొత్రములపై ఆసీనుడా (2)
మోకరిచి ప్రణుతింతును (2)

|| హాల్లెలూయ హాల్లెలూయ ||

మహిమ గలిగిన లోకములో – నీవే రారాజువు
నీ మహిమతో నను నింపిన – సర్వశక్తుడవు (2)
వేవేల దుతలతో పొగడబడుతున్న ఆరాధ్యుడా (2)
మోకరిచి ప్రణుతింతును(2)
|| హాల్లెలూయ హాల్లెలూయ ||
|| నా ప్రాణమా||

ఆరాధన వర్తమానం

మనలను దేవుని సన్నిధిలోని ఉంచిన దేవుని కృపకై స్తోత్రములు. ఈ దినము ఆయనను స్తుతించి మహిమ పరచే దినము. మన ఆత్మీయ జీవితాలు మెరుగుపరచబడాలి, వృద్ధిలోనికి తీసుకురాబడాలి. పాటలు, ఆరాధన అవసరములేదు వాక్యము సమయానికి వెళితే సరిపోతుంది అనుకుంటాము. వాక్యము ఒక విత్తనము అనుకోండి, ఆ విత్తనము ఎలా పెరుగుతుంది? మొదట భూమి దున్నబడాలి, నీరు అందించబడాలి ఆ తరవాత విత్తనము వేస్తారు. అలాగే వాక్యము ఫలించాలి అంటే మొదట నీ హృదయము సిద్ధపరచబడాలి. ఆదివారము ఆయనను ఆరాధించేవారు, మరిముఖ్యముగా ఆన్లైన్ సర్వీస్ లో ఆయనను ఆరాధించేవారు, చర్చ్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో అంతే భక్తి శ్రద్ధలతో ఉండాలి. మనము భయంకరమైన చివరి దినాలలో ఉన్నాము.

దేవుని పాటలు నీ హృదయాన్ని దున్నుతాయి. ఆరాధన నీరు కడుతుంది. అప్పుడు నీవు వినే వాక్యము లోతుగా నాటబడి శత్రువు ఎత్తుకుపోకుండా కాపాడబడుతుంది.

కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము. – రోమా 5:1-2

యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాలలో లేకపోతే మన జీవితాలు వ్యర్థము. అందుకే ఎప్పుడు ఆయనను కలిగి ఉండుటకే ప్రయాసపడాలి. కృప యేసు క్రీస్తు ద్వారా మాత్రమే అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుయే శ్రేష్టమైన వాడుగా మనము జీవించాలి.

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము – రోమా 5:8-9

దేవుడు తన ప్రేమను నీ యెడల వెల్లడిపరచుచున్నాడు. నీవు ఆ ప్రేమను రుచి చూసినట్టయితే నీవు ఖచ్చితముగా సిద్ధపడతావు. రోమా 5:8 లో మనము చూసిన మాటలు కేవలము మనము మొదట రక్షించబడిన స్థితికొరకైన మాటలుమాత్రమే కాదు. ఈ లోకములో ఏదీ కుడా నిన్ను కాపాడలేదు. కేవలము యేసుక్రీస్తు మాత్రమే నిన్ను కాపాడగలిగిన వాడు. నీవు పాపిగా ఉన్నప్పుడు నిన్ను యేసు రక్తము ద్వారా పాపమునుండి రక్షించిన దేవుడు ఇప్పుడుకూడా నిన్ను ప్రేమించి యేసుక్రీస్తు ద్వారా తన కృప అనుగ్రహించి నిన్ను రక్షిస్తున్నాడు.

యేసయ్యతో నీవు ఉన్నప్పుడు ఎటువంటి ఉగ్రత గుండా నీవు వెళుతున్నప్పటికీ ఆ ఉగ్రతనుండి తప్పించి నిన్ను సంతోషపరుస్తాడు. మనుష్యులకు అసాధ్యమే కానీ నీవు ఆరాధిస్తున్న నీన్ను ప్రేమిస్తున్న నీ దేవునికి సమస్తము సాధ్యమే.

“భయము” అనేది చాలా శక్తికలిగినది. నాశనకరమైన స్థితిలోనికి జారిపోవడానికి ఈ భయము ఒక కారణము. అందుకే దేవుడు కూడా “భయపడకు” అని అనేకసార్లు చెప్పారు. ఆయన నిన్ను ప్రేమించేవాడు గనుక నిన్ను తప్పిస్తాడు, అదే నీ ధన్యత.

యేసయ్య మార్గమై ఉన్నాడు. దేనికి మార్గము? “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను. – యోహాను 5:24”. మనము పాపులగా ఉన్నప్పుడు రక్షణకు మార్గముగా ఉన్నాడు. మన పాపమును బట్టి నరకములోనికి వెళ్ళాలి, అయితే ఆయనను మార్గముగా కలిగి నిత్యజీవము లోనికి వెళ్ళాము. అంటే మరణము లోనుండి జీవములోనికి వెళ్ళగలుగుటకు యేసయ్యే మార్గము. మరణపు స్థితి అనగా నీవు సంతోషముగా ఉండలేని స్థితి అది ఏదైనా సరే, ఆ మరణపు స్థితి నుండి, జీవము లోనికి అనగా నీవు సంతోషించే స్థితిలోనికి రాగలుగుటకు యేసయ్యే మార్గము.

ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము – రోమా 5:10.

యేసయ్య మరణము ద్వారా నీవు పాపమునుండి తప్పించబడి నరకమునుండి తప్పించబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నావు. ఇప్పుడు యేసయ్య జీవించుటచేత నీ జీవితములో నీవు వెళ్ళే పరిస్థితులలో ఆయన క్రియలు కనపరచబడి, నీవు ఖచ్చితముగా తప్పించబడతావు.

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను – కీర్తన 50:23

 

ఆరాధన గీతము

నాప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా..
నాప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా..
ఆకలితో నే అలమటించినప్పుడు అక్కరనెరిగి ఆదుకున్నావు//2//
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా//నాప్రతిఅవసరము//

ఊహించలేని ఆశ్చర్యకార్యములతో ఏ కొదువలేక నను కాచుచుంటివి//2//
కష్టాలెన్నివచ్చినా కరువులెన్నికలిగినా–నీచేతి నీడ ఎప్పుడు నను దాటిపోదు
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా//నాప్రతిఅవసర//

తప్పిపోయినా త్రోవమరచిన…నీ కృప నన్ను విడచివెళ్ళదు.. //2//
నీకృప…విడచివెళ్ళదు… //2//ననుఎప్పుడూ… యేసయ్యా..

నా ప్రతి విన్నపం నీ చెంతచేరును యేసయ్యా(యేసయ్యా)
నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్య (యేసయ్యా)//2//
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా
ఏమివ్వగలను ఎనలేనిప్రేమకై యేసయ్యా..వందనము

నీ ముందు ఉన్న యేసయ్యతో, మనసారా చెప్తావా? “నాప్రతి అవసరము తీర్చువాడవు నీవే” అని?

నీవు ఏ వేదన కలిగి ఉన్నాసరే, ఏ శోధన కలిగి ఉన్నాసరే, “నా ప్రతి శోధన తీసివేయువాడవు నీవే, నా ప్రతి వేదన తొలగించువాడవు నీవే యేసయ్యా” అని నీ ముందున్న నీ యేసయ్య తో చెప్పు మనఃస్పూర్తిగా

వాగ్దానము నెరవేర్చబడాలి అని నీవు ఆశపడితే, “నా ప్రతీ వాగ్దానము నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, నా అవిశ్వాసము తొలగించువాడవు నీవే యేసయ్యా” అని గొంతెత్తి విశ్వాసముతో ప్రకటించు

నేను నీకు తోడై ఉన్నాను అని నీ దేవుడు చెప్తున్నాడు. నీకు రాజ్యము అనుగ్రహించడానికి నీ తండ్రికి ఇష్టమై ఉన్నది భయపడకు

Main message| మెయిన్ మెసేజ్

దేవునిని బట్టి నిలబడు. అపవాది మనలను పడగొట్టడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. సంఘమును పాడుచెయ్యడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంది. ఆత్మీయ జీవితం పోగొట్టడానికి, శరీరము మరణము ద్వారా నాశనము చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.

మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి – నిర్గమకాండము 32:1

“మోషే కొండ దిగకుండా తడవు చేయుట” అనగా ఆలస్యము అగుతున్న పరిస్థితులలో ఈ ఉచ్చు బిగించబడింది. నీ జీవితములో “ఇంకెంత కాలము” అనే ప్రశ్న ఉంటే, అపవాది ఉచ్చులో పడే ప్రమాదం పొంచివున్నట్టే.

నిజానికి మనము నిర్గమకాండములో సందర్భము చూస్తే, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచిమేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని చెప్పెను – నిర్గమకాండము 24:13-14. నీ జీవితములో కూడా కొన్ని దినాలుగా, సంవత్సరాలుగా నీవు అడుగుతున్న విషయము ఆలస్యము అవుతున్న దానిని బట్టి, “ఇంకెంతకాలము?” అనే ప్రశ్న నీలో వస్తుందా? అసలు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? ఇశ్రాయేలు ప్రజలను చూస్తే, మోషే లేకపోయినప్పటికీ, అహరోను హూరులు ఉన్నారు. అయితే అసలు మోషే ఎందుకు వెళ్ళాడు అనే సంగతి వారికి అర్థము కాలేదు. మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాడు అనే సంగతి అర్థంచేసుకోలేని వారుగా ఉన్నారు. నీ పరిస్థితిలో కూడా నీవు ప్రార్థన చేస్తున్నావు ఒక విషయము గురించి. అది ఆలస్యమైనా దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. నీకు కూడా దేవుని ఉద్దేశ్యము అర్థముకాక, నీవు విసుగు వస్తుందేమో? మోషే ఎప్పుడు దేవుని దగ్గరగా వెళ్ళినాకూడా ఇశ్రాయేలు ప్రజలే ఆశీర్వదించబడ్డారు.

యవ్వనస్థులను గమనిస్తే, రక్షణ పొందిన కాలములో ప్రభువా ప్రభువా అనే ఆశ కలిగి ఉంటారు. అదే వారు ఆశించది జరగనప్పుడు, కొంచెము కొంచెము ఉచ్చులు బిగుసుకుంటాయి. ఇంతవరకు దేవునికి ఇచ్చిన స్థానము వేరే వేరే వాటికి వేరే మనుష్యులకు ఇచ్చేస్తారు. “దేవుని అర్థము చేసుకున్నట్టయితే” జాగ్రత్తపడగలుగుతావు.

నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, – రోమా 4:18.

అపవాదికి అవకాశము దొరికితే దేవునికి ఆయన మాటకు వ్యతిరేకముగా మనము చేయులాగున ఆలోచనలు పుట్టించి ఆ ప్రకారముగా చేయుటకు ప్రేరేపిస్తాడు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అపవాది ఉచ్చులో పడకుండా నీవు ఉండాలి అంటే, “ఇంకెంత కాలము” అనే ప్రశ్న వచ్చిన ప్రతిసారీ, దేవుని వాగ్దానమును సందేహించని విశ్వాసము నీవు కలిగి ఉండాలి.

శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది – రోమా 8:5

ఆలస్యమైన పరిస్థితులలో ఆత్మానుసారముగా నీ ఆలోచన ఉంటే నీవు దేవుని వాగ్దానమును విశ్వసించి నిరీక్షించగలుగుతావు. అదే నీవు శరీరానుసారుడుగా ఉంటే, విశ్వాసము లేనివాడవై అపవాది ప్రేరేపణకు లొంగిపోయి పడిపోతావు.

అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను – రోమా 4:20-21

ఆలస్యమైన పరిస్థితులలో దేవుని వాగ్దానమును సందేహించక మరిముఖ్యముగా దేవుని వాగ్దానమును సందేహించే పరిస్థితులలో, దేవా వాగ్దానము చేసినవాడవు, నమ్మదగినవాడవు, దానిని నెరవేర్చుటకు సమర్థుడవు అని మహిమపరచాలి.

మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు – రోమా 8:13.

నెగటివ్ ఆలోచనలు ఆగిపోవాలి అంటే దేవుని స్తుతించాలి. మోషే కొండమీద ఆలస్యము చేసినప్పుడు ఆ ఉద్దేశ్యాన్ని అర్థము చేసుకోలేదు. చివరికి మోషే కొండమీదనుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జీవముకలిగించే మాటలు కలిగిన పలకలు తీసుకుని వచ్చాడు. వారు గనుక మోషే దేవుని దగ్గరకు వెళ్ళాడు, ఆలస్యమైనా సరే మేము ఆశీర్వదించబడటానికే ఎదో ఒకటి తీసుకొస్తున్నాడు అనే సంగతి ఎరిగి ఉంటే, అపవాది అలోచనలకి అవకాశమే ఇచ్చేవారు కాదు. మనము కూడా ఆలస్యమైనా సరే సందేహించవద్దు, వాగ్దానము ఇచ్చినవాడిని నమ్మి మహిమపరచి నిలబడదాము.