28-Dec-2022 – క్రిస్మస్ పరిచర్య – లక్ష్మీ పోలవరం

క్రిస్మస్ పాటలు

స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా

స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి||

గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు
వ్యధలన్ని తీర్చావు (2)
గతి లేని మాపై నీవు
మితిలేని ప్రేమ చూపి (2)
శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి||

కరుణా కటాక్షములను కిరీటములగాను
ఉంచావు మా తలపై (2)
పక్షి రాజు యవ్వనమువలె
మా యవ్వనమునంతా (2)
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు ||స్తుతించి||

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2) ||తార||

మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార||

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే ||తార||

ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో

ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
“దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” //ఆనంద//

1. ప్రభువొచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను
మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను
” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” //ఆనంద//

2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి
” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” //ఆనంద//

3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను
” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” //ఆనంద//

బెత్లహేములోనంట – సందడి

బెత్లహేములోనంట – సందడి
పశువుల పాకలో – సందడి
దూతలు వచ్చేనంట – సందడి
పాటలు పాడేనంట – సందడి /2/
రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి /2/
చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి /2/

Happy Happy..
Happy Happy Christmas Christmas
Wish you a Happy Christmas
Merry Merry Christmas Christmas
Wish you a Merry Christmas

అర్దరాత్రి వేళలో – సందడి
దూతలు వచ్చేనంట – సందడి
రక్షకుడు పుట్టేనని – సందడి
వార్తను తెలిపేనంట – సందడి /2/
రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి /2/
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే!

Happy Happy..
Happy Happy Christmas Christmas
Wish you a Happy Christmas
Merry Merry Christmas Christmas
Wish you a Merry Christmas

గొల్లలు వచ్చిరంట సందడి
మనసార మొక్కిరంట సందడి
అందాల బాలుడంట – సందడి
అందరి దేవుడని – సందడి /2/
రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి /2/
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి /2/

Happy Happy..
Happy Happy Christmas Christmas
Wish you a Happy Christmas
Merry Merry Christmas Christmas
Wish you a Merry Christmas

తారను చూచుటకు – సందడి
జ్ఞానులు వచ్చిరంట – సందడి
పెట్టెలు తెచ్చారంట – సందడి
కానుకలిచ్చారంట – సందడి /2/
రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి /2/
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి /2/

Happy Happy..
Happy Happy Christmas Christmas
Wish you a Happy Christmas
Merry Merry Christmas Christmas
Wish you a Merry Christmas

బేత్లెహేములో సందడి – పశుల పాకలో సందడి

బేత్లెహేములో సందడి – పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని – మహారాజు పుట్టాడని /బేత్లెహేములో/

1.ఆకాశములో సందడి – చుక్కలలో సందడి /2/
వెలుగులతో సందడి – మిలమిల మెరిసే సందడి /2/బేత్లె/

2.దూతల పాటలతో సందడి – సమాధాన వార్తతో సందడి /2/
గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి/2/బేత్లె/

3.దావిదు పురములో సందడి – రక్షకుని వార్తతో సందడి /2/
జ్ఞానుల రాకతో సందడి – లోకమంతా సందడి /2/బేత్లె/

Joy to the world, the Lord is come

Joy to the world, the Lord is come
Let Earth receive her King
Let every heart prepare Him room
And Heaven and nature sing
And Heaven and nature sing
And Heaven, and Heaven, and nature sing

Joy to the Earth, the Savior reigns
Let all their songs employ
While fields and floods, rocks, hills and plains
Repeat the sounding joy
Repeat the sounding joy
Repeat, repeat, the sounding joy

He rules the world with truth and grace
And makes the nations prove
The glories of His righteousness
And wonders of His love
And wonders of His love
And wonders, wonders, of His love

Joy to the world, the Lord is come
Let Earth receive her King
Let every heart prepare Him room
And Heaven and nature sing
(And Heaven and nature sing)
And Heaven and nature sing
(And Heaven and nature sing)
And Heaven, and Heaven, and nature sing
And Heaven, and Heaven, and nature sing

Joy to the world, the Lord is come
Let Earth receive her King
Let every heart prepare Him room
And Heaven and nature sing
(And Heaven and nature sing)
And Heaven and nature sing
(And Heaven and nature sing)
And Heaven, and Heaven, and nature sing
And Heaven, and Heaven, and nature sing

నింగిని నేలను ఏకము చేసిన పండుగ

నింగిని నేలను ఏకము చేసిన పండుగ
నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ

అ.ప. : క్రిస్మస్‌ హాపీ క్రిస్మస్‌ క్రిస్మస్‌ మెర్రీ క్రిస్మస్‌

జ్ఞానుల జ్ఞానము వ్యర్ధము చేసిన పండుగ
రాజుల గుండెలో అలజడి రేపిన పండుగ
క్రిస్మస్‌ హాపీ క్రిస్మస్‌ క్రిస్మస్‌ మెర్రీ క్రిస్మస్‌

దీనుల ప్రార్థనకు ఫలముగ వచ్చిన పండుగ
పాపుల కోసము రక్షణ తెచ్చిన పండుగ
క్రిస్మస్‌ హాపీ క్రిస్మస్‌ క్రిస్మస్‌ మెర్రీ క్రిస్మస్‌

యూదుల కలలన్నీ నిజముగ మార్చిన పండుగ
బాధల బ్రతుకులలో నెమ్మది కూర్చిన పండుగ
క్రిస్మస్‌ హాపీ క్రిస్మస్‌ క్రిస్మస్‌ మెర్రీ క్రిస్మస్‌

రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను

“రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2)
రాజులకు రా రాజు మెస్సియ (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారె||

1.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగెనీ దినమున (2)
||రారె||
2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం (2)
తెల్లగానది తేజరిల్లెడి (2)
తారగాంచరే త్వరగ రారే (2)
||రారె||

3.బాలుడడుగో వేల సూర్యల బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాల వృద్ధుల (2)
నేల గల్గిన నాధుడు (2)
||రారె||

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం – (2)

రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ||ఇది||

గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||

క్రిస్మస్ పరిచర్య

క్రిస్మస్ వాక్య పఠనము

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.- యెషయా 9:6

ఆ దేశములో కొందరు గొఱ్ఱల కాపరులు పొల ములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలి చెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు – లూకా 2:8-11

అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. –  గలతీ 4:4,5

క్యాండిల్ లైట్ సర్వీస్

1.ఓ సద్భక్తులారా ! లోకరక్షకుండు
బెత్లెహేమందు నేఁడు జన్మించెన్
రాజాధిరాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి.
నమస్కరింప రండి యుత్సాహముతో.

2.సర్వేశ్వరుండు నరరూప మెత్తి
కన్యకుఁ బుట్టి నేఁడు వేంచేసెన్
మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము.

3.ఓ దూతలారా! ఉత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ నుతించుఁడి
పరాత్పరుండా నీకు స్తోత్ర మంచు
నమస్కరింప రండి నమస్కరింప
రండి నమస్కరింప రండి యుత్సాహముతో

4.యేసూ! ధ్యానించి నీ పవిత్ర జన్మ
మీ వేళ స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య మాయె నరరూపు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

క్రిస్మస్ ఆరాధన

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను నాట్యమాడెదన్
నాట్యమాడెదన్ నేను
నాట్యమాడెదన్ నేను
దావీదువలె నేను నాట్యమాడెదన్

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను పాటపాడెదన్
పాటపాడెదన్ నేను
పాటపాడెదన్ నేను
దావీదువలె నేను పాటపాడెదన్

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను స్తుతించెదను
స్తుతించెదన్ నేను
స్తుతించెదన్ నేను
దావీదువలె నేను స్తుతించెదను

క్రిస్మస్ సందేశము

మనము ఇక్కడ కూడుకొని ఉండటనికి కారణము ఏమిటి? మంచి అలంకరణలు, మంచి భోజనాలు సిద్ధము చేయబడ్డాయి. ఈలోకంలో సందడి ఉంటుంది గానీ నిజమైన విషయం మర్చిపోతున్నారు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. అయితే ఎందుకు ఆరాధించాలి? అసలు యేసయ్య ఎందుకు పుట్టాడు అనే సంగతి తెలియకుండా సంబరాలు చేసుకోవడం వల్ల ఉపయోగము లేదు.

క్రీస్తు యొక్క పుట్టుక ఒక సంతోషకరమైన శుభవర్తమాననము. క్రీస్తు పుట్టినప్పుడు వచ్చిన గొర్రెల కాపరులు ఎంతో సంతోషముగా నాట్యమాడి ప్రకటించారు. అయితే మనము క్రీస్తును కలిగి ఉన్నామా? ఒకవేళ క్రీస్తును కలిగి ఉంటే ప్రతిరోజు క్రిస్మస్ సంతోషమే.

మన జీవితములు దేవుని మహిమ కొరకే, వాక్యమును గమనించినట్టయితే.

నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు – యెషయా 43:21.

సత్యము మీకు తెలియాలి అంటే ఈ వాక్యమును గమనించండి. మన జీవితాలు దేవుని మహిమకొరకు సృష్టించినవైనప్పటికీ, అపవాది లాక్కుని స్వతంత్రించుకుంది. ఈ లోకములో మన భూమిని వేరే వారు లాక్కున్నప్పుడు ఎలాగైనా మనము తిరిగి స్వాధీనము చేసుకోవడానికి ప్రయత్నిస్తామో, అలాగే మన దేవుడు అయిన యేసయ్య మన అందరికీ మనము పోగొట్టుకున్న మహిమా జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాడు.

ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. కొలస్సీ 1: 13

మనము అపవాది చేత పట్టబడ్డప్పుడు ఇంక మన ఇష్టము ఏమీ ఉండదు. ఉదాహరణకు తాగుడుకు బానిసను చూస్తే మానాలనుకున్నా మానలేని బానిసత్వము. మనలను అంధకార సంబంధమైన అధికారములో ఉండిపోయాము. ఒక అధికారికి మనము లోబడినట్టే, మనకు ఇష్టమున్నా లేకపోయినా మనము ఆ అధికారానికి లోబడిపోతున్నాము. మనము ఎంత ప్రయత్నించినప్పటికీ ఏమీ చెయ్యలేని స్థితిలో నిన్ను గెలిపించి విడిపించడానికి యేసయ్య వచ్చినాడు.

తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. ఇప్పటివరకు మనము అపవాది ఆధిపత్యములో ఉండేవాళ్ళము గానీ, ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించావో అప్పుడు నీవు అపవాది అధికారములో అధికారములోనుండి తప్పించబడ్డావు.

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును – యెషయా 9:6

ఈ లోకములో చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ యేసయ్య నా కొరకు ఉన్నాడు అనే సంగతి గ్రహించినట్టయితే, నీ జీవితం యొక్క భారము మోసేవాడుగా ఉన్నాడు అనే సంగతి ఎరిగిన వాడుగా అవుతావు. నా జీవితములో సంతోషము లేదు, విశ్రాంతి లేదు అని నీవు అనుకుంటే, యేసయ్యను అంగీకరించినయెడల నీకు సంతోషము, సమాధానము కలుగుతుంది. మీరు నాయొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగచేసెదను అని ప్రభువే చెప్తుననడు కదా.

మనిషికి దేనితోను సంతృప్తి ఉండదు. మన మనస్సంతా నెగటివ్ విషయాలతో నిండిపోయి ఉంటుంది. యేసయ్య పుట్టక మునుపే ప్రవక్తలద్వారా చెప్పబడిన మాట, ఆయన “ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి”. ఈ మాటలి ప్రతీ క్రిస్మస్ రోజున వింటాము. ఇమ్మానుయేలు అయిన వాడు అంటే మనకు తోడుగా ఉండేవాడు. నీ కోసము వచ్చిన దేవుడు నీకు తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడే మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఆశ్చర్యకరుడే. పరలోకములో ఆయన నిత్యము స్తుతించబడేవాడు. అయినప్పటికీ ఆ పరలోకములోని ఘనతను భాగ్యముగా ఎంచుకోలేదు గానీ నీ జీవితములో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మార్పులేని దేవుడుగా ఉన్న ఆయ్న నీ జీవితములో ఆశ్చర్యకరుడుగా ఉంటున్నాడు. నీ కొరకు నీతో ఉన్నవాడు ఎలాంటివాడు అని నీవు గ్రహించు.

అంతేకాడు ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు. మనుష్య దేహమును గమనిస్తే నిన్ను సృష్టించిన దేవుడి ఆలోచన ఎలా ఉంటుంది అని నీవు గ్రహించగలుగుతావు. నీ ఊహకు మించిన ఆలోచన కలిగిన దేవుడు. అంతే కాదు ఆయన బలమైన దేవుడు. ఆయన నీ జీవితములో బలమైన దేవుడుగ ఉండటానికి ఇష్టపడుతున్నాడు. గొర్రెల కాపరులు అయితే ఆ యేసు ప్రభువును చూడటానికి ఎంతో సంతోషముతో నిండిపోయారు. ఈరోజు అలంకరణలు ఈరోజుకే కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడో నీవు ఎరిగినట్టయితే ప్రతిరోజు సంతోషమే.

మనము క్రీస్తును అంగీకరించినప్పటికీ, మన క్యారెక్టర్లో ఏ మార్పు రావట్లేదు. వెలుగై ఉన్న దేవునిని కలిగిన మనము వెలుగై ప్రకాశించేవారిగా ఉండాలి. యేసయ్యను అంగీకరించిన నీలో బలమైన కార్యాలు జరుగుతాయి అని నీవు గ్రహించి అంగీకరించు. నీ జీవితములో తన కార్యము జరిగించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు.

సమాధానానికి అధిపతి అయిన దేవుడు. సర్వమానవాళికి ఏదో ఒక విషయములో సమాధానము లేదు. ఒకటి ముగిస్తే మరొకటి మన జీవితానికి సమాధానము లేకుండా చేస్తున్నాయి. అయితే సమాధానానికి అధిపతి అయిన యేసయ్యను అంగీకరిస్తే, ఆ కొదువైన సమాధానాన్ని అనుభవించగలుగుతావు. క్రీస్తును నిజముగా ఎరిగిన వాడు, మౌనముగా ఉండలేడు, ఆయనను గూర్చి ప్రకటించకుండా ఉండలేడు.

మన జీవితాన్ని తన ఆధికారములోనికి తీసుకున్నప్పుడు యేసయ్య వచ్చి వాడి అధికారమునుండి విడిపించాడు. అలాగే మన జీవితములో ఏమి జరుగుతుందో అనే భయముతో నిండిపోయిన స్థితిలో ఉండిపోయాము. అయితే ఆ భయమునుండి విడిపించడానికి యేసయ్య వచ్చారు.

కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస ములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను- హెబ్రీ 2: 14

మనము మరణభయముచేత, భయాము అనే దాస్యమునకు లోనైపోయాము. దేవుడిచ్చిన మహిమా జీవితము పోగొట్టుకున్న మనము అపవాది అధికారములో భయముతో నశించిన జీవితము. అయితే నీ జీవితములో ఏ మరణభయము చేత నీ జీవితము కొనసాగించబడుతుందో, ఆ మరణ భయమునుండి విడిపించడానికి రక్షకుడుగా ఈ భూలోకమునకు వచ్చినాడు. ఆయన ఉన్నచోట భయానికి తావు లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క భయముచేత గలిబిలిగా ఉంటున్నరు. అయితే నీవు యేసయ్యను అంగీకరించినట్టయితే ఆ భయమునుండి విడిపించేవాడుగా ఆయన నీ జీవితములో ఉంటాడు.

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. – కీర్తన 23:1

కాపరి అంటే కాపాడేవాడు. రక్షకుడుగా ఉన్నా మన యేసయ్య మనలను కాపాడుతాడు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా చివరికి నీ స్థితి కాపాడబడటమే.

పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు – కీర్తన 23:2

మన జీవితములో, మన కుటుంబములో జీవము లేని చోట్ల జీవముతో నింపేవాడుగా ఆయన ఉంటున్నాడు. నీ స్థితి ఏదైనా గానీ ఆయ్నా నీ రక్షకుడుగా ఉంటున్నాడు. నీ జీవితము జీవము కలిగినదిగా అవుతుంది.

నేను బ్రతుకుదినములన్నియు కృపాక్షేమములే నా వెంటవచ్చును – కీర్తన 23:6

నా జీవిత కాలమంతయు అనగా నేను బ్రతిన కాలమంతా ఆయన కృపను క్షేమమును అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. క్రిస్మస్ అనగా కేవలము అలంకరణలు, సంబరాలు మాత్రమే కాదు కానీ, నీ జీవితమును ఆయన మహిమతో అలంకరించి సంతోషముతో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు.

పరలోక ప్రార్థన గుర్తుచేసుకున్నట్టయితే, “పరలోకములో నీ చిత్తము జరగులాగున, భూలోకములో నీ చిత్తము జరుగును గాక” అని వ్రాయబడి ఉంది. అయితే ఆ దేవుని చిత్తము మన జీవితములో జరుగకుండా అపవాది మనలను పాపములో బంధించాడు. అయితే ఆ దేవుని చిత్తము జరిగించడానికి యేసయ్య ఈ భూమిమీదకు వచ్చాడు. ఆయనను అంగీకరించగానే నీవు దేవుని కుమారునిగా చేయబడుతున్నావు. దానిని బట్టి అపవాది అధికారము నీమీదనుండి తొలగించబడి దేవుని చిత్తము నీ జీవితములో జరుగుతుంది.

ఈరోజు ప్రభువు కోరుకుంటున్నది ఏమిటంటే, అక్కడక్కడా కాదు కానీ అందరూ ఆయనను అంగీకరించి మహిమతో నింపబడాలి. ఆయన చిత్తము నీ జీవితములో జరిగించబడాలి. ఆ యేసయ్య పుట్టింది ఎందుకంటే దేవుని చిత్తము యేసయ్యను బట్టి నీ జీవితములో జరగాలి. అది ఎలా జరుగుతుంది అంటే, ప్రభువును మహిమ పరచునట్టుగా దేవుని చిత్తము నీ జీవితములో జరిగించబడుతుంది.

ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను- లూకా 1: 73

ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాముతో ఒక ప్రమాణము దేవుడు చేసాడు అంట. అబ్రహాము అంటేనే ఆశీర్వాదము. ఆ అబ్రహాముకు ఇచ్చిన ప్రమాణము నెరవేర్చబడటానికి, అనగా మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ రక్షణ అనగా “యేసయ్య” అనే రక్షణ కలుగజేయబడటానికి అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసాడు. ఆ ప్రమాణము ఇప్పుడు నెరవేర్చబడాలి. ఈ సత్యము నీవు గ్రహించినట్టయితే నీ జీవితముకొరకు దేవుడు ప్రమాణము చేసాడు, ఆ ప్రమాణము యేసయ్యలో నెరవేరుతుంది అని నీకు అర్థము అవుతుంది. యేసయ్యలోనే నీ జీవితానికి అర్థము, విలువ.

మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను – 1 యోహాను 4:9

ఇది క్రీస్తు యొక్క పుట్టుక యొక్క ఉద్దేశ్యము. ఆ యేసయ్య ఎప్పుడైతే మన జీవితములో ఉంటాడో అప్పుడు

కొలస్సీలో పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను సమస్తము యేసుక్రీస్తునందే ఉండాలి అని తండ్రి అభీష్టము. పరలోకమందున్న నిత్యరాజ్యము, ఈ భూలోకములో నీవు జీవించడానికి అవసరమైన సమస్తము యేసయ్యలోనే నీకు అనుగ్రహించబడ్డాయి. యేసయ్యను అంగీకరించినప్పుడు ఇవన్నీ నీ జీవితములో నెరవేర్చబడి స్థిరపరచబడతాయి.

నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు – యెషయా 43:21.

ఈ వాక్యము నీవు క్రీస్తు పుట్టుక ఉద్దేశ్యము గ్రహించినప్పుడే నీ జీవితములో నెరవేరుతుంది. ఇది నెరవేరడానికే యేసయ్య భూలోకములోనికి వచ్చాడు. యేసయ్యకు నీ జీవితమును మహిమతో నింపడానికి సమస్తము సాధ్యమే! ఈ సత్యము నీవు గ్రహించి అంగీకరించినట్టయితే దేవుని చిత్తము నీ జీవితములో నెరవేరుతుంది.