Joy to the world, the Lord is come
Let Earth receive her King
Let every heart prepare Him room
And Heaven and nature sing
And Heaven and nature sing
And Heaven, and Heaven, and nature sing
Let all their songs employ
While fields and floods, rocks, hills and plains
Repeat the sounding joy
Repeat the sounding joy
Repeat, repeat, the sounding joy
And makes the nations prove
The glories of His righteousness
And wonders of His love
And wonders of His love
And wonders, wonders, of His love
Let Earth receive her King
Let every heart prepare Him room
And Heaven and nature sing
(And Heaven and nature sing)
And Heaven and nature sing
(And Heaven and nature sing)
And Heaven, and Heaven, and nature sing
And Heaven, and Heaven, and nature sing
Let Earth receive her King
Let every heart prepare Him room
And Heaven and nature sing
(And Heaven and nature sing)
And Heaven and nature sing
(And Heaven and nature sing)
And Heaven, and Heaven, and nature sing
And Heaven, and Heaven, and nature sing
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి,
ఊహలకు అందని అద్భుతము జరిగెను!
లోక చరిత మార్చిన దైవకార్యము,
కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను!
అహహ్హ ఆశ్చర్యము, ఓహోహో ఆనందము;
రారాజు యేసు క్రీస్తు ని జననము
అహహ్హ ఏమా దృశ్యము, ఓహొహ్హో ఆ మహత్యము;
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము!
ధన్యులం, దీ/హీనులం మనము ధన్యులం,
దైవమే మనల కోరి దరికి చేరెను
మనిషిగా,మన మధ్య చేరే దీన జన్మతో,
పశువుల తోట్టెలోన నిదుర చేసెను
అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు,
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి
పుట్టెను, యూదులకు రాజు పుట్టెను
వెతికిరి,ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెనుఆకశాన తార కనపడి
నిలిచెను,యేసు ఉన్న చోటు తెలిపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు,
యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి
దొరికెను, రక్షకుడు మనకు దొరికెను
తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను
దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని రూపమే మనకు సాక్షము
యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం;
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము.
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||
గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు||
వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||
పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||
అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||
క్రీస్తు పుట్టెను పశుల పాకలో
క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే (2)
అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే
పరలోక దూతాళి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా (2)
అజ్ఞానము అదృశ్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను (2) || అరె గొల్లలొచ్చి ||
కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను (2)
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2) || అరె గొల్లలొచ్చి ||
ఆరాధన వర్తమానం
ఈరోజు నాకొరకు ప్రభువైన యేసు ప్రభువు పుట్టాడు అని వ్యక్తిగతముగా ఎరిగిఉండటము ఎంత భాగ్యము?
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి – మత్తయి 2:1-2.
ఈ క్రిస్మస్ దినాన యేసు ఎమై ఉన్నాడో ఎరిగి ఉన్నట్టయితే నీవుకూడా ఆయనను వెతికేవానిగా ఉంటావు. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును బట్టి యూదుల రాజు పుట్టాడు అని గ్రహించినారు. మన ప్రభువు మన జీవితాలలోకూడా ఆయన రాజై ఉన్నాడు.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6
రాజైన యేసు భుజము మీద రాజ్యభారము ఉన్నది. ఏ రాజ్యభారము అది? “నా జీవితం” అనే రాజ్యము. నా జీవితానికి రాజుగా ఉన్నాడు. నా జీవితము రాజ్య భారము ఆయనపై ఉన్నది. ఒకప్పుడు మనము దేవుని ప్రజలుగా లేము. ఎప్పుడైతే యేసయ్య భూలోకానికి వచ్చామో అప్పుడు ఆయన ప్రజలుగా ఆయనను కలిగినవారిగా ఉన్నాము. ఇప్పుడు మనము ఆయనవారమై ఉన్నాము. దీనిని బట్టి ఈరోజు నువ్వు సంతోషించవచ్చు. రాజుగా ఆయన పరిపాలించేవాడుగా ఉన్నాడు. నీ జీవితములో ఆయన ఉన్నట్టయితే ఆయన పరిపాలించేవాడుగా ఉంటాడు.
నా చిత్తప్రకారము చేయనప్పుడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని ప్రభువు వాక్యములో చెప్పుచున్నాడు. అనేకమైన విషయాలలో ఆయనను తృణీకరించువారిగా ఉంటున్నాము. అయితే మనము తృణీకరించడానికి కాదుకానీ ఆయనను స్వీకరించడానికి. మన జీవితాలు ఆయన అధికారములో ఉండటానికి. ఆయన అధికారమే మన జీవితాలను కొనసాగించేది. ఏ సమయమందైనా, ఏ స్థితియందైనా ఆయన మనకొరకు ఉన్నాడు, నడిపించేవాడు అనే సత్యము మన ద్వారా కనపరచబడాలి. క్రిస్మస్ అలంకరణలు మన జీవితాలలో మాత్రమే కలిగి ప్రభువు అధికారము మన జీవితాలపై లేనప్పుడు శుభవర్తమానమును తెలియచేయలేవు.
నువ్వు ఎటువంటి నిరాశలో ఉన్నసరే నీ కొరకు రక్షకుండు ఉదయించినాడు, నా యేసు ప్రభువు నాకొరకు ఉన్నాడు అనే సత్యమును ఎరిగి ఉన్నట్టయితే, నీవు సంతోషముగా ఆరాధించగలుగుతావు. నీ నిరీక్షణ అయిన యేసయ్యను మనసారా ఆరాధిద్దాము. ఏదైతే జరగట్లేదని నిరాశలో ఉంటున్నావో నీకున్న నిరీక్షణను బట్టి నీవు పొందుకునేవాడివిగా ఉంటావు.
దేవునితో సమానముగా ఉండటము విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనక నీతో ఉండుటయే భాగ్యమని ఎంచుకొని నీకొరకు ఈలోకములో మానవ రూపములో పుట్టి, నీ కొరకు రక్షణ మార్గము సిద్దపరిచినవాడు నీ దేవుడు.
ఆరాధన గీతము
నా జీవం నీవే దేవా
నా సర్వం నీవే కావా
స్తుతిగీతం పాడి నేను
నిన్నారాధించెదా
ఆరాధన యేసు నీకే
ఆరాధన యేసు నీకే
ఆరాధన యేసు నీకే
ఆరాధన యేసు నీకే
నీటిపైన నడిచిన
నీ అద్భుత పాదములు
చూచుచు నే నడిచెద
అన్నివేళలా
ఆరాధన యేసు నీకే
ఆరాధన యేసు నీకే
ఆరాధన యేసు నీకే
ఆరాధన యేసు నీకే
Main Message | మెయిన్ మెసేజ్
ఈ దినము మన అందరికి శుభవర్తమానము. నెగటివ్ కాదు కానీ మన జీవితాలలో ఇంక పాజిటివ్ మాత్రమే.
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. – మత్తయి 1:21-23.
ఈరోజు క్రిస్మస్ యొక్క ఉద్దేశ్యమును మనము గ్రహించాలి. యేసయ్య భూలోకమునకు వచ్చి మనకు తోడుగా ఉండేవాడు అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు అయి ఉన్నది. యేసు పుట్టకమునుపు మన జీవితాలు ఒకలా ఉండేవి అయితే యేసు పుట్టిన తరువాత అద్భుతముగా మార్చబడ్డాయి.
అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతోనీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీసర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను – ఆదికాండము 3:13.
ఈ సందర్భము మన అందరికి తెలిసినదే. మానవజాతి దేవుడిచ్చు మహిమను పొందలేకపోవడానికి కారణము, మోసము. అయితే దేవుడు మనలను ప్రేమించాడని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. అందుకే యేసయ ఈ లోకమునకు ఈరోజు వచ్చాడని మనకందరికీ తెలుసు. మన యేసు ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. అంతకుముందు ఆదాము రోజులలో, ఒక సాయంకాలము పూట దేవుడు వారితో మాట్లాడుతుండేవాడు. అయితే దేవుడు వారితోలేని సందర్భములో అపవాది వారిని మోసపుచ్చినట్టుగా మనము చూడవచ్చు.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. 1 పేతురు 5:8.
విరోధి అయినవాడు మన జీవితాలకు నష్టము కలిగించడానికే చూస్తాడు. అయితే ఇమ్మానుయేలుగా వచ్చి మనకు తోదుగా ఉండే ఆయన మనము అపవాది మొసమునకు లోనవకుండా తోదుగ ఉంటున్నాడు. క్రిస్మస్ యొక్క ఉద్దేశ్యము ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ మాట క్రిస్మస్ రోజు కొరకు మాత్రమే కాదు కాని, నీ జీవితమంతా కూడా ఆయన ఇమ్మానుయేలు దేవుడుగానే ఉన్నాడు. దానిని బట్టి అపవాది నీ జీవితాన్ని లోబరుచుకోలేదు. నీ జీవితము యేసును బట్టి మహిమ కరముగా మార్చబడుతుంది.
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు – కీర్తన 91:1
ఆయన మనకు తోడుగా ఉంటే, మనము విశ్రమించేవారిగా ఉంటాము. మనకు సమాధానము లేని స్థితిలో సమాధానము కలుగచేసి, బలహీనతలో ఉంటే బలము కలుగచేసి మనలను విశ్రమింపచేసేవాడిగా ఉన్నాడు. ఈ సత్యమును గ్రహించి, ఆయనను అంగీకరించినట్టయితే నీ జీవితములో సంతోషము సమాధానమే.
ఇమ్మానుయేలు దేవుడుగా నాకొరకు వచ్చావు దేవా అందునుబట్టి నీకే స్తోత్రము. నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నాజీవితమంతా సంతోషమే అని ప్రార్థించి స్తుతిద్దామ?
అపవాది అనేకరకాలుగా మనలను పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. లూకాలో ఒక మాట చూద్దాము.
సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.లూకా 22:31.
సీమోనుకు ఈ విషయము తెలియదు కానీ ఇమ్మానుయేలుగా ఉన్న యేసయ్య ఈ విషయమును బట్టి దేవునికి ప్రార్థించి పేతురు సమకూర్చబడులాగా మార్గము సిద్ధపరచినాడు. సీమోనుకు ఎలా అయితే రక్షకుడుగా ఉన్నాడో, నీకు కూడా ఆయన రక్షకుడుగా ఉన్నాడు. అపవాది చేసే అనేకమైన ప్రయత్నాలను అడ్డుకుని, నిన్ను నిలబెట్టేవాడిగా ఉన్నాడు.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి – యోహాను 1:1, 14.
ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను – యోహాను 1:4.
పరలోకములో ఉన్న ఆయన భూలోకములో మనతో కలసి నివసించడానికి వచ్చాడు. వచ్చ్చిన ఆయనన్లో జీవము ఉన్నది. ఆయన కృపాసత్య సంపూర్ణత కలవానిగా ఉన్నాడు. ఆ వెలుగు అయిన ప్రభువు మన జీవితాలలో చీకటి ప్రవేశించడానికి అవకాశము లేదు. వెలుగు అనేది ప్రకాశించబడేదిగా ఉంటుంది. యేసును అంగీకరించిన మన జీవితాలు ఖచ్చితముగా ప్రకాశించేవిగా ఉంటాయి. ఇంతకుముందు బలహీనత కలిగి ఉన్నా, ఇప్పుడు ఆయన బలమును బట్టి వచ్చిన మార్పును బట్టి ప్రకాశిస్తావు. నీ క్రియలలో మార్పు ఖచ్చితముగా వస్తుంది.
చాల సందర్భాలలో అపవాది నిన్ను కృంగదీసేవిధముగా ప్రయత్నిస్తుంది. దేవుడు చెప్పిన మాటనే ఉపయోగించి మోసగించింది. నీ జీవితము ప్రకాశించబడుతుంది అని వాక్యము చెప్తుంది. అదే మాటను ఉపయోగించి అపవాది నిన్ను మోసగించేప్రయత్నిస్తుంది. ఎదో ఒక మెలిక, ఏదో వెలితి కలిపి, ఆ వాక్యాన్ని అనుమానించి విశ్వసించలేని విధానములో నిన్ను మోసగించి చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంది అపవాది. అయితే దేవుని వాక్యము సత్యము, ఆయన పుట్టుక సత్యము కనుక మీరు నమ్మి విశ్వాసముతో నిలబడి అపవాదిని జయించండి.
జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను మత్తయి 4:15.
చీకటిలో కూర్చుండియున్న ప్రజలకు వెలుగుగా వచ్చాడు. అదే యేసు ప్రభువును నీవు నమ్మినట్టయితే, నీ జీవితముకూడా వెలుగుమయముగా అవుతుంది. మరణచ్ఛాయ అనగా మరణము యొక్క ప్రభావము కలిగిన స్థితి. మరణ ప్రదేశము అనగా ప్రభువు నిర్ణయించిన ప్రకారముగా కాక పతనమైన స్థితిలో ఉండుట. అటువంటి స్థితిలో ఉన్నట్టయితే, ఈరోజు ధైర్యము తెచ్చుకో, ఆ వెలుగులో జీవము ఉంది. నీ మరణకరమైన పరిస్థితిలో ఆయన వెలుగును బట్టి జీవము నింపబడుతుంది. దానికొరకు ఆ వెలుగును స్వీకరిస్తే చాలు.
ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను – యోహాను 1:5.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.- యోహాను 1:1
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; – యోహాను 1:14
ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు. – యోహాన్ను 1:16
ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను – యోహాను 1:2.
అపవాది మనలను మాటిమాటికీ మోసగిస్తున్నప్పటికీ ఆయనే మనకు ఇమ్మానుయేలుగా తోడుండి విడిపించి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన కలిగిన వెలుగును బట్టి మనలో ఉన్న మరణకరమైన స్థితిలో జీవము నింపుతున్నడు. ఇప్పుడు సమస్తము ఆయన మూలముగా కలిగెను అని వాక్యము చెప్తుంది.
ఉదాహరణకు ఒక మురికివాడ ఉంది అనుకోండి ఒక మంత్రి అటుగా వస్తున్నాడు అంటే, ఆయనను బట్టి ఆ మురికివాడను శుభ్రము చేస్తారు కదా? అలాగే మన జీవితములోనికి వచ్చిన ఆయనను బట్టి కృపవెంబడి కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఆ కృపను బట్టి సమస్తము మనకు సమకూర్చబడతాయి. ఏమి వెలితి ఉన్నా, ఏమి కొరత ఉన్నా అది తీర్చబడుతుంది. నీ జీవితము పరిపూర్ణమయ్యేంతవరకు ఆ కృప నీకు అనుగ్రహించబడేదిగా ఉంటుంది. క్రీస్తును నీవు అంగీకరించినట్టయితే అప్పుడు నీవు నిజమైన క్రిస్మస్ నీవు జరుపుకోగలుగుతావు. దినదినము నీవు పరిపూర్ణతలోనికి నడిపించబడతావు. రేపేమవుతుంది అనే భయము నీకు ఉండనే ఉండదు. ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా జీవితము పరిపూర్ణముగా ఉంటుంది అని నివు నిర్భయముగా ప్రకటించగలుతావు.
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస ములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. హెబ్రీ 2:14-15
నీ జీవితములో ఎటువంటి మరణభయము ఉన్నాసరే ఆ మరణభయమునుండి విడిపించేవాడుగా నీకు ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము భయపడనవసరములేదు.
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను – యోహాను 10:10.