చిరకాల స్నేహితుడా
చిరకాల స్నేహితుడా _ నా హృదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్యా _ ప్రియ ప్రభువా యేసయ్యా
చిర కాల స్నేహం _ ఇది నా యేసు స్నేహం
బంధువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/
కష్టాలలో కన్నీలలో _ నను మోయు నీ స్నేహం
నను దైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/
నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/
నీ పిలుపు వలన నేను నశించి పోలేదు
నీ పిలుపు వలన నేను నశించి పోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు
1. నశించుటకు ఎందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడా నా యజమానుడా…
నన్ను పిలచిన యజమానుడా
యజమానుడా నా యజమానుడా…
నన్ను నడిపించే యజమానుడా
2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు
మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా
3. పిలిచిన నీవు నిజమైన వాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదేమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవు
నిన్ను నమ్మెదను, వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును
నీ పిలుపు వలన నేను నశించి పోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు
రాజుల రాజుల రారాజు
రాజుల రాజుల రారాజు
సీయోను రారాజు (2)
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము (2)
తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు (2) || రాజుల ||
నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు (2) || రాజుల ||
ఆరాధన వర్తమానం
వాక్యము ఎవరిదగ్గరికి వస్తుందో లేక వాక్యము ఎవరు స్వీకరిస్తారో వారు నిజముగా ధన్యులు. మరి ఈరోజు వాక్యము మీ దగ్గరికి వస్తుండగా ఆ వాక్యములోని జీవము నీలో స్థిరపరచబడుతుంది.
పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను. – కీర్తన 9:1-2.
“నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను” అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని గూర్చిన సత్యమును తెలుసుకొనినవాడై, అనుభవించినవాడై చెప్పుచున్నాడు.
నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావునీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పుతీర్చుచున్నావు – కీర్తన 9:3
దేవుడు మనకు సృష్టికర్తగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు మరియు కాపరిగా ఉన్నాడు. కీర్త్నాకారుడి జీవితము చూస్తే, “యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారునామీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదనినన్నుగూర్చి చెప్పువారు అనేకులు కీర్త్న 3:1-2”.
1. నిన్ను బాధించువారు అనగా నీవు ఉన్న పరిస్థితులలో నీవు కృంగిపోయి ఉన్నావు. నిన్ను గురించి అనేకులు చెప్పుకుంటూ ఉన్నారేమో
2. మనుష్యులే శత్రువులుగా ఉండి నిన్ను బాధిస్తున్నారేమో
3. నీవు దేవుని పై నిరీక్షణ కలిగి ఉన్నప్పటికీ, దేవుని వలన వాడికేమీ దొరకదు అని అనేవారు నీ చుట్టూ ఉన్నారేమో
అయినప్పటికీ నీకు నీ ప్రభువు కేడెముగా ఉన్నాడు. కేడెము అనగా ఇంగ్లీషులో “షీల్డ్” పూర్వకాలములో యుద్ధములు చేసినప్పుడు శత్రువు వేసే బాణములు ఆపడానికి, ఆయుధముల దాడిని ఆపడానికి వాడేది. ఇప్పుడు నీ దేవుడే నీకు కేడెముగా ఉంటే, ఆయనను దాటి నిన్ను తాకే ఆయుధము ఏది? నీకున్న పరిస్థితులలో నీకు న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు.
ఏమి న్యాయము తీరుస్తాడు? నిన్ను బాధించు పరిస్థితులలో నుండి విడిపించి నీకు వ్యతిరేకముగా మాటలాడిన నోట అదే దేవుని మహిమపరిచే స్థితిలోనికి తీసుకువస్తాడు. ఇంతవరకు దేవుడు చేస్తాడు చేస్తాడు అని నీవు అనుకుని ఇంకా అవ్వలేదు అనుకుంటున్నావేమో, లేక నీ చుట్టూ వున్నవారు అనుకుంటున్నారేమో.
యెహోవా ప్రభువాధనమిచ్చి యీ పొలమును కొను క్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెల విచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింప బడుచున్నది. యిర్మీయా 32:25
దేవుడు వాగ్దానము చేసాడు. అయితే వేరేవారు అడ్డుగా వస్తున్నారు. అయితే దేవుడు ఏమి చెప్పుచున్నాడు?
ఇది పాడై పోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయులచేతికి ఇయ్యబడియున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును – యిర్మీయా 32:43.
దేవుడు చేస్తాను అని చెప్పాడు, కానీ పరిస్థితులన్నీ శత్రువు వైపే ఉన్నాయి అని అనుకుంటున్నారేమో. దేవుని వాగ్దానము నెరవేరట్లేదు అని నీ మనసులో అనుకుంటున్నావేమో, నీ చుట్టూ ఉన్నవారు అంటున్నారేమో. అయితే ఇంతవరకు నీవు కలిగిన నిరీక్షణ ఫలిస్తుంది. నమ్మి ఈ సత్యమును స్వీకరించు.
కీర్తనాకారునికి దేవుని గూర్చిన సత్యము తెలిసాక కీర్తించాడు. ఈరోజు నీకుకూడా సత్యము వెల్లడిపరచబడింది. మరి నీవు నీ పూర్ణ హృదయముతో నీ దేవుని స్తుతిస్తావా? ఆయన గూర్చి నీవు తెలుసుకున్న సత్యమును బట్టి సంతోషించి హర్షిస్తావా? ఆయనను ఆరాధిస్తావా?
ఈ వారము నీ జీవితములో దేవుని కార్యము జరిగించబడుతుంది. నమ్మి స్వీకరించు అనుభవించు. నీ దేవుడు మార్పులేనివాడు. నీ దేవుడు చెయ్యలేనిది ఏమీ లేదు. సమృద్ధి అయిన జీవము కలిగి మనము జీవించాలి.
యెహోవా, నీవే నాకు కేడెముగానునీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. – కీర్తన 3:3.
ఎవరైతే నీ గురించి మాట్లాడుకుంటున్నారో వారి ముందు దేవుడు నీ తల ఎత్తి నిలబెడుతున్నాడు. దేవుడు తన కార్యము జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. మౌనముగా ఉండవద్దు నీ దేవుని స్తుతించి నీ రక్షణ మార్గము సిద్ధపరచుకో
ప్రాఫెటిక్ మాట: నీకొరకు దేవుని మార్గము తెరువబడుట నీవు చూస్తావు.
ఆరాధన గీతము
నిన్నే నమ్మి ఉన్నాను సిగ్గుపడను
నీ దయలోనే నిలచియున్నా
ఒంటరినై నేనున్నను
సమస్తమును చేసెదవు
గాయపడిన వేళ కన్నీటితోనూ
కలతతో ఉన్న నాకై దిగివచ్చిన
నిబంధనతో నా చేయి పట్టి
సమస్తమును ఆశీర్వదించెదవు ….ఎల్ ఎలోహిమ్
అని నమ్మి ఆరాధించు.. ప్రకటించుయేసయ్య మార్గము గుండా వెళుతుండగా ఒక గుడ్డివాడి విశ్వాసము అన్ని ఆటంకములు దాటి యేసయ్యను ఆపగలిగింది సర్వోన్నతుడైన దేవుని కటాక్షము పొందుకునేలా చేసింది.
నిబంధన నెరవేరే సమయము ఇది గమనించు. నీవు శత్రువు మీద జయము పొందుకొనేలా పరిస్థితి మారుతుంది. నమ్మి విశ్వాసముతో స్వరమెత్తి, గళమెత్తి స్తుతించు. దయచేసి మౌనముగా ఉండవద్దు. ఇది నీ ఆశీర్వాదపు సమయము.
Main message| మెయిన్ మెసేజ్
యేసయ్య మార్గము గుండా వెళుతున్నప్పుడు ఆ గుడ్డివాడు కేకలు వేస్తుండగా యేసయ్య అతనిని తీసుకురమ్మని ఎవరితో చెప్తున్నాడు? ఎవరైతే వారిని అడ్డగించారో వారికే చెప్తున్నాడు తీసుకురమ్మని. అంటే ఏమిటంటే, ఎవరైతే నీకు అడ్డముగా ఉన్నారో, నీ విశ్వాసాన్ని అణిచివేసే పరిస్థితులు ఉన్నాయో వారితోనే ప్రభువు చెప్తున్నాడు. నీవు కేవలము విని వదిలేసి వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనము ఉండదు. అయితే నీవు విన్న వాక్యము కొరకు ప్రార్థనలో కనిపెడితే, ఆ నెరవేర్పు నీవు చూస్తావు.
ఈరోజు “నీలో ఉన్నవాడు” అనే విషయము గురించి ధ్యానము చేద్దాము. నీలో ఉన్నవాడు ఎవరు అంటే? మీ జవాబు ఏమిటి? మనము అందరమూ యేసయ్యే అని చెప్తాము. అయితే ఈరోజు పరీక్షచెయ్యమని దేవుడు అడుగుతున్నాడు.
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. – మత్తయి 6:24
నియమము ఏమిటి అంటే ఎవ్వడైనా ఇద్దరికి దాసులుగా ఉండడు. ఒక్కడికే ఉండగలుగుతాడు. యజమానుడుగా ఉన్నవాని పక్షమునే నీవు నిలబడతాడు. ఇప్పుడు మనమే ఆ దాసులము. ఒకపక్కన యేసయ్య మరొకపక్క అపవాది ఉన్నాడు. మనము ఎవరికి దాసులము? పరీక్షించుకుందాము.
వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. – 1 యోహాను 4:5,6.
ఒకవేళ యేసయ్యకు దాసుడుగా వుంటే యేసయ్య మాటే వింటావు, వినాలి. ఆయన మాట వినకపోతే ఆయన యజమానుడుగా లేడు అని అర్థము. అప్పుడు అపవాదే యజమానిగా ఉన్నట్టు అని అర్థము. అప్పుడు లోకము చెప్పింది మనము, మనము చెప్పింది లోకము వింటుంది. పౌలు మాటలు జ్ఞాపకము చేసుకుంటే, “నీలో ఉన్నవాడు లోకములోకంటే గొప్పవాడు”. మరి ఒకవేళ యేసయ్య నీలో ఉంటే ఆ గొప్పవాని గురించి మాటలలో వచ్చే అనుభవము, చేతలలో కనబడటములేదు.
గొప్పవాడు నాలో ఉన్నాడు, ఆ గొప్పవాడు లోకములో ఉన్నదానికంటే గొప్పవాడు. ప్రభువు జ్ఞాపకము చేసే ఒక సంగతి, లోకము మాటలాడినట్టు మాటలాడుట.
దైవజనుని అనుభవము: ఛాలెంజింగ్ పరిచర్య జరిగిస్తాను అని దేవుడు చెప్పగా, సంతోషించినప్పుడు, దేవుడు ఒక మాట అడిగాడు, నీలో ఉన్నావాడు ఎవడు అని. అప్పుడు పరీక్ష చేసుకుంటే అది సత్యము కాదు అని తేలిసింది. ఎలా అంటే, దైవజనునికి షుగర్ ఉంది. దానిని బట్టి అమ్మో దానిని బట్టి ఫలానాది జరుగుతుంది అని భయపడినప్పుడు. నీలో ఉన్నవాడు ఎవడు అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. అద్భుతము నేను జరిగిస్తాను, ఛాలెంజింగ్ పరిచర్య జరిగిస్తాను అని చెప్పాక నీవే అద్భుతము చూడకపోతే నీవేమి అద్భుతము జరిగించగలుగుతావు? అని ప్రభువు సూటిగా అడిగాడు. డాక్టర్ టెస్ట్ చేసి చెప్పిన మాటలు నమ్ముతున్నావు. అయితే నేను చెప్పిన మాటలు టెస్ట్ చెయ్యవా? టెస్ట్ చెయ్యకుండా లోకము ప్రకారము మాట్లాడుతుంటే నీలో ఎవరున్నట్టు? అని అడిగాడు.
ఇది మన జీవితములో కూడా సత్యమే కదా? నీ జీవితములో ఎవరు నివసిస్తున్నారు? నీలో యేసయ్య ఉంటే ఆయన మాటను నీవు విశ్వసించాలి. అయితే నీవు ఎవరి మాట అంగీకరిస్తున్నావు? ఎవరి మాట నమ్ముతున్నావు? నీలో అపవాది తన ప్రయత్నము జరిగించినప్పుడు, నీలో ఉన్న యేసయ్యమీద ఆనుకున్నప్పుడు, ఆయన మౌనముగా ఉంటాడా? ఆయన యజమానుడుగా ఉంటే నీవు ఏమిచెయ్యాలి? అపవాదిని ద్వేషించాలి నీ యజమానుడైన యేసయ్యను ప్రేమించాలి.
ఎలా ప్రేమించాలి? “ఎవడైతే నన్ను ప్రేమిస్తున్నను అని చెప్తున్నాడో, వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు” అని వాక్యము చెప్తుంది. దేనికొరకు ఆయన ఆజ్ఞలు? ధర్మ శాస్త్రము పాపమును గూర్చి తెలియచేస్తుంది. ఆజ్ఞలు ఆ పాపమునకు లోబడకుండా నీకు సహాయము చేస్తాయి.
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును – సామెతలు 4:20-22.
ఎప్పుడైతే నాలో యేసయ్య యజమానుడుగా ఉన్నాడో, ఆయన లోకములో ఉన్నదానికంటే గొప్పవాడు గనుక, లోకములో ఉన్న షుగర్ కానీ, క్యాన్సర్ గానీ, పరిస్థితులుగానీ ఎమైనా కానీ వాటన్నిటికంటే గొప్పవాడు, శక్తిమంతుడు. యేసయ్య మాటలకు జీవమిచ్చే శక్తి ఉంది. మొదటిగా ఎవరు యజమానుడో తెలుసుకుని, ఆ యజమానుని ప్రేమించుట జరిగింది. తరువాత, “ఒకరి పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించాలి”. ఇది అనుభవపూర్వకముగా ప్రాక్టికల్ గా అపవాదికి సంబంధించిన వాటిని ద్వేషించడం ప్రారంభించాలి.
దేవుని మాట వింటే యేసయ్య యజమానుడుగా ఉంటాడు. లోకము చెప్పినట్టు వింటే అపవాదే నీకు యజమానుడుగా ఉన్నట్టు.
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము – ప్రకటన 3:20.
ఆయన స్వరము అనగా ఈరోజు చెప్పబడిన మాటలు. ఈ మాటలు నమ్మి ఆ ప్రకారముగా నిలబడినప్పుడు ఆయన వస్తాను అని చెప్పుచున్నాడు. అయితే మీరు విశ్వాసముతో నిలబడినప్పుడు ఆ విశ్వాసమును ప్రశ్నించే పరిస్థితులు ఎదురవుతాయి. డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మనము ఎలా ఉండాలి? ఎలా నిలబడాలి?
మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. – రోమా 4:19-21
నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము – సామెతలు 4:23.
నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను – లూకా 22:32. ఇది ఎప్పుడో తెలుసా? “సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను” అని ప్రభువు చెప్పుచున్నాడు. సాతాను నిన్ను పడగొట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ విషయము సీమోనుకు తెలియదు. అంటే నీవు దేవుని మాట ప్రకారము నిలబడినప్పుడు, ఏ పరిస్థితిలో నీవు నిలబడుతున్నావో ఆ పరిస్థితి యొక్క ప్రభావము నీ మీద పడకుండా నీలో ఉన్న గొప్పవాడు నిన్ను కాపాడతాడు. ఈ సత్యము నీవు ఎరిగియున్నట్టయితే నీవు ఇంక భయపడవు. అంతేకాక నీవు ఏ విధముగా ప్రార్థించాలో కూడా నీలో ఉన్నవాడు నీకు గైడెన్స్ ఇస్తాడు.
నీలో ఎవరో ఒకరే ఉంటారు. నీ యజమాని ఎవరో కనుక్కో, ఆయనను ప్రేమించు, ఆయన పక్షమున నిలబడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను అని నీ యజమానుడు పలికిన మాటలు నీ జీవితములో నెరవేరతాయి.
నీలో ఉన్న ఆయనను బట్టి లోకమునకు సంబంధించిన దానికి లోబడకు. నీలో ఆయన యజమానుడుగా ఉంటే లోకము చెప్పే మాటను అంగీకరించవు. ఇది ప్రాక్టికల్ గా అనుభవించి నీ జీవితములో దేవుని మహిమపరుచు.