ఊహించలేనివి – అహ్లాదమైనవి
ఊహించలేనివి – అహ్లాదమైనవి
ఎన్నేన్నో మేలులు – పొందండి ఈ వేళ
యేసయ్య త్రోవలు – ఎనలేని ఈవులు
యేసయ్య వరములు – ఇవన్నీ కావలాయేసే మర్గము – యేసే గమ్యము
యేసే జీవము – మనకంతా
యేసు, రక్షణకే ఆధారం
యేసు ఉంటే చాలు – లేదు పాప భారం
నేడే రక్షణ కోరు – మారే రోజే నేడు
దక్కే గొప్ప భాగ్యం – సత్యం ఈ మాట
పాపములేని పావనుడేసు – పాపము మోసాడే
శిలువలో మనకై విలువగు ప్రాణం నిలువున పెట్టాడే
తన రుదిరములో మన పాపం కడవరకును కడిగాడే
తెలియక తిరుగాడువారికి తెలియగ చెబుదామిల..
క్షమయేలేని నిష్ఫల జీవికి రక్షణ నిచ్చాడే
సాక్షిగ జేసి మోక్షము జేర్చ ప్రక్షాళించాడే
తన తనయులుగా మనమంత అనవరతమును నిలిపాడే
తెలియక తిరుగాడువారికి తెలియగ చెబుదామిల..
కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలో
కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో (3)
1. పాపమంత పొయెను – రోగమంత తొలగెను యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృపద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో…. (2)
2. దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు – గుర్తించె నన్ను అద్భుతమద్భుతమే …. (2)
3. శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును
ఏకముగా కూడి – హోసన్న పాడి ఊరంతా చాటెదము…. (2)
4. బూరధ్వనితో – పరిశుద్ధులతో యేసు రానై యు౦డే…
ఒక్క క్షణములోనే – రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం… (2)
ఆరాధించెదను నిన్ను
ఆరాధించెదను నిన్ను
నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను||
నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె (2)
జీవిత కాలమంతా
నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను||
చింతలన్ని కలిగిననూ
నిందలన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను
నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను||
ఆరాధన వర్తమానం
మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాము. మన దేవుడు మంచిదేవుడు ఆమేన్! హల్లెలూయా!
చాలా సందర్భాలలో మన జీవితాలలో మనకు వ్యతిరేకమైనవి మనముందు చాల కనబడుతుంటాయి. అట్టి సందర్భాలలో చాలా అందోళనకరంగా గలిబిలితోను ఉంటాము. అయితే మన దేవుడు మంచిదేవుడు. కొంతమంది జీవితాలు సాఫీగా ఉంటాయి, కొంతమంది జీవితాలు కష్టాలతో నిండి ఉంటుంది. అయితే వీరిరువురికీ కూడా ఆయనే దేవుడు. దేవునిని అర్థము చేసుకున్నట్టయితే ఆయన మంచితనాన్ని అర్థము చేసుకోగలుగుతాము. అందుకే మన జీవితాలలో దేవుని గూర్చిన నెగటివ్ ఆలోచనలు అస్సలు రానివ్వకూడదు. “నాకే ఎందుకే ఇలా” అనే ఆలోచన వచ్చినప్పుడల్లా నీవు జ్ఞాపకము చేసుకోవలసినది, “దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు” అనే సత్యము జ్ఞాపకము చేసుకో!
దేవుడే నిన్ను సృష్టించాడు. అయితే నీవు ఎందుకొరకు నీవు సృష్టించబడ్డావు? దేవుని మహిమ కొరకు సృష్టించబడ్డావు. అయితే నీవు ఎదుర్కొనే నెగటివ్ పరిస్థితులలో నీ ద్వారా ఆయన మహిమ పొందటానికి నీవు ఏర్పాటుచేయబడ్డావు.
సాఫీగా ఎటువంటి కష్టాలు లేని జీవితము కలిగినవారికీ, కష్టాలతో నిండిన జీవితము కలవారికీ ఆయనే దేవుడు. ఇద్దరినీ నడిపించేవాడు ఆయనే అయితే వారి కష్టసమయములో కృప విడుదల చేసి వారిని జయకరముగా నడిపించి ఆయన నామము మహిమపరచబడటానికి ఆయన కార్యము చేసేవాడుగా ఉన్నాడు. అందుకే నీ జీవితములో కష్టములు, నష్టములు కలిగినప్పుడు నీ మనస్సును చెదరనీయకు. ఆయన నీకు దేవుడుగా ఉన్నాడు, ఆయన ప్రేమ నీ జీవితములో చూపిస్తాడు గనుక ఈరోజు ఉన్న నీ పరిస్థితి రేపు అలానే ఉండదు. అందుకే నీవు “నేను నేనున్న పరిస్థితిలో దేవుని మహిమ కొరకు ఏర్పరచబడ్డాను” అని నిన్ను నీవు ప్రోత్సహించుకో!
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు – మత్తయి 5:48. ఒక వృత్తాన్ని చూస్తే, అది మొత్తము గుండ్రముగా కలిసి ఉంటేనే అది పరిపూర్ణ వృత్తము. అది కలిసి లేకపోతే అది పరిపూర్ణ వృత్తము కాదు. అలానే మన దేవుడు పరిపూర్ణమైన మహిమ పొందదగినవాడు. సాఫీగా జరుగుతున్న వారి జీవితములలోనూ, కష్టముల గుండా వెళుతున్నవారి జీవితములోనూ మహిమను పొందదగినవాడు. వారిద్దరి జీవితములలో మహిమ పొందినప్పుడే పరిపూర్ణమైన మహిమ ఆయన పొందదగినవాడు. అందుకే మీరు వెళ్ళే పరిస్థితులలో “ఇప్పుడు నా జీవితములో నీ కార్యము నీ మహిమకొరకు స్థిరపరచబడుతుంది” అని ప్రకటించగలగాలి.
తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక – యూదా 1:24
వాక్యమును సంపూర్ణముగా తెలుసుకుంటే మీరు శక్తివంతులుగా మార్చబడతారు. “మిమ్ములను నిర్దోషులుగా నిలువబెట్టుటకు” అంటే ఏమిటి? దోషముగా ప్రవర్తించకుండా ఉండుటయే నిర్దోషముగా ఉండుట. దేవునిని సరిగా అర్థముచేసుకోలేని పరిస్థితులలో దేవుని మహిమను గూర్చి దోషము చేసే అవకాశమును రానివ్వకుండా చేయుటయే నిన్ను నిర్దోషముగా ఉంచుతాడు.
మహిమ, మహాత్మ్యము, అధికారము దేవుని యొక్క లక్షణములు. యుగములకు పూర్వము అంటే ఇంతకు ముందు నీ పరిస్థితులలో నిన్ను నడిపించాడు, ఈరోజు నీవున్న నెగటివ్ పరిస్థితులలో నిన్ను విడిపించేవాడు, ఇకముందు నీవు వెళ్ళబోయే పరిస్థితులలో కూడా నిన్ను ఆయన లక్షణములను బట్టి నిన్ను విడిపించి నడిపించేవాడు. ఎందుకు అంటే నీవు ఆయన యెదుట సంతోషముగా ఉండాలి అనేది ఆయన ఆశ.
మన విశ్వాసము అగ్ని వంటి శోధనలలో ఖచ్చితముగా పరీక్షించబడుతుంది. అయితే నీ పరీక్షాసమయములో నీ దేవుడు ఎలా ఉంటున్నాడు అని నీవు గ్రహించగలగాలి! ఆయన నీతో అంటాడు, “నీ చింత యావత్తూ నా మీద వెయ్యి”! నిన్ను నిలబెట్టడానికి శక్తిమంతుడు. ఆయన మహిమ, మహాత్మ్యము, అధికారము అనే లక్షణములద్వారా నిన్ను నిలబెడతాడు.
ఆరాధన గీతము
పల్లవి:
ఎల్షడ్డాయ్ ఎల్షడ్డాయ్
ఎల్షడ్డాయ్ ఎల్షడ్డాయ్
నీలాంటి దేవుడులేడు మాకిలలో
నీలాంటి దేవుడులేడు (2)
చరణం:
మృతులను సజీవులుగా
లేనివి ఉన్నట్టుగా (2)
చేసినదేవా స్తోత్రం
ఆశ్చర్యకరుడా స్తోత్రం (2)
నీలాంటి దేవుడులేడు
చరణం:
వేదనలో మాకు శాంతి
కన్నీళ్ళలో సంతోషం (2)
ఇచ్చినదేవా స్తోత్రం
అద్భుతకరుడా స్తోత్రం (2)
నీలాంటి దేవుడులేడు
చరణం:
రోగములో మాకు స్వస్థత
బాధలలో నెమ్మది
ఇచ్చినదేవా నీకు స్తోత్రం
యెహోవా రాఫా స్తోత్రం
నీలాంటి దేవుడులేడు
చరణం:
కుటుంబములను కట్టువాడా
విజయమునిచ్చువాడా
యెహోవా షాలోం స్తోత్రం
యెహోవా నిస్సీ స్తోత్రం
నీలాంటి దేవుడులేడు
కార్యము రూపము దాల్చునట్టుగా
చేసిన దేవా స్తోత్రం
నెరవేర్చే దేవా స్తోత్రం
ఆశ్చర్యకరుడా స్తోత్రం
మృతులను సజీవులుగా, లేనివి ఉన్నట్టుగా చేయగల సమర్థుడు నీ దేవుడు, గళమెత్తి ఆరాధించు ఆయనను
ఏదైతే నీవు అనుభవిస్తున్నావో ఆ పరిస్థితులలో ఆయన తెలియజేసిన సత్యము “కార్యము రూపము దాల్చేదిగా ఉంది”. ఇంతవరకు జరగలేని పరిస్థితులలో నీవు ఈరోజు చేసే ఆరాధనను బట్టి, ఆ కార్యము రూపము దాలుస్తుంది. ఒకవేళ రూపము దాల్చి కూడా ప్రత్యక్షపరచబడలేని స్థితిలో అది ప్రత్యక్షపరచబడి నెరవేర్చబడుతుంది. నమ్మి ఆరాధించు ప్రాక్టికల్ గా అనుభవించు.
Main message| మెయిన్ మెసేజ్
మనమున్న్న దినాలు ముగింపు దినాలు. విశ్వాసులకు ముగింపు దినాలు. ఎందుకంటే విశ్వాసము కలవారు త్వరలో ఎత్తబడతారు. మహాశ్రమ దినాలు ప్రారంభించబడతాయి. అందుకే ఈరోజుల్లో విశ్వాసము కలవారు మాత్రమే నిలబడతారు. అందుకే వాక్యము ఏమి చెప్తుంది అని గ్రహించి నడుచుకుందాము. నీ జీవితానికి నీవే బాధ్యత వహించాలి వేరెవరూ వహించరు. మనము ఎత్తబడాలి, ఒకవేళ విడువబడితే, మహా శ్రమలు ప్రారంభమవుతాయి. చుట్టూ జరుగుతున్న విషయాలు వింటుంటే, ఖచ్చితముగా సమయము దగ్గర పడింది. ఈ విషయము గ్రహించినవారు సిద్ధపడతారు.
రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా. పేతురుప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. – మత్తయి 14:25-28.
ఇక్కడ పేతురు ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు అయితే చూడగానే భూతమని భయపడ్డాడు. అయితే యేసు ఎప్పుడైతే “నేనే భయపడకుడి” అనగానే “నీవే అయితే” అని పేతురు మాట్లాడుతున్నాడు. ఈ విషయములు ధ్యానిస్తే, ఆయన విశ్వాసము ఎలా ఉంది అని గ్రహించగలుగుతాము. మొదటిగా భూతమని అనుకున్నాడు దానిని బట్టి భయపడుతున్నాడు. రెండవదిగా యేసు “నేనే” అని చెప్తున్నప్పటికీ నమ్మలేని వాడుగా ఉంటున్నాడు. ఇంతకు ముందు పేతురు భూతమును ఏమీ చూడలేదు. అయితే యేసుప్రభువును రోజూ చూస్తున్నాడు, వింటున్నాడు. అయితే ఎవరు చెప్పారు భూతమును గురించి? లోకములో చెప్పిన విషయాలు చూడనప్పటికీ వాళ్ళు నమ్మి రోజు వింటున్న యేసయ్య స్వరమును గ్రహించలేని వారుగా వాళ్ళు ఉన్నారు.
అందుకు యేసు- లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మత్తయి 22:29
మన జీవితాలలో మనము లేఖనములను ఎరగగలుగుతున్నామా? దేవుని శక్తిని ఎరిగిన వారుగా ఉన్నామా? లేక లోకములో చెప్పబడిన విషయాలనుబట్టి భయపడేవారుగా ఉంటున్నామా?
ఖచ్చితముగా మనము వాక్యమునే ఆధారముగా జీవించాలి. లోకములో చెప్పబడే సంగతులకంటే సంపూర్ణముగా దేవుని శక్తిని నమ్మగలగాలి. పేతురు జీవితము మనకు ఒక ఉదాహరణ. యేసు, “నేనే” అని చెప్పినప్పుడు పేతురు నిజానికి నమ్మగలగాలి. అయితే దేవుడు మన విశ్వాసమును మన్నించేవాడుగా ఉన్నాడు.
యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 8:10
ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా1 ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.- మత్తయి 9:2
అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మత్తయి 15:28
కొంతమందికి కొంచెమే విశ్వాసము ఉంది, మరికొంతమందికి పరిపూర్ణమైన విశ్వాసమే ఉంది. అయితే దేవుడు నీకున్నది కొంచెము విశ్వాసము అయినా సరే దానిని కూడా మన్నించేవాడుగా ఉన్నాడు.
అందుకే మనము ఎప్పుడూ మన విశ్వాసమును పరీక్షించుకోవాలి. లోకము చెప్పే విషయాలపై విశ్వాసముంచితే అది మరణమే! అయితే నీ విశ్వాసము దేవుని వాక్యముపైన, ఆయన శక్తిమీద ఉంటే అది జీవము!
పేతురుప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని 14:28-29
అయితే పేతురు లోకము చెప్పిన దానికి అసలు ప్రశ్నే రాలేదు. అయితే యేసయ్య “నేనే” అంటే దానిని నమ్మలేకపోతున్నాడు.
నిన్ను నన్ను నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడు. అందుకే మన విశ్వాసము ఆయన మీద ఉండాలి.
ఇక్కడ పేతురును గమనిస్తే, యేసయ్యతో ఉంటూ యేసయ్యను ఎరగలేని వాడుగా ఉంటున్నాడు అయినప్పటికీ దేవుడు ప్రేమగలిగినవాడుగా ఉన్నాడు. అందుకే “రమ్మని” సెలవిచ్చాడు.
ఇక్కడ మనము గమనించవలసినది – “దేవుడు అధికారము ఇచ్చినప్పుడు ఆ అధికారము నీ సందేహములలో, పరిస్థితులలో నిరూపించబడుతుంది”.
దేవుని జవాబు ఎలా ఉంటుంది? కార్యములచేత కనుపరచబడేదిగా ఉంటుంది.
28 వవచనములో, “నీవే అయితే నాకు కూడా సెలవిమ్మని” అడిగాడు. సెలవివ్వడము అంటే ఆజ్ఞాపించడము. అంటే యేసయ్య ఆజ్ఞ ఇవ్వగలిగినవాడు అని పేతురు నమ్మాడు. అంటే కొంతవరకు విశ్వాసము ఉంచాడు. మనముకూడా దేవుని మాట విన్నప్పుడు, కొంతవరకు విశ్వాసాన్ని కనపరుస్తాము. అయితే మన ప్రేమ గలిగిన దేవుడు ఆ కొంచెము విశ్వాసముకు సహితము మన్నించేవాడు అని గ్రహించు.
ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను – మత్తయి 14:30-31.
నీలో చిన్న ఆశ నీలో మొదలయ్యిందో, ఇంక ప్రభువును విడువకు. ప్రభువా నన్ను రక్షించు అని ఆయన మీద ఆధారపడు. అయితే ఆయ్న “ప్రభువు” అని గ్రహించి ఆనుకోవాలి. అయితే దేవుని శక్తి పేతురుకి ఇవ్వబడింది నీళ్ళపై నడవగలిగాడు కూడా. అయితే మరి ఎందుకు ములిగిపోయాడు? విశ్వాసము బట్టి దేవుని సూపర్ నేచురల్ శక్తిని పొందుకోగలుగుతాము. విశ్వాసము లేకపోతే ఇవ్వబడిన శక్తిని పోగొట్టుకుంటాము.
1. నీవే అయితే – అనగా ప్రభువు శక్తిని అంగీకరించుట
2. నడవటానికి సెలవిమ్ము – ఆ శక్తిని అనుభవించడానికి సెలవిమ్ము