ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను //ఆనంద//
1. ప్రభువొచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను
మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను //ఆనంద//
2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను //ఆనంద//
3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను //ఆనంద//
బేత్లెహేములో సందడి
బేత్లెహేములో సందడి – పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని – మహారాజు పుట్టాడని /బేత్లెహేములో/
1.ఆకాశములో సందడి – చుక్కలలో సందడి /2/
వెలుగులతో సందడి – మిలమిల మెరిసే సందడి /2/బేత్లె/
2.దూతల పాటలతో సందడి – సమాధాన వార్తతో సందడి /2/
గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి/2/బేత్లె/
3.దావీదు పురములో సందడి – రక్షకుని వార్తతో సందడి /2/
జ్ఞానుల రాకతో సందడి – లోకమంతా సందడి /2/బెత్లె/
రక్షకుడు పుట్టెను బేత్లెహేములో
రక్షకుడు పుట్టెను బేత్లెహేములో
రారాజై వెలిసేను పశువుల పాకలో
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ
ఆయనే ప్రభువైన క్రీస్తని – ఆయనే ఇమ్మానుయేలని
రారండి పూజించి కీర్తించేదం (2)
1. దూతలే స్తుతి పాడగా
గొల్లలే ఆరాధించగా (2)
పరిశుద్ధ ప్రభువే పసివాడై నేడు (2)
పాకలో పరుండే (2) || సర్వో ||
2 అంధకారమే తొలగించను
చీకటి బ్రతుకులన్ వెలిగించను (2)
నీతి సూర్యుడే వెలుగై నేడు (2)
ఇలలో ఉదయంచె (2) || సర్వో ||
3 పాపములను బాపను
శాపములను మాపను (2)
దేవాది దేవుడే గొఱ్ఱె పిల్లయి (2)
అవతరించె నేడు (2) || సర్వో ||
క్రిస్మస్ పరిచర్య
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము – మత్తయి 1:21-23
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను – యోహాను 3:16
సండే స్కూల్ పిల్లల స్పెషల్ సాంగ్
రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2)
లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను
లోక నాథుడై మరియకవతరించెను (2)
ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||
బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము
యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)
ఈ నాడే మనకు పండగ
రారండి ఆడి పాడగ (3) ||రాత్రి||
ఆకశాన తార ఒకటి బయలుదేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)
చిన్నారి యేసు బాబును
కళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి||
పొలములోని గొల్లవారి కనుల ముందర
గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2)
మేరమ్మ జోల పాడగా
జగాలు పరవశించెగా (3) ||రాత్రి||
లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను
భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2)
ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6
ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను.కొలొస్సీయులకు 1:19,20
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
5 మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను – గలతీ 4:4,5.
అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు – లూకా 2:10,11
సండే స్కూల్ పిల్లల స్పెషల్ సాంగ్స్
Song 1
1 Father, we thank Thee for the night,
And for the pleasant morning light;
For rest and food and loving care,
And all that makes the world so fair.
2 Help us to do the things we should,
To be to others kind and good;
In all we do, in work or play,
To love Thee better day by day.
Song 2
బుడి బుడి అడుగులు (to be updated)
Song 3
God’s love is sweet and wonderful (to be updated)
Song 4
మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు
మేడి చెట్టు పైకి ఎందుకెక్కారు (2)
మేడి చెట్టు పైకి జక్కయ్యెక్కాడు
యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు (2)
మేడి చెట్టు కింద ఎవ్వరాగారు
చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు (2)
మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడు
యేసును జక్కయ్యింట చేర్చుకున్నాడు (2)
ఓ.. ఓ.. ఓ తమ్ముడా
ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)
యేసుని నీవు చేర్చుకుంటావా
నీ హృదయములో స్థానమిస్తావా (2)
ఓ.. ఓ.. ఓ తమ్ముడా
ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)
Memory Verses by Sunday School Kids (Watch in the YouTube channel @54:00 on the timeline)
Song 5
Telephone to Jesus
Telephone to Jesus
Telephone to Jesus everyday
Telephone to Jesus
Telephone to Jesus
Telephone to Jesus everyday
I want to talk to Jesus
I want to talk to Jesus
I want to talk to Jesus everyday
I want to talk to Jesus
I want to talk to Jesus
I want to talk to Jesus everyday
Jesus says He loves me
Jesus says He loves me
Jesus says He loves me everyday
Jesus says He loves me
Jesus says He loves me
Jesus says He loves me everyday
Song 6
కావ్ కావ్ అంటున్న నల్ల కాకి (lyrics to be updated)
Song 7
Rel gaadi rel gaadi chikbuk chikbuk rel gaadi (Lyrics to be updated)
Song 8
God loves you and God loves me (Lyrics to be updated)
సండే స్కూల్ పిల్లలు బైబిల్ పుస్తకాల గురించి చెప్పినారు. (Watch in the YouTube channel @1:12:50 on the timeline)
రంగుల గురించి సండే స్కూల్ పిల్లల కథ (Story about colors) (Watch in the YouTube channel @1:19:00 on the timeline)
Song 9
colors colors five pretty colors (Lyrics to be updated)
Song 10
There were 12 disciples
Jesus called to help Him.
Simon Peter, Andrew,
James, his brother John,
Philip, Thomas, Mathew,
James the son of Alphaeus,
Thaddeus, Simon, Judas and Bartholomew.
He has called us too.
He has called us too.
we are His discples,
I am one and you.
He has called us too.
He has called us too.
we are His discples,
we His work must do.
Song 11
(Verse 1) I believe the Bible, I believe the Bible, I believe the Bible is the Word of God.
(Verse 2) I believe in Jesus, I believe in Jesus, I believe in Jesus, He’s the Son of God.
(Verse 3) You and I have sinned, you and I have sinned, you and I have sinned and that makes God sad.
(Verse 4) Jesus died for sinners, Jesus died for sinners, Jesus died for sinners, Jesus died for me.
(Verse 5) Jesus Christ is risen, Jesus Christ is risen, Jesus Christ is risen, He arose for me.
(Verse 6) Will you now receive Him, will you now receive Him, will you now receive Him and be saved today?
Song 12
ఇది నా బైబిల్ ఇది నా సొంతం (Lyrics to be udpated)
Song 13
JESUS CHRIST, JESUS CHRIST
Was born for you and me
To save us all from sin He came
That we might all be free
And bought our victory
JESUS CHRIST, JESUS CHRIST
ఆరాధన వర్తమానము
క్రిస్మస్ అనగానే అనేకులము అనేకరకాలగా సిద్ధపడతారు. ఆహారము, అలంకరణ మొదలైన అనేకమైన ఏర్పాట్లతో సిద్ధపడతారు. అయితే యేసును కలిగిలేకపోతే ఆ సిద్ధపాటుకు అర్థము ఉండదు. మనము ఎంతో ధన్యులము లేఖనాలను పరిశీలిస్తే మనకు దొరికిన ధన్యత అర్థమవుతుంది. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట అని అర్థము.
మరియు దేవుడు మోషేతో ఇట్లనెనునేనే యెహోవాను; నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు – నిర్గమ కాండము 6: 2,3.
సర్వశక్తిగల దేవుడు అనే పేరుతో అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు కానీ “యెహోవా” అనే పేరు తో తెలియలేదు. అయితే మనకు గల ధన్యత ఏమిటి అంటే ఆ సర్వశక్తిగల దేవుడు శరీరుడుగా మనకొరకు జన్మించాడు.
అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెద రని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. – లూకా 2:10-14
మన పితరులకు సర్వశక్తిమంతుడుగానే తెలుసు గానీ మన కొరకు పుట్టిన మన యేసు ప్రభువు ఏమై ఉన్నాడు అని చూస్తే,
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును – యెషయా 9:6
ఈ విషయము మనకు అర్థము అయితే మనము కూడా దూతలవలే సంతోషముతో ఆనంద స్తుతి గానములు చేసేవాళ్ళుగా ఉంటాము. క్రీస్తును కలిగి, క్రీస్తు కొరకు, క్రీస్తుకు మహిమ కొరకు జీవించడమే నిజమైన క్రిస్మస్ ఆనందము అయి ఉన్నది.
ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. – తీతు 2:14
నీవు దుర్నీతి నుండి విమోచించబడటము కొరకు ప్రభువైన యేసు ఈ లోకములో జన్మించాడు. సర్వశక్తిమంతుడు, ఆలోచన కర్త, ఆశ్చర్యకరుడు అయిన దేవుడే నీవు వెతకకపోయిన నీకు దొరికినవాడుగా ఉన్నాడు. అపవాది అనేకమైన కుతంత్రములచేత చుట్టుకొని యుండగా ఆ స్థితిలోనుండి నిన్ను విడిపించుట ఆ దేవుని చిత్తము అయి ఉన్నది. కొంతకాలము ఆ స్థితిలో ఉన్నప్పటికీ, ఖచ్చితముగా యేసయ్య నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు. ఈ విమోచన మన శక్తిసామర్థ్యాల వలన రాలేదు గానీ దేవుని ప్రేమ వలన మనకు కలిగినది.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16
“నేను విమోచించబడటము దేవుని ఉద్దేశ్యము మరియు నేను యేసయ్యను బట్టి విమోచించబడతాను” అనే సత్యమును నమ్ము.
విమోచించబడిన నీవు “తన కోసము సత్క్రియలు చేయటము కొరకు” ప్రత్యేకించబడ్డావు, ఏర్పాటుచేసుకోబడ్డావు మరియు సొత్తుగా చేసుకోబడ్డావు. ఈ లోకములో ఉన్నవారికి నీవు ఎలా కనబడినప్పటికీ, దేవాదిదేవుని దృష్టిలో ఎంతో విలువైనవాడవు. ఈ ఏర్పాటు శాశ్వతమైన ఏర్పాటు. యుగయుగములు నిలిచివుండే ఏర్పాటు.
ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను – కొలస్సీ 1:19,20
ఆయనద్వారా అనగా యేసయ్య ద్వారా భూలోకమందున్నవైనా, పరలోకమందున్నవైనా సరే యేసయ్య ద్వారానే జరగాలి అనేది తండ్రి చిత్తము అయి ఉన్నది. యేసయ్యను కలిగి ఉన్న నీవు భూలోకములో ఏ ఆశీర్వాదమైన సరే, పరలోకమందున్న నిత్యజీవమైనా సరే ఆయన ద్వారా స్వతంత్రించుకోగలుగుతాము. అందుకే “నేనే మార్గము” అని యేసయ్య చెప్పినాడు. అందుకే మనము దేనికీ భయపడనవసరము లేదు.
పాతనిబంధనలో దేవుడు ప్రజలకొరకు దిగివచ్చాడు అయితే వారు తృణీకరించినవారుగా ఉన్నారు. అయితే మరి నీవు ఏమి చేయబోతున్నావు? నీవు నమ్మి ఆయనను అంగీకరించిన యెడల నీకె ఎంతో మేలు.
అన్యజనులలో ఈ మర్మముయొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి… – కొలస్సీ 1:27.
యేసు కలిగిన మనలో ఆయనలో ఉన్న మహిమైశ్వర్యము కూడా ఉన్నది. ఆ మహిమ ప్రత్యక్షమయ్యే దినాలలో మనము ఉన్నాము.
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. – రోమా 3:23
పాపములో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోయాము. అయితే క్రీస్తును కలిగిఉన్నప్పుడు మనలో ఆయన మహిమ మనలోనే నివసిస్తుంది. ఎంత ధన్యత మనకు దొరికింది ఈ క్రిస్మస్ దినాన? ఈ సంగతి అర్థమైనప్పుడు మనము నిజమైన ఆరాధన మనము అర్పించగలుగుతాము.
ఈ లోకము అపవాది అధికారములో ఉంది. అయితే ఈ లోకములోనే మనము కూడా జీవిస్తున్నాము. ఈ లోకములో మనము సురక్షితముగా జీవించాలి అంటే క్రీస్తును కలిగే మనము జీవించగలుగుతాము.
ఆరాధన గీతము
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా
పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2) ||హల్లెలూయా||
స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2) ||హల్లెలూయా||
Main Message | మెయిన్ మెసేజ్