14-05-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్రగీతము – 1

స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య (4)

శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము
||యేసయ్య||

పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ
||యేసయ్య||

స్తోత్రగీతము – 2

ప్రేమ.. యేసయ్య ప్రేమా – 4
మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ – 2

1. తల్లి మరచిన గానీ – నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గానీ – నను విడువనన్న ప్రేమ = 2
నేనేడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమ
తన కౌగిట్లో – నను దాచుకున్న ప్రేమ = 2
|| ప్రేమ ||

2.నేను మరచిన గాని నను మరువనన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా
|| ప్రేమ ||

3.. నేను పుట్టకముందే – నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే – ఏర్పరుచుకున్న ప్రేమ = 2
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
యెదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ = 2
|| ప్రేమ ||

స్తోత్రగీతము – 3

సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
మా దుఃఖ దినములు సమాప్త పరిచావు

సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం
మా దేవా నీకే అర్పితం”

1. నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో
దీవెన కలదు నీ ప్రతి మాటలో
విడువను ఎడబాయనని
వాగ్ధానమిచ్చి బలపరిచావు /2/సంతోషం/

2. రక్షణ ఆనందం మాకిచ్చావు
మా క్రయధనమంత చెల్లించావు /2/
ఏ తెగులు నీ గుడారమును
సమీపించదని సెలవిచ్చావు /2/సంతోషం/

ఆరాధన వర్తమానము

మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మన కెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.౹ -1 యోహాను 3:1

మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు మనకొరకు “ప్రేమ” ను అనుగ్రహించారు. మన పాత రోజులలో గ్రామాలలో, పిల్లలను ఫలానా వారి పిల్లలు అని పిలిచేవారు. ఆ పిలుపు వారి తండ్రి యొక్క ఆస్తి, పరపతి, మంచితనము బట్టి వారి పిల్లలను పిలిచేవారు. అలాగే మనము దేవుని పిల్లలుగా పిలువబడునట్లు మనకు ఆయన ప్రేమను అనుగ్రహిణ్చారు.

అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు.౹ -ఎఫెసీయులకు 2:4

మన యొక్క మొదటి స్థితి ఏమిటి అంటే, “పాపము వలన చచ్చిన స్థితి”. అయితే మనము “పరిశుద్ధత కలిగి జీవము గల వారిగా” ఉండాలి అని దేవుని చిత్తము అయి ఉన్నది. దీనికొరకు దేవుడు తన “ప్రేమను” అనుగ్రహించాడు. అయితే మనము ఏమి చేస్తే మనము పరిశుద్ధమైన జీవితము మనము కలిగి ఉంటాము? ఈ లోకానుసారముగా ఏమి చేసినా సరే పరిశుద్ధత గానీ, జీవము గానీ మనము పొందలేము.

ఒకవేళ నీలో జీవము లేకుండా ఉన్నట్టయితే, ఈ సత్యము గ్రహించు. ప్రభువా నీవు నన్ను ప్రేమిస్తున్నావని నేను నమ్ముతున్నాను. నీ ప్రేమను బట్టి నేను నీ కుమారునిగా చేయబడ్డాను గనుక, నాలో కూడా నీ జీవము ఉంటుంది అని నేను నమ్ముతున్నాను.

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.౹ -యోహాను 1:12

అధికారము ఏమి జరిగిస్తుందో చూద్దాము.

నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను. -మత్తయి 8:9

అధికారము కలిగినవాడు ఏమి చెప్తే అది జరుగుతుంది. ఇప్పుడు మనకు దేవుని పిల్లలగుటకు అధికారము కలిగింది. ఈ అధికారము ఏమి చేస్తుంది? దేవుడు ఏమై ఉన్నాడో అదేవిధముగా మనమునూ ఉండులాగున మనకు అధికారము పనిచేస్తుంది. ఆ అధికారమును బట్టి, జీవము కలిగిన వారిగా మార్చబడతాము.

మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు. -గలతీయులకు 3:29

యేసు క్రీస్తుని అంగీకరించిన మనము దేవుని పిల్లలము అయి ఉన్నాము. దేవుని పిల్లలమైన మనము వాగ్దానమునకు వారసులై ఉన్నాము. దేవునికి వ్యతిరేకముగా నడిచిన సందర్భములో నీ కుమారునిగా అనిపించుకోవడానికి అర్హుడను కాదు అని అంటాము. అయితే దేవుడు చెప్తాడు, నీవు వాగ్దానము ప్రకారము వారసుడవే అని.

ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. -1 పేతురు 2:10

మన స్థితిగతులు ఎరిగిన దేవుడు మనలను కనికరించడానికి కారణము – ఆయన ప్రేమ. మనము పుట్టక మునుపే మనలను ఎన్నుకున్నాడు.

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.౹ మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:29-30

“తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను” అంటే, దేవుని పిల్లలుగా ఉండుటకు ముందుగా నిర్ణయించాడు. ఈ లోకములో తప్పిపోయినప్పటికీ, వదిలిపెట్టక తిరిగి సమకూరుస్తున్నారు. ఈ సత్యమును ఎరిగినట్టయితే నీవు ఆయనను ఆరాధించకుండా మౌనముగా ఉండలేవు.

యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను. -కీర్తనలు 89:1

ఆరాధన గీతము

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్
తల్లి ప్రేమను మించినది
లోక ప్రేమను మించినది
నిన్ను నేను ఎన్నడు విడువను
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగా జీవింతున్

నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్
ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై
నీ పోలికగా ఉండుటకై
నా సర్వము నీకే అర్పింతున్
పూర్ణానందముతో నీకే అర్పింతున్

నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్
మేఘ రధములపై రానైయున్నాడు
యేసురాజుగా రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి
స్వర్గ రాజ్యములో యేసున్
సత్యదైవం యేసున్ *”నిత్య ప్రేమతో”*

టొదయ్ యౌ రెమిందెద్ మె థత్ యౌ

మెయిన్ మెసేజ్

దేవుని ప్రేమను ఎరిగినవారు సిగ్గుపడరు. దేవుని ప్రేమ మనలను సంపూర్ణులనుగాను, పరిపూర్ణులుగాను చేస్తుంది. ఈరోజు మనము “మీరు ఎదగాలి” అనే విషయము నేర్చుకుందాము.

మన అందరము జీవితములోను, ఆత్మలోను ఎదగాలి అనే ఆశ ఉంటుంది. అయితే మన జీవితములో మనము ఎదగాలి అంటే ఏమి చెయ్యాలి? అసలు మనకు మనమే ఏదో ఒకటి చేసి ఎదిగిపోగలమా? మనకు మనము సిద్ధపరచుకున్నది ఎక్కడో ఒకచోట, ఎదో ఒక సమయములో నశించిపోతుంది. అయితే మనము ఏమి చేయాలి.

ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండ వలెనని ప్రార్థించుచున్నాను.౹ -3 యోహాను 1:2

అసలు ఆత్మ ఎలా వర్థిల్లుతుంది? వాక్యము ప్రకారము నడుచుట ద్వారా ఆత్మలో ఎదుగుతాము. అయితే ఈ వాక్యము ఏమి చెప్తుంది? దేవుడు ఏమై ఉన్నాడో అనే సంగతి తెలియచేస్తుంది. ఈ సత్యము ఎరుగుట ద్వారా మన జీవితము మార్చబడుతుంది.

అయితే ఒక్కోసారి మనము దేవుని పట్ల అలిగేవారముగా ఉంటాము. అయితే ఈరోజు సత్యమును నేర్చుకుందాము.

అప్పుడు అతని పెద్దకుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి–ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో–నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో–ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు–కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను. -లూకా 15:25-32

ఇక్కడ పెద్ద కుమారుడు తన తండ్రి మీద అలిగాడు. అలిగి ఈ విధముగా చెప్పుచున్నాడు, “ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు”. నిజానికి చూస్తే, ఈ పెద్ద కుమారుడు, తండ్రితోనే ఉన్నాడు తండ్రి ఆజ్ఞను మీరలేదు. అయితే ఇప్పుడు తన తండ్రి మీద అలిగాడు. ఎందుకంటే, తాను ఏమి కలిగి ఉన్నాడో ఎరిగి ఉండకపోవడమే. తన తండ్రి చెప్పిన మాట చూస్తే, “నావన్నియు నీవి”, అనగా తండ్రి కలిగి గొర్రెలు, మేకలు ఆస్తి అన్నీ అతనివే అనే విషయము తాను ఎరిగి ఉండకపోవడము బట్టి అతను అలిగాడు.

మనము కూడా మనము పోగొట్టుకున్నవాటిని బట్టి, జరిగిన నెగటివ్ విషయాలను బట్టి మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేని వారిగా ఉంటాము. అయితే మనము పోగొట్టుకున్న దానిని బట్టి గాక, మనము కలిగి ఉన్నదానిని బట్టి సంతోషించి ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఇది కేవలము ఆయన ఏమై ఉన్నాడో ఆ విషయము ఎరిగి ఉన్నప్పుడే. అందుకే మనము ఆయనను తెలుసుకునే విషయములో ఎదగాలి.

ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి–పిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె–నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడ వేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన–ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె యింటికి వచ్చి, తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను. -మార్కు 7:26-30

“పిల్లలు మొదట తృప్తి పొందవలెను” ఎవరు ఈ పిల్లలు? యేసయ్యను అంగీకరించిన నీవు నేను దేవుని పిల్లలమే. అంటే నీవు నేను మొదట తృప్తిపొందాలి అనేది దేవుని చిత్తము. అందుకే జక్కయ్య తృప్తి పరచబడకుండా యేసయ్య దాటిపోలేదు.

“పిల్లల రొట్టె” అంటే తండ్రి పిల్లల కొరకు సిద్ధపరచినది. “పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను” అంటే, నీకొరకు సిద్ధపరచినది నీకు మాత్రమే. అదివేరేవాళ్ళకు చెందదు. మరొకలా చూస్తే, విశ్వాసులు మాత్రమే మొదట తృప్తి చెందాలి ఆ తరువాతనే వేరొకరు. అయితే విశ్వాసులు అంటే, ఆయనతోనే ఉండి, ఆయన ఆజ్ఞను మీరక జీవించువారు.

బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.౹ -గలతీయులకు 4:1

దేవుని గూర్చి ఎరిగి ఉండుటలో “బాల్యదశ” నుండి ఎదగాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఎమై ఉన్నాడో, ఆయనలో ఏమి నీవు కలిగి ఉన్నావో నీవు తెలుసుకోగలుగుతావు.

బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.౹ -కొలొస్సయులకు 2:3

“నావన్నియు నీవి” అంటే, ఆయన కలిగి ఉన్న బుద్ధి, జ్ఞానముల సర్వసంపదలు నీవే అని అర్థము. అయితే ఒక సత్యము మనము ఎరిగి ఉండాలి. మనము ఎలా ఆయన ఆజ్ఞలను మీరకుండా ఉండగలము? అని ఆలోచన రావచ్చు. అయితే “ఈ దినము” గురించి మొదట ఆలోచిద్దాము. ఈ దినము ఆయతో ఉన్నామా? ఆయన ఆజ్ఞను పాటించామా అని మనము చూసుకోవాలి. ఇది యదార్థముగా జరిగించాలి. అంటే, తప్పైతే తప్పు అని ఒప్పైతే ఒప్పు అని నిజాయితీ గా ఉండటము. అంతే కాక, తప్పు అని ఒప్పుకొన్న తరువాత అదే తప్పు చేయకూడదు. హృదయ రహస్యాలు సహితము ఎరిగినవాడు మన దేవుడు, గనుక యదార్థముగా ఆయనను వెంబడించినప్పుడు ఆయన కలిగినవన్నీ మనవే.

ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది -కొలొస్సయులకు 2:9

“సర్వపరిపూర్ణత” అంటే అన్ని విషయాలలో పరిపూర్ణత క్రీస్తునందు ఉన్నవి.

మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు;౹ -కొలొస్సయులకు 2:10

ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుని జీవించగలిగితే, మన జీవితములు సంపూర్ణము చేయబడతాయి.

కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.౹ -యోహాను 6:53

ఆయన శరీరము మనము తినినప్పుడు మనము జీవము కలిగినవారుగా ఉంటాము.

కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమునుగూర్చియు రక్తమునుగూర్చియు అపరాధియగును.౹ కాబట్టి ప్రతిమనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.౹ -1 కొరింథీయులకు 11:27-28

ఆయనలో సర్వపరిపూర్ణత ఉంది. ఆ సర్వపరిపూర్ణత నీలోనికి రావడానికి ఆయన అనుమతించాడు. అయితే ఆయన ఆజ్ఞలు నేను పాటిస్తున్నానా? ఆయన తో నేను ఉంటున్నానా అని యదార్థముగా నిన్ను నీవు పరీక్షించుకొని అనుదినమూ జీవించినప్పుడు ఆ సర్వపరిపూర్ణత నీవు అనుభవించగలుగుతావు.

సిలువలో చెల్లించిన వెల, పునరుత్థానము యొక్క జీవము క్రీస్తు శరీరములోనే ఉన్నది. ఈ సత్యము ఎరిగి మనము ఆయన శరీరములో పాలు పంపులు కలిగి ఉన్నప్పుడు, తండ్రి కలిగినవన్నీ అనగా ఆయనలో ఉన్న సర్వ పరిపూర్ణత మనదే.

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;౹ -2 కొరింథీయులకు 5:17

“క్రీస్తునందున్నయెడల” అనేది కండిషన్. క్రీస్తునందున్నయెడల అంటే, క్రీస్తుతో ఉండటము, క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తూ జీవించడము. అప్పుడు క్రీస్తులో ఉన్నవన్నీ మనవే. అలాగే మనము దినదినమూ నూతన పరచబడతాము. అయితే గతించిపోయిన పాతవి ఏమిటి? గతించిపోయేది లోకము. గనుక క్రీస్తు యేసునందు ఉన్నవారిలో లోకపు విషయాలు గతించిపోయి, దేవుని విషయాలు నూతన పరచబడతాయి. అందుకే దేవుని గూర్చిన విషయాలలో మనము ఎదగాలి. ఆ విషయాలలోనే మనసుపెట్టేవారిగా ఉందాము.