ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను నాట్యమాడెదన్ – 2
నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను
దావీదువలె నేను నాట్యమాడెదన్
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను పాటపాడెదన్ – 2
పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను
దావీదువలె నేను పాటపాడెదన్
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను స్తుతించెదను
స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను
దావీదువలె నేను స్తుతించెదను
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట సత్యముగలదయ్యా
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
నీ మాట మరిచిపోనిదయ్యా{2⃣}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
{నీ మాట}
1. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
బంధించబడిన వారిని విడిపించును నీ మాట{2⃣}
త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట{2⃣}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
{నీ మాట}
2. సింహల బోనులో నుండి విడిపించును నీమాట
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట{2⃣}
మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట{2⃣}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
{నీ మాట}
నువ్వెంతగా దేవుని నమ్ముతావో అంతగా నీవు గొప్ప కార్యములు చూడగలుగుతావు. భౌతికముగా జీవితాన్ని సెటిల్ చేసుకోవాలి అని ఎంతో ప్రయాసపడతాము. అయితే క్రైస్తవ జీవితము దేవుని చేత సిద్ధపరచబడినది పొందుకుంటూ ముందుకువెళ్ళడమే!
వాక్యములో ఎవరైతే లోతుగా నాటబడతారో వారు గొప్ప కార్యములు చూడగలుగుతారు. సమూయేలు ఉండుటను బట్టి, దేవుని ఆత్మ ఉండుటను బట్టి శత్రువు వారి జీవితాలను ముట్టలేకపోయాడు.
ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తునుగూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. -రోమా 16:25
ఎటువంటి విషయాలలో ఆయన శక్తిమంతుడు అనేది నీవు తెలుసుకోవాలి. దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచడానికి శక్తిమంతుడు అయి ఉన్నాడు. అందుకే నీవు నీ దేవుడు ఏమై ఉన్నాడు అని నీవు తెలుసుకోవాలి. నీ జీవితము కొరకు అపవాదికి దేవునికి ఎప్పుడూ యుద్ధమే! అపవాది నీ జీవితమును మ్రింగడానికి, దేవుడు నీ జీవితమును నిలబెట్టడానికి నీ జీవితము చివరివరకు నీతోనే ఉంటాడు.
నిన్ను స్థిరపరచడానికి దేవుడు శక్తిమంతుడు గనుకు నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నీ దేవుడు ఏమై ఉన్నాడో యెరిగి ఉండు.
జెకర్యా–యిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా దూత–నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. -లూకా 1:18-19
అనేక సందర్భములలో “ఇది ఎలా జరుగుతుంది” అనే ప్రశ్న మనకు కూడా వస్తుంది. జెకర్యా జీవితములో ముసలి వయసులో కుమారుడు అనుగ్రహించబడ్డాడు.
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి–దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి–ఈ శుభవచన మేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత – మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ణ్.ఆ ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా -లూకా 1:28-34
మరియ యవ్వన స్థితిలో ఉంది ఇంకా వివాహము జరగలేదు అయినా సరే దేవుని మహిమను బట్టి కుమారుడు అనుగ్రహించబడ్డాడు.
ఎలీసబెతు జెకర్యా భార్య భర్తలు అయితే మరియ యవ్వన స్థితిలో ఉంది. పిల్లలు పుట్టాలి అంటే భార్యా భర్తలు కలిసి ఉండాలి. ఇక్కడ రివలేషన్ ఏమిటి అంటే,
సోర్స్ ఉండి సహకరించే పరిస్థితి లేదు ఇది జెకర్యా స్థితి. సోర్స్ లేదు కానీ సహకరించే పరిస్థితి ఉంది. ఇది మరియ పరిస్థితి. మన జీవితములో ఉదాహరణకు ఒకడు బాగా చదివాడు గానీ ఉద్యోగ అవకాశములు లేవు. మరొకడు బాగ చదవలేదు గానీ అనేకమైన అవకాశములు చుట్టూ ఉన్నాయి. మన దేవుడు శూన్యములోనే సమస్తమును సృష్టించగలవాడై ఉన్నాడు. దేవుడు స్థిరపరచడానికి సోర్స్ తో సంబంధము లేదు. అయితే నీవు సిద్ధపడి ఉండటమే మనము చేయగలిగినది.
నీ సిద్ధపాటు ప్రకారము నీ జీవితములో స్థిరపరచబడుతుంది. అందుకే నీవు స్వీకరించడానికి సిద్ధముగా ఉండాలి. దేవుని ఆలోచనలోనే నీవు పుట్టావు. నీవు పుట్టినప్పుడే నీకొరకు సిద్ధపరచాడు. తండ్రి ప్రేమను నీవు గ్రహించగలుగుతున్నావా? నీవు ఏడిస్తే నీ తండ్రి తట్టుకోగలుగుతాడా? వారు చెయ్యగలిగినదంతా వారు చేస్తారు. అయితే వారు చెయ్యలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే నీ దేవుడికి చెయ్యలేని పరిస్థితి అంటూ ఏమీ లేదు, నీ దేవుడు మాట ఇస్తే చాలు ఆ ప్రకారముగా జరుగుతుంది.
నేను స్థిరపరచబోతున్నాను అని దేవుడు చెప్పుచున్నాడు. ఇంతవరకు చూడని ఆశీర్వాదములు చూడబోతున్నారు. దేవుడు మాట ఇవ్వడము, నీవు దానిని స్వీకరించడము. ఈ రెండే అత్యంత ప్రాముఖ్యమైనవి. నీ అశీర్వాదము కొరకు సోర్స్ సృష్టించి నిన్ను స్థిరపరచేవాడు నీ దేవుడు.
వృద్ధి కలుగచేయబడటానికి ఇదే నీ సమయము అని దేవుడు నిర్ణయించాడు. లేనిది ఉన్నట్టుగా చేస్తున్నాడు, మృతమైనది జీవింపచేస్తున్నాడు నీ దేవుడు.
బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. -మత్తయి 11:12
మరొక వాక్యము చూస్తే,
ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ–భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనముచేయుచువచ్చెను.౹ -2 రాజులు 4:8
యాకోబు జీవితములో కూడా పెనుగులాడి, నన్ను ఆశీర్వదిస్తేనే గానీ నేను వదలను అనే రీతిలో మనము ఉండాలి. మీరు నమ్మి స్వీకరించి ప్రకటించింది నెరవేర్చబడే సమయము వచ్చుచున్నది. దేవునినుండి పొందడానికి నీవు చూపించే బలమైన ఆసక్తి దేవునినుండి నీవు పొందేవానినిగా చేస్తుంది.
అప్పుడు వాడు–యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా –ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగా–దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను. అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన–నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు–ప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను. -లూకా 18:38-41
అందుకే, దేవునినుండి పొందడానికి నీవు చూపించే బలమైన ఆసక్తి దేవునినుండి నీవు పొందేవానినిగా చేస్తుంది. ఆటంకములు వచ్చినా సరే, మరి ఎక్కువగా నీ ఆసక్తి కనపరచాలి. ఆ ఆసక్తి నీవు చేసే ప్రార్థనలలో కనపరచాలి.
నీవు తలపెట్టినది మధ్యలో ఆగిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు నమ్ము దానిని నీ దేవుడు ముగించేవాడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషేద్వారా అద్భుతముల ద్వారా సగము దూరము నడిపించబడ్డారు. ఆ తరువాత కూడా యెహోషువ ద్వారా మిగతా సగము దూరము అద్భుతములద్వారానే స్థిరపరచబడుతుంది.
ఆమె ఈ మాట చెప్పి వెళ్లి–బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను.౹ -యోహాను 11:28
నీ యజమానుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను పిలచుచున్నాడు. ఈరోజు నీ దగ్గర నిలబడినవాడు యజమానుడు.
నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.౹ -జెఫన్యా 3:17
నీ యజమానుడు నీ దగ్గర నిలుచున్నది ఎందుకు? నిన్ను పిలుచుచున్నది ఎందుకు? ఏ విషయములో నీవు దుఃఖములో ఉన్నావో, దేనికొరకు దుఃఖముతో ఆశ కలిగి ఉన్నావో ఆ విషయములో నీకు దయచేయుటకు, నెరవేర్చుటకు. మరి నీవు నీ ఆసక్తి ఎలా కనపరుస్తావు? మరియ అయితే పరుగున వచ్చింది. నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చడానికి దేవుడు నిన్ను పిలిచాడు.
నీ దేవుడు నీకు అన్యాయము చెయ్యడు, అన్యాయము జరగనివ్వడు.
నీవు పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటావు