స్తోత్ర గీతములు
నన్నాకర్షించిన నీ స్నేహబంధం
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
యేసు నన్ను విమోచించెను పాపము నుండి
యేసు నన్ను రక్షించెను అపవాది క్రియ నుండి
నే పాడెద హల్లేలూయ నే పాడెద హల్లేలూయ
నే పాడెద హల్లేలూయ నే పాడెద హల్లేలూయ
ఆరాధన వర్తమానము
దేవుని మాటలో శక్తి ఉంది, అద్భుతము ఉన్నది. ఆయన తన మాట ద్వారానే సమస్తము నిర్మించినవాడుగా ఉన్నాడు. ఇది మరెవరి వలన కాని కార్యము. అబ్రహాము జీవితములో వాగ్దానము ఇచ్చి నెరవేర్చినవాడు, మన జీవితములో కూడా దేవుని తన వాగ్దానములు ఇచ్చి నెరవేర్చగలిగినవాడు. అందుకే నమ్ముట నీవలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యము చెప్పుచున్నది.
ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా, అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను – ఆదికాండము 22:1-2
ఇక్కడ దేవుడు అబ్రహామును దేవుడు పరీక్షిస్తునాడు. లేకలేక కలిగిన కుమారుని దేవుడు అడిగితే అర్పిస్తాడా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే, దేవుడు ఇచ్చిన దానిని దేవునికొరకు వాడతామో లేదో అని దేవుడు మనలను కూడా పరీక్షిస్తాడు.
దేవుని మార్గములు మనుష్యుల మార్గములవంటివి కాదు. మన ద్వారా ఆయన ఏమి నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాడో, అది ఖచ్చితముగా మన ద్వారానే నెరవేర్చుకుంటాడు.
నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు – ఆదికాండము 22:17
మన జీవితములో అద్భుతములు దేవుడు జరిగించాలి అంటే, దేవుని చిత్తమునకు లోబడిపోవాలి. శోధనలు వచ్చినా సరే ఆయన చిత్తమునకు లోబడి ఉండాలి. మన చుట్టూ ఈ దినములలో అనేకమైన భ్రమపరిచే బోధనలు ఉన్నాయి. వాటినుండి మనము తప్పించుకోవాలి అంటే మనము దేవుని చిత్తమునకు లోబడాలి.
దేవుని చిత్తము దేవుని మాట అయిన వాక్యము ద్వారానే మనకు అందించబడుతుంది. అది జీవగ్రంధములోని మాటల ద్వారానూ, ఆయన ఏర్పరిచిన తన సేవకుల ద్వారానూ ఆయన తన చిత్తమును తెలియచేస్తాడు.
అబ్రహాము దేవుని ఎంతగానో నమ్మాడు. అందుకే ఇస్సకును అర్పించినా దేవుడు తనకు సంతానమును కలుగచేస్తాడు అని నమ్మాడు. మనము కుడా దేవునిని గుర్తించాలి, ఆయనకు విలువ ఇచ్చే జీవితములుగా సిద్ధపడాలి.
మన పాపముల నిమిత్తము ప్రాణము పెట్టిన దేవుడు, మన జీవితములు మార్చడము సాధ్యమే కదా! అయితే ఆయన మార్చగలడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి. దేవునికి నమ్మకస్తులుగా మనము ఉండాలి.
మృతతుల్యమైన గర్భమును జీవింపచేసి ఆశీర్వాదముతో నింపివేసాడు. అయితే దేవుడు చెప్పిన తరువాత వెంటనే ఆ వాగ్దానమును ఒడిసిపట్టుకున్నపుడు, అటువంటి అనుభవము మనము కూడా కలిగి ఉండగలుగుతాము.
నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. – ఆదికాండము 28:14
నీ విశ్వాసము, దేవుని పై నీకున్న నమ్మకత్వమునుబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన కాదనడు. అయితే మనము దేవుని మహిమ కొరకు మనలను మనమే సిద్ధపరచుకోవాలి.
శ్రమ వెంబడి ఆశీర్వాదము ఉంది గనుక శ్రమ వచ్చినపుడు మనము భయపడవలసిన అవసరము లేదు. దేవుని మాటలు పట్టుకోగలిగినపుడు మనము దేనికి భయపడవలసిన అవసరము లేదు. అయితే మన జీవితములో జరిగే ప్రతి విషయములో దేవునికి మహిమ కలగవలసినదే!
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఎదిరించినపుడు గొల్యాతు ఒక్కడే వారందరినీ భయపెట్టాడు. అయితే అది దావీదును వెలుగులోనికి తీసుకురావడానికి ఆ పరిస్థితిని అనుమతించాడు.
అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువా రందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. – 1 సమూయేలు 17:47
మన దేవుడు యీరే, రాఫా గనుక మనలను చూసేవాడు, మనకు స్వస్థత కలిగించేవాడు ఆయనే గనుక, ఆయన సన్నిధికి రావడానికి ఆసక్తి కలిగినవారిగా మనము ఉండాలి. నీవు భారము మోసుకొంటూ నీవున్న పరిస్థితిలో మగ్గిపోకుండా, దేవుని సన్నిధికి వస్తే, నీ శ్రమ, భారము తీసివేసి నిన్ను తేలికపరచేవాడు నీ దేవుడు.
ఆరాధన గీతము
అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
వారము కొరకైన వాక్యము
నమ్మకస్తులైన వారిని గూర్చి దేవుడు కనిపెట్టుచున్నాడు. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మహిమపరచబడాలి ఆయన కోరుకుంటాడు.
ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను – అపొస్తలుల కార్యములు 13:21-22
ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్న ప్రకారము, సౌలును దేవుడు వారికి రాజుగా నియమించాడు. అయితే సౌలు చేసిన తప్పిదమును బట్టి, అతడు రాజ్యమును కోల్పోయాడు. సమూయేలు చేయవలసిన పనిని సౌలు చేయడము ద్వారా, అతడు తన ఆశీర్వాదమును కోల్పోయాడు.
నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అని దేవుడు చెప్పాడు. ఈ మాట మన అందరి జీవితములో ఖచ్చితముగా నెరవేర్చాలి, ప్రయాస పడాలి. అప్పుడు, ఆశీర్వాదములు ఒకదాని వెంబడి ఒకటి అవే వస్తాయి.
దావీదు గూర్చి దేవుడు ఇచ్చిన సాక్ష్యము చూస్తే – “అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను”. అయితే దావీదును రాజుగా ఎన్నిక చెయ్యడానికి కారణము ఏమిటి?
దేవుడు జరిగించవలసిన ప్రతీ విషయమును అది మనుష్యుల ద్వారానే జరిగిస్తాడు. అంత్యదినములలో ప్రతీ ఒక్కరినీ వాడుకుంటాడు. ప్రతీ ఒక్కరి మీదా పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. దేవుని సన్నిధిలో వాడబడాలి అనే ఆశ మనము కలిగి ఉండాలి! అదే విధముగా అలా వాడబడటానికి అవసరమైన సిద్ధపాటు, లక్షణములు, ఆశ, ఆసక్తి మనము కలిగి ఉండాలి. మన అలక్ష్యమును బట్టియే దేవుడు మౌనముగా ఉంటున్నాడు, ఆయన నీ కొరకు కనిపెట్టుచున్నాడు.
దేవుడు వాగ్దానమును నెరవేర్చేవాడే గానీ, వదిలిపెట్టేవాడు కాదు. నీ దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అయితే ఒక శ్రమ దేవుడు నీ జీవితములో అనుమతిస్తున్నాడు అంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆ శ్రమకు తగిన నివారణ ఉంది. నీవు మాటి మాటికీ కృంగిపోయిన స్థితిలో ఉంటే, నిన్ను ఆయన తన మాట ద్వారా తిరిగి లేవనెత్తుతున్నాడు, బలపరుస్తున్నాదు.
అబ్రహాము ప్రతీ సారీ కుంగిపోయాడు. పిల్లలు లేకపోవడము అనేది అతని దినములలో ఎంతో బాధాకరమైనది. అయితే దేవుని మాట అతడి వాద్దకు వచ్చింది, అబ్రహామును సాక్షిగా నిలబట్టింది. నీ జీవితములో కూడా, దేవుని మాట నీ వద్దకు వస్తుంది అంటే, నిన్ను సాక్షిగా నిలబెట్టడానికే దేవుడు నీకు వాక్యమును పంపించాడు అని అర్థము చేసుకోవాలి.
మనము దేవుని కొరకు నిలబడాలి అంటే ముఖ్యమైనది మన హృదయమే! ఈ హృదయమును దేవుని మాటను బట్టి సిద్ధపరచుకోవాలి.
సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను – 1 సమూయేలు 17:37
దావీదు తన బలమును బట్టి యుద్ధములు చెయ్యలేదు గానీ, దేవుడే తన బలముగా, దేవునినే ఆధారముగా చేసుకొనినవాడుగా ఉన్నాడు. అటువంటి లక్షణమును మనము కూడా అవలంబించి, కనపరచాలి అప్పుడు మన జీవితములో కూడా దేవుడు ఘన కార్యములు చేస్తాడు.
మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱె పిల్లను ఎత్తికొని పోవుచుండగ.నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. – 1 సమూయేలు 17: 34-35.
ఈ భాగములో చూస్తే, తన తండ్రియొక్క గొర్రెల బాధ్యత దావీదుకు అప్పగించబడింది. అక్కడ దావీదు, బాధ్యత సరిగా నెరవేర్చాడు గనుకనే, దేవుడు దావీదును కనుగొన్నాడు. మనము కూడా దేవుడు మనకు ఇచ్చిన బాధ్యత మనము నెరవేర్చినపుడు, మనము కోరుకున్న స్థానమునకు దేవుడు మనలను తీసుకొని వెళతాడు.
సౌలును రాజుగా నియమించినపుడు సౌలు సమూయేలు వద్దకు నడిపించబడ్డాడు. అయితే దావీదును దేవుడు కోరుకొన్నపుడు, సమూయేలును దేవుడు దావీదు వద్దకు నడిపించాడు.
గనుక మన లక్షణములు, జీవిత విధానమును మనము సరి చేసుకొని, సిద్ధపడటము ఎంతో ముఖ్యము! Building our character is very important for God to appoint you for the assignment!
